Psalms - కీర్తనల గ్రంథము 137 | View All

1. బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి.

“బబులోను”– ఇది 2 రాజులు 25వ అధ్యాయంలో వర్ణించిన సంఘటనల తరువాత రాసిన కీర్తన. మహా శక్తివంతమైన బబులోనియా సామ్రాజ్యం యూదాను ఓడించి జెరుసలంనూ దేవుని ఆలయాన్నీ నాశనం చేసి, ప్రజలను చెరపట్టి తమ దేశానికి తీసుకుపోయారు. టైగ్రిస్, యూఫ్రటిస్ నదులు వాటి అనేకమైన పాయలు ఆ ప్రాంతంలో పారుతున్నాయి. సీయోను నాశనమై విగ్రహపూజలు చేసే క్రూరుల చేతుల్లో ఉంది. ఏడవడానికి ఇది సరైన కారణమే.

2. వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగి లించితివిు.

వారి ఆనందం పూర్తిగా పోయింది. వారిని బాధించేవారు వారిని హేళన చేస్తున్నారు. వారు గుండెలు బ్రద్దలై ఉండగా పాటలు పాడుమని అడుగుతున్నారు. న్యాయాధిపతులు 16:23-25 పోల్చి చూడండి. ఇది వారి దుఃఖాన్ని మరింత పెంచింది. వాళ్ళలా అడిగినది అసలు ఇందుకోసమే అనుకోవడంలో సందేహం లేదు.

3. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి

4. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?

5. యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.

జెరుసలం దేవుని నగరం కాబట్టి, యెహోవా ఆలయమున్న స్థలం కాబట్టి, పరలోకరాజు నివాసం కాబట్టి అది వారి హృదయాల్లోనే ఉంది.

6. నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.

7. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసికొనుము యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనముచేయుడి సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా.

విలాపవాక్యములు 4:21-22. ఎదోంవారు యాకోబు అన్న ఏశావు సంతానం. కాబట్టి వారు యూదులకు దాయాదులు (ఆదికాండము 25:24-34). బబులోనువారికి వ్యతిరేకంగా ఇస్రాయేల్‌వారికి సహాయపడవలసింది పోయి ఇస్రాయేల్‌వారి ఓటమికి సంతోషించారు.

8. పాడు చేయబడబోవు బబులోను కుమారీ, నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు
ప్రకటన గ్రంథం 18:6

యేసుప్రభువు చెప్పిన శుభవార్తను నమ్మిన వారికి ఈ మాటలు చాలా కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ కనిపించేది న్యాయం చేకూర్చాలని మొరపెట్టడం మాత్రమే – “మాకు వారు చేసినట్టుగానే నీవు వారికి చెయ్యి”. బబులోనువాళ్ళు పిల్లలకు ఎవరన్నా ఇలా చెయ్యాలని రచయిత కోరుతున్నాడంటే బబులోనువాళ్ళు ఇస్రాయేల్‌వారి పిల్లల్ని చేశారన్నమాటే. తన ప్రజలను క్రూరంగా నలగ్గొట్టిన జాతిమీదికి దేవుని ప్రతీకారం రావడం చూడాలని రచయిత ఉవ్విళ్ళూరు తున్నాడు. వారి పక్షంగా పగ సాధించడం దేవునికి న్యాయమే అయితే, తాను నిజంగా అలా చేస్తానని ఆశాభావాన్ని వారి హృదయాల్లో మొలకెత్తించడం కూడా న్యాయమే. బైబిల్లో స్పష్టంగా వెల్లడైన దేవుని ప్రతీకారం ధర్మానికి ఇదంతా అనుగుణమైనదే (కీర్తనల గ్రంథము 18:25-26; సంఖ్యాకాండము 31:1-3; ద్వితీయోపదేశకాండము 32:35 ద్వితీయోపదేశకాండము 32:41 ద్వితీయోపదేశకాండము 32:43; గలతియులకు 6:7 చూడండి).

9. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు.
లూకా 19:44Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |