Psalms - కీర్తనల గ్రంథము 141 | View All

1. యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము

“త్వరగా”– కీర్తనల గ్రంథము 22:9; కీర్తనల గ్రంథము 38:22; కీర్తనల గ్రంథము 70:5. దుర్మార్గులైన శత్రువులు దావీదును పీడిస్తున్నారు. అతడు గొప్ప అపాయంలో ఉన్నాడు (వ 7-9). “చెవిని బెట్టుకో” – కీర్తనల గ్రంథము 4:1; కీర్తనల గ్రంథము 5:1-2; కీర్తనల గ్రంథము 27:7; కీర్తనల గ్రంథము 143:1.

2. నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.
ప్రకటన గ్రంథం 5:8, ప్రకటన గ్రంథం 8:3-4

“ధూపం”– లూకా 1:9; ప్రకటన గ్రంథం 5:8; ప్రకటన గ్రంథం 8:3. ప్రార్థన ధూపం వంటిదనడానికి స్పష్టమైన విధానాలు కొన్ని ఉన్నాయి. ధూపం వెయ్యాలని దేవుని ఆజ్ఞ; దాన్ని ఆయన అంగీకరించాలంటే దేవుని ఆదేశాల మేరకే దాన్ని వెయ్యాలి; అప్పుడది యెహోవాకు పవిత్రంగా పరిమళంగా ఉండేది (నిర్గమకాండము 30:7-8, నిర్గమకాండము 30:34-38). తన ప్రార్థనలు దేవునికి అంగీకారంగా ఉండాలని దావీదు కోరుతున్నాడు. “నైవేద్యం”– కొన్ని సార్లు మాటలేమీ లేకుండానే శరీర భంగిమలే ప్రార్థనలౌతాయి, అంటే మోకరించడం, చేతులు లేక తల దేవుని వైపు ఎత్తడం మొదలైనవి. దేవుడు గతంలో ఆజ్ఞాపించిన నైవేద్యంలాగానే (నిర్గమకాండము 29:38-41) ఇలాంటి ప్రార్థనలు కూడా దేవునికి అంగీకారయోగ్యమౌతాయి.

3. యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.
యాకోబు 1:26

ప్రార్థించిన నోరే పరుషమైన, అజ్ఞానమైన, అపవిత్రమైన మాటలు కూడా పలకగలదని దావీదుకు తెలుసు. నాలుకను అదుపు చేసుకోవడం ఎంత కష్టమో కూడా అతనికి తెలుసు (యాకోబు 3:2-12 కూడా చూడండి). అందువల్ల దేవుడు తానే తన నోటి ద్వారం దగ్గర కాపలా ఉండాలని కోరుతున్నాడు.

4. పాపము చేయువారితో కూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.

దుర్మార్గులు నాయకత్వం వహిస్తూ, వర్ధిల్లుతూ ఉంటే న్యాయవంతులు కూడా వారితో రాజీపడిపోయే దుష్‌ప్రేరణకు గురి అవుతారు. దుర్మార్గులు న్యాయవంతులను చెరపడానికి వారికి ఎర (“రుచిగల పదార్థాలు”) చూపవచ్చు. నైతిక విలువలు అడుగంటినప్పుడు, అందరూ ఏదో ఒక దోషం చేస్తూ ఉన్నప్పుడు దేవుని నిజ సేవకులు కూడా అందులో చిక్కుపడవచ్చు. అలాంటి సమయాల్లో దావీదు ప్రార్థించినట్టు ప్రార్థిస్తే మంచిది.

5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను.

దుర్మార్గులు చేసే విందులో ఉండడం కంటే, న్యాయవంతుల చేతిలో దెబ్బలు తినడమే ఎంతో ఉత్తమం. చెడ్డవాడి పొగడ్తలకంటే మంచివాడి గద్దింపు మంచిది. న్యాయవంతులు తనకు చేసినది, తనతో చెప్పినది తన దిద్దుబాటు కోసమేనని దావీదుకు తెలుసు. దాన్ని అతడు సంతోషంగా ఆహ్వానించాడు (సామెతలు 27:6 పోల్చిచూడండి).

6. వారి న్యాయాధిపతులు కొండ పేటుమీదనుండి పడ ద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు.

ఎడారిలో దావీదును సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీదు ఈ కీర్తన రాసి ఉండవచ్చు. సౌలు, అతనికి సహాయం చేసేవారు కూలిపోతారనీ అప్పుడు ప్రజలు తన మాటలను అంగీకరిస్తారనీ దావీదు నమ్ముతున్నాడు.

7. ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మాయెముకలు పాతాళద్వారమున చెదరియున్నవి.

అంటే దావీదు, అతని మనుషులు మరణ ద్వారంలో ఉన్నారన్నమాట (కీర్తనల గ్రంథము 6:4-5; కీర్తనల గ్రంథము 9:13; కీర్తనల గ్రంథము 143:3).

8. యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయ కుము.

“ఆశ్రయించాను”– కీర్తనల గ్రంథము 7:1-2.

9. నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి కాపాడుము.

10. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక.

లోపంలేని న్యాయం జయించాలని చేసిన ప్రార్థన (కీర్తనల గ్రంథము 7:15; కీర్తనల గ్రంథము 35:8; కీర్తనల గ్రంథము 57:6. ఎస్తేరు 7:10; దానియేలు 6:24 చూడండి).Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |