Psalms - కీర్తనల గ్రంథము 146 | View All

1. యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము

ఈ కీర్తనలోనూ, మిగిలిన నాలుగింటిలోనూ ఏవిధమైన విన్నపాలూ, ఫిర్యాదులూ, సహాయంకోసం మొరలూ, దుఃఖమూ, కన్నీళ్ళూ, సిగ్గూ, నిరుత్సాహమూ ఇలాంటివేమీ లేవు. అంతా స్తుతి, దేవునిలో ఆనందించడం, పరలోకానికి చెందిన రుచితో నిండివున్నాయి ఈ కీర్తనలు. రచయిత యెహోవాను స్తుతించాలని అందరినీ పురిగొల్పుతున్నాడు, తనను తాను పురిగొల్పుకుంటున్నాడు. తాను హృదయపూర్వకంగా చెయ్యనిదాన్ని ఇతరులచేత చేయించడానికి ఇతడు చూడడం లేదు.

2. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను

3. రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి

4. వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.

“మట్టిలో”– కీర్తనల గ్రంథము 103:14; ఆదికాండము 3:19; యోబు 7:21; ప్రసంగి 12:7. మానవమాత్రులను నమ్ముకునేవారు మట్టి కుప్పల మీద ఆనుకుంటున్నారన్న మాటే. “అంతరించిపోతాయి”– కీర్తనల గ్రంథము 33:10; లూకా 12:16-20; 1 కోరింథీయులకు 2:6.

5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు

“యాకోబు యొక్క దేవుడు”– దేవునికున్న ఈ పేరు పాత ఒడంబడికలో 24 సార్లు కనిపిస్తున్నది. దేవుడు తన మహిమాన్వితమైన పవిత్ర నామాన్ని యాకోబుతో ఎందుకు ముడిపెట్టాడో ఆలోచిస్తే మనకు కొన్ని మంచి పాఠాలు అర్థమౌతాయి. యాకోబు పవిత్రులందరిలోకీ గొప్పవాడేమీ కాదు. అతడు అనేక రీతుల్లో దారి తప్పాడు. అతడి జీవిత చరిత్రనూ అతని సంతానమైన ఇస్రాయేల్‌వారి చరిత్రనూ పరిశీలిస్తే “యాకోబు యొక్క దేవుడు” అనే పేరులోని అంతరార్థం బోధపడుతుంది. వ్యక్తులనూ, జాతి మొత్తాన్నీ తన ఇష్టం ప్రకారం ఎన్నుకునే దేవుడాయన (రోమీయులకు 9:10-13; ఎఫెసీయులకు 1:4; ద్వితీయోపదేశకాండము 7:6-8). ఆయన కృపగల దేవుడు (రోమీయులకు 11:5; ఎఫెసీయులకు 2:8-9); తన ప్రజలు అనేక తప్పులు చేసినా తన వాగ్దానాలను మాత్రం నిలబెట్టుకునే దేవుడు (కీర్తనల గ్రంథము 89:1-2; ఆదికాండము 28:15; రోమీయులకు 11:29; తీతుకు 1:2; హెబ్రీయులకు 13:5); ఆయన గొప్ప సహనాన్ని చూపే దేవుడు (నిర్గమకాండము 34:6; 2 పేతురు 3:15); పాపులను పవిత్రులుగా మార్చే దేవుడు (ఆదికాండము 32:24-28; రోమీయులకు 8:29; 2 కోరింథీయులకు 3:18; 2 కోరింథీయులకు 5:17; 1 యోహాను 3:2). ఈ కీర్తనలోని మిగిలిన వచనాల్లో ఆయన ఎలాంటి దేవుడో కొంతవరకు కనిపిస్తున్నది. యాకోబు యొక్క దేవుణ్ణి తనకు సహాయకుడుగా కలిగినవాడు నిజంగా ధన్యుడు. “ధన్యజీవులు”– కీర్తనల గ్రంథము 1:1; కీర్తనల గ్రంథము 119:1.

6. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.
అపో. కార్యములు 4:24, అపో. కార్యములు 14:15, అపో. కార్యములు 17:24, ప్రకటన గ్రంథం 10:6, ప్రకటన గ్రంథం 14:7

అలాంటివారు ఎందుచేత ధన్యులో ఈ వచనాలు చెప్తున్నాయి. యెహోవాదేవుడు సర్వశక్తి గల సృష్టికర్త; పరిపూర్ణమైన విశ్వసనీయత గలవాడు; తన ప్రజలపట్ల తన వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ఆయన్నెవరూ అడ్డగించలేరు (వ 6; కీర్తనల గ్రంథము 18:25; కీర్తనల గ్రంథము 108:4; కీర్తనల గ్రంథము 117:2; ద్వితీయోపదేశకాండము 7:9). ఆయన ఆకలి బాధితుల, పేదల పీడితుల పక్షాన ఉన్నాడు (వ 7; కీర్తనల గ్రంథము 103:6; కీర్తనల గ్రంథము 74:21; యెషయా 42:6-7; లూకా 4:18-19). ఆయన మనుషులపై, ముఖ్యంగా న్యాయవంతులపైనా అవసరతలో ఉన్నవారిపైనా నిస్సహాయులపైనా అమితమైన జాలి చూపుతాడు (వ 8,9; కీర్తనల గ్రంథము 10:18; నిర్గమకాండము 22:22; లేవీయకాండము 19:34; లేవీయకాండము 10:18; మత్తయి 9:29-30; మత్తయి 12:22; లూకా 13:10-13; 2 కోరింథీయులకు 4:4-6; యాకోబు 1:27). ఆయన శాశ్వతం ఏలే రాజు. భూరాజులు మట్టిలో కలిసిపోతారు. వారి ఆలోచనలు అంతరించిపోతాయి గాని దేవుని తలంపులు ఎన్నడూ చెక్కుచెదరవు (వ 10; కీర్తనల గ్రంథము 33:11). అవి నిరంతరమూ నిలిచి ఉంటాయి. ఈ దేవుడు, అంటే యాకోబు యొక్క దేవుడు, ఏకైక నిజ దేవుడు తమ దేవుడుగా ఉన్నవారు నిజంగా ధన్యులు.

7. బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును.

8. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు

9. యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.

10. యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయునుShortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |