Psalms - కీర్తనల గ్రంథము 135 | View All

1. యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా,
ప్రకటన గ్రంథం 19:5

యెహోవా పేరును స్తుతించడమంటే ఆయన పేరును పదేపదే వల్లించడం కాదు గాని ఆయన స్వభావాన్ని, లక్షణాలను, పనులను చక్కగా అర్థం చేసుకొని వాటిని గురించి మాట్లాడ్డం లేక పాడడం. స్తుతి గురించి నోట్ కీర్తనల గ్రంథము 33:1-3.

2. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి.

ఆయన సేవలో తమ సమయమంతా గడిపే గొప్ప ఆధిక్యత ఉన్నవాళ్ళకంటే ఎక్కువగా దేవుణ్ణి మరెవరు స్తుతించాలి?

3. యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.

“మంచివాడు”– కీర్తనల గ్రంథము 118:1. యెహోవాను స్తుతించడానికి రచయిత ఇస్తున్న ఐదు కారణాల్లో మొదటిది. “మనోహరం”– దేవుణ్ణి స్తుతించడం మంచిది, ఉల్లాసకరమైనది కూడా. జీవితంలో మనం చేసే అనేక పనుల విషయంలో ఇది నిజం కాదు.

4. యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు కొనెను.

నిర్గమకాండము 19:5; ద్వితీయోపదేశకాండము 7:6; మలాకీ 3:17; తీతుకు 2:14. మనం దేవుణ్ణెందుకు స్తుతించాలో ఇది మూడో కారణం – తనకోసం ఒక ప్రజను ఎన్నుకోవడంలో ఆయన చూపిన ప్రేమ. వారు ఏ విధంగానైనా మంచివారనీ, యోగ్యులనీ, నమ్మకస్థులనీ దేవుడు యాకోబునూ అతని సంతానాన్ని ఎన్నుకోలేదు. అదంతా ఆయన అనుగ్రహమే, లోకమంతటి ప్రయోజనం కోసమే. ఆదికాండము 12:1-3 నోట్.

5. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును.

“గొప్పవాడు”– మనం దేవుణ్ణెందుకు స్తుతించాలో నాలుగో కారణం. కొంతమంది మంచివారే గాని గొప్పవారు కాదు. కొంతమంది గొప్పవారే గాని మంచివారు కాదు. యెహోవా అమితమైన మంచితనం, గొప్పతనం గలవాడు. మనం దీన్ని గుర్తించి ఆయన్ను స్తుతించాలి. “నాకు తెలుసు”– దేవుని వాక్కులోను చరిత్రపరంగాను దేవుడు తన గురించి తాను వెల్లడి చేసుకున్నదాన్ని బట్టీ తన స్వానుభవాన్ని బట్టీ దేవుడు గొప్పవాడని అతడు తెలుసుకున్నాడు. “దేవుళ్ళు”– వ 15-18.

6. ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు

కీర్తనల గ్రంథము 115:3; కీర్తనల గ్రంథము 96:5; కీర్తనల గ్రంథము 97:7; దానియేలు 4:35. యెహోవా ఇంత గొప్పవాడు. తాను చేయదలచుకున్నది చేయకుండా ఎవరూ ఆయన్ను ఆపలేరు. దేవుళ్ళనబడిన ఇతరులు ఎందుకూ కొరగానివారు.

7. భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.

తన సృష్టిని, ప్రకృతి శక్తులను ఆయన పూర్తిగా అదుపు చేస్తూ ఉన్నాడు. వానదేవుడొకడు, గాలిదేవుడొకడు, ఆకాశదేవుడొకడు వేరుగా లేరు. ఏకైక నిజ దేవుడొక్కడే అన్నిటినీ తన వశంలో ఉంచుకుంటున్నాడు.

8. ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలి చూలులను ఆయన హతముచేసెను.

ఇది లోపంలేని న్యాయం. దేవుని పిల్లలను ఈజిప్ట్ వారు వేధించినందుకు ఇది ప్రతీకారం – నిర్గమకాండము 1:15-22; నిర్గమకాండము 4:23; నిర్గమకాండము 12:12.

9. ఐగుప్తూ, నీ మధ్యను ఫరోయెదుటను అతని ఉద్యోగస్థుల యెదుటను ఆయనే సూచకక్రియలను మహత్కార్యములను జరిగించెను.

10. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు.

11. అమోరీయుల రాజైన ఓగును హతముచేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను.

12. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను.

13. యెహోవా, నీ నామము నిత్యము నిలుచును యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము లుండును.

నిర్గమకాండము 3:15. దేవుని స్వభావం, లక్షణాలు శాశ్వతమైనవి, మార్పులేనివి – మలాకీ 3:6; హెబ్రీయులకు 13:8.

14. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.
హెబ్రీయులకు 10:30

దేవుణ్ణి స్తుతించడానికి రచయిత ఇస్తున్న ఐదో కారణం – ఈ లోకంలో దేవుని ప్రజలు నలుదిక్కులా అన్యాయాన్ని చవిచూస్తున్నా దేవుడు మాత్రం తన సదుద్దేశాలను వారిపట్ల నెరవేర్చుకుంటాడు.

15. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు.
ప్రకటన గ్రంథం 9:20

కీర్తనల గ్రంథము 115:4-11 నోట్స్ చూడండి.

16. వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

17. చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.

18. వాటినిచేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు.

19. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి అహరోను వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి

20. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహోవాను సన్నుతించుడి.

21. యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులోనుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |