Psalms - కీర్తనల గ్రంథము 18 | View All

1. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.

1. How I love you, LORD! You are my defender.

2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.
లూకా 1:69

2. The LORD is my protector; he is my strong fortress. My God is my protection, and with him I am safe. He protects me like a shield; he defends me and keeps me safe.

3. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును.

3. I call to the LORD, and he saves me from my enemies. Praise the LORD!

4. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను
అపో. కార్యములు 2:24

4. The danger of death was all around me; the waves of destruction rolled over me.

5. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను

5. The danger of death was around me, and the grave set its trap for me.

6. నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.
యాకోబు 5:4

6. In my trouble I called to the LORD; I called to my God for help. In his temple he heard my voice; he listened to my cry for help.

7. అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.

7. Then the earth trembled and shook; the foundations of the mountains rocked and quivered, because God was angry.

8. ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను

8. Smoke poured out of his nostrils, a consuming flame and burning coals from his mouth.

9. నిప్పుకణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మియుండెను.

9. He tore the sky open and came down with a dark cloud under his feet.

10. కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.

10. He flew swiftly on his winged creature; he traveled on the wings of the wind.

11. గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసికొనెను.

11. He covered himself with darkness; thick clouds, full of water, surrounded him.

12. ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను.

12. Hailstones and flashes of fire came from the lightning before him and broke through the dark clouds.

13. యెహోవా ఆకాశమందు గర్జనచేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను.

13. Then the LORD thundered from the sky; and the voice of the Most High was heard.

14. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుమెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను.

14. He shot his arrows and scattered his enemies; with flashes of lightning he sent them running.

15. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగానీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను.

15. The floor of the ocean was laid bare, and the foundations of the earth were uncovered, when you rebuked your enemies, LORD, and roared at them in anger.

16. ఉన్నత స్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

16. The LORD reached down from above and took hold of me; he pulled me out of the deep waters.

17. బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్టులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.

17. He rescued me from my powerful enemies and from all those who hate me--- they were too strong for me.

18. ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను.

18. When I was in trouble, they attacked me, but the LORD protected me.

19. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్నుతప్పించెను.

19. He helped me out of danger; he saved me because he was pleased with me.

20. నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

20. The LORD rewards me because I do what is right; he blesses me because I am innocent.

21. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను

21. I have obeyed the law of the LORD; I have not turned away from my God.

22. ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నాను ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను

22. I have observed all his laws; I have not disobeyed his commands.

23. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.

23. He knows that I am faultless, that I have kept myself from doing wrong.

24. కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

24. And so he rewards me because I do what is right, because he knows that I am innocent.

25. దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు

25. O LORD, you are faithful to those who are faithful to you; completely good to those who are perfect.

26. సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు దువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు

26. You are pure to those who are pure, but hostile to those who are wicked.

27. శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.

27. You save those who are humble, but you humble those who are proud.

28. నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును

28. O LORD, you give me light; you dispel my darkness.

29. నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.

29. You give me strength to attack my enemies and power to overcome their defenses.

30. దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.

30. This God---how perfect are his deeds! How dependable his words! He is like a shield for all who seek his protection.

31. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?

31. The LORD alone is God; God alone is our defense.

32. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.

32. He is the God who makes me strong, who makes my pathway safe.

33. ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు.

33. He makes me sure-footed as a deer; he keeps me safe on the mountains.

34. నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.

34. He trains me for battle, so that I can use the strongest bow.

35. నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.

35. O LORD, you protect me and save me; your care has made me great, and your power has kept me safe.

36. నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.

36. You have kept me from being captured, and I have never fallen.

37. నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.

37. I pursue my enemies and catch them; I do not stop until I destroy them.

38. వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ ద్రొక్కుదును

38. I strike them down, and they cannot rise; they lie defeated before me.

39. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి

39. You give me strength for the battle and victory over my enemies.

40. నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని

40. You make my enemies run from me; I destroy those who hate me.

41. వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన వారికుత్తరమియ్యకుండును.

41. They cry for help, but no one saves them; they call to the LORD, but he does not answer.

42. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితిని వీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని.

42. I crush them, so that they become like dust which the wind blows away. I trample on them like mud in the streets.

43. ప్రజలు చేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు

43. You saved me from a rebellious people and made me ruler over the nations; people I did not know have now become my subjects.

44. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు

44. Foreigners bow before me; when they hear me, they obey.

45. అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.

45. They lose their courage and come trembling from their fortresses.

46. యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక.

46. The LORD lives! Praise my defender! Proclaim the greatness of the God who saves me.

47. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.

47. He gives me victory over my enemies; he subdues the nations under me

48. ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు

48. and saves me from my foes. O LORD, you give me victory over my enemies and protect me from violent people.

49. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదనునీ నామకీర్తన గానము చేసెదను.
రోమీయులకు 15:9

49. And so I praise you among the nations; I sing praises to you.

50. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు

50. God gives great victories to his king; he shows constant love to the one he has chosen, to David and his descendants forever.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Psalms - కీర్తనల గ్రంథము 18 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవుడు తన కొరకు చేసిన విమోచనలను బట్టి దావీదు సంతోషిస్తాడు. (1-19) 
ప్రారంభ పదాలు, "ఓ ప్రభూ, నా బలానికి మూలమైన ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను," ఈ కీర్తన యొక్క ప్రధాన ఇతివృత్తంగా మరియు సారాంశంగా పనిచేస్తాయి. దేవుని పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉన్నవారు ఆయనలో తమ కదలని శిలగా మరియు నమ్మదగిన ఆశ్రయం వలె ఆయనలో విజయాన్ని కనుగొనగలరు, వారు ఆయనను నమ్మకంగా పిలుచుకునేలా చేయగలరు. ఆశీర్వాదంలోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించడం మనకు ప్రయోజనకరం, అది దేవుని శక్తిని మరియు దానిలో మన పట్ల ఆయన దయను నొక్కి చెబుతుంది. దావీదు భక్తుడైన అభ్యర్ధి, మరియు దేవుడు అతని ప్రార్థనలను ప్రతిస్పందించే శ్రోతగా స్థిరంగా నిరూపించుకున్నాడు. మనం ఆయన చేసినంత శ్రద్ధగా ప్రార్థిస్తే, మన ప్రార్థనలు కూడా ఆయన చేసినంత ప్రభావవంతంగా ఉంటాయి. దేవుడు తన ఉనికిని గూర్చిన లోతైన వెల్లడి యొక్క వృత్తాంతం హెబ్రీయులకు 5:7లో విస్తృతంగా వివరించబడింది. దేవుడు భూమిని వణుకుతున్నట్లు మరియు రాళ్ళు చీలిపోయేలా చేసాడు, చివరికి అతని పునరుత్థానంలో అతనిని విడిపించాడు, ఎందుకంటే అతను దావీదు మరియు అతని మిషన్‌లో ఆనందించాడు.

దేవుడు తొలగించిన తన యథార్థతను అతడు ఓదార్పును పొందుతాడు. (20-28) 
ప్రభువు మార్గాన్ని విడిచిపెట్టేవారు, వాస్తవానికి, తమ దేవుని నుండి దూరంగా ఉంటారు. అనేక తప్పుల గురించి మనకు తెలిసినప్పటికీ, మన దేవుణ్ణి విడిచిపెట్టడానికి మనం ఎన్నడూ చెడు ఎంపిక చేసుకోకూడదు. దావీదు నిలకడగా దేవుని ఆజ్ఞలపై తన దృష్టిని తన మార్గదర్శక సూత్రంగా ఉంచాడు. మనల్ని అతి సులభంగా చిక్కుల్లో పడేసే పాపాన్ని నివారించాలనే దృఢమైన నిబద్ధత దేవుని ముందు మన యథార్థతను ప్రదర్శిస్తుంది. ఇతరులపై దయ చూపే వారికి కూడా దయ అవసరం. దేవునికి నమ్మకంగా ఉండేవారు, ఆయన తమకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడని తెలుసుకుంటారు.
ప్రభువు మాటలు కల్మషం లేనివి మరియు పూర్తిగా నమ్మదగినవి, అచంచలమైన విశ్వాసానికి మూలం మరియు ఆదరించడానికి సంతోషకరమైనవి. లేవీయకాండము 26:21-24లో చెప్పబడినట్లుగా, దేవుణ్ణి వ్యతిరేకించి, ఆయన మార్గాలకు విరుద్ధంగా నడుచుకునే వారు ఆయన ప్రతిఘటనను అనుభవిస్తారు. దావీదు చెప్పిన దయగల బహుమతులు సాధారణంగా స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో పనిచేసే వారికి అందించబడతాయి. కాబట్టి, అతను వినయస్థులకు ఓదార్పునిచ్చాడు మరియు గర్విష్ఠులకు ఒక హెచ్చరికను జారీ చేస్తాడు: "మీరు అహంకారపు చూపులను తగ్గించుకుంటారు." అతను తనలో తాను ప్రోత్సాహాన్ని కూడా పొందుతాడు: "మీరు నా దీపాన్ని వెలిగిస్తారు." దీనర్థం, దేవుడు అతని దుఃఖపూరితమైన ఆత్మను పునరుజ్జీవింపజేస్తాడు మరియు ఓదార్పునిస్తాడని, ఉచ్చులను నివారించడానికి అతని మార్గాన్ని నడిపిస్తాడు మరియు అతనికి సేవ చేయడానికి అవకాశాలను కల్పిస్తాడు.
చీకటిలో నావిగేట్ చేసే మరియు నిరుత్సాహాన్ని ఎదుర్కొంటున్న వారికి, హృదయపూర్వకంగా ఉండండి; దేవుడు స్వయముగా కాంతి దీవిగా ఉంటాడు.

అతను తన శక్తివంతమైన పనులన్నిటికి మహిమను దేవునికి ఇస్తాడు. (29-50)
దయతో కూడిన ఒక చర్యకు మనం ప్రశంసలు అందజేస్తున్నప్పుడు, మన జీవితమంతా మన చుట్టూ ఉన్న లెక్కలేనన్ని ఇతరులను మనం గమనించాలి. దావీదు యొక్క ఔన్నత్యం అనేక కారణాల ఫలితంగా ఉంది మరియు అతను వాటన్నింటిలో దేవుని హస్తాన్ని గుర్తించి, మనం అనుసరించడానికి ఒక ఉదాహరణను ఉంచాడు. 32వ వచనంలో మరియు తదుపరి శ్లోకాలలో, ఆధ్యాత్మిక యోధుడికి దేవుడు ప్రసాదించిన బహుమతులను, వారి విజయవంతమైన నాయకుడి నమూనాను అనుసరించి, యుద్ధానికి వారిని సన్నద్ధం చేయడాన్ని మనం చూస్తాము. క్రీస్తు నుండి విముక్తిని కోరుకునే వారు చివరికి తిరస్కరించబడతారని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్రోటోటైప్ అయిన దావీదు‌లో, క్రీస్తు ద్వారా కష్టాల నుండి విముక్తిని మనం చూస్తాము.
ప్రార్థన ఆరోహణ, యేసు మా విమోచకుడు మాకు పునరుద్దరించటానికి, దుఃఖాలు మరియు భక్తిహీన శక్తుల దాడి చుట్టుముట్టబడిన శత్రువులతో సంఘర్షణ చిత్రీకరిస్తుంది. ఇది మరణ వేదనలను మాత్రమే కాకుండా మన తరపున దేవుని కోపాన్ని భరించడాన్ని కూడా కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఈ మధ్యలో, యేసు సమాధి నుండి బయటకు వచ్చి, అంతిమ శత్రువు అయిన మరణాన్ని జయించడంతో ముగుస్తుంది మరియు ఇతర శత్రువులందరినీ పునరుద్దరించటానికి మరియు లొంగదీసుకోవడానికి ముందుకు సాగుతూ తీవ్రమైన ఏడుపు మరియు కన్నీళ్లతో తండ్రిని పిలుస్తాడు.
మన శక్తి మరియు రక్షణకు మూలమైన ప్రభువును మనము హృదయపూర్వకంగా ప్రేమించాలి. ప్రతి పరీక్షలో, మనం ఆయనను పిలవాలి మరియు ప్రతి విమోచన కోసం, మనం ప్రశంసలు అందజేయాలి. మన లక్ష్యం నీతి మరియు నిజమైన పవిత్రతతో నడుచుకుంటూ, పాపం నుండి దూరంగా ఉండటమే. మనం ఆయనకు చెందినవారైతే, ఆయన మన తరపున విజయం సాధిస్తాడు మరియు పరిపాలిస్తాడు, మరియు మనం అతని ద్వారా జయించి పరిపాలిస్తాము. మన అభిషిక్త రాజు వారసులందరికీ ఇప్పుడు మరియు ఎప్పటికీ వాగ్దానం చేసిన దయలో మేము పాలుపంచుకుంటాము. ఆమెన్.



Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |