Psalms - కీర్తనల గ్రంథము 20 | View All

1. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.

“నీకు”– యుద్ధాన్ని ఎదుర్కోనున్న సమయంలో రాజుకోసం ప్రార్థనగా ఈ కీర్తనను రచించడం జరిగినట్టుంది. ఇది గాయకుల నాయకుని కోసం – అంటే సభలో పాడదగినదన్న మాట. మొదటి 5 వచనాల్లో తమ రాజు క్షేమం విషయంలో ప్రజల శుభాకాంక్షలు ఉన్నాయి. “యాకోబు యొక్క దేవుడు”– కీర్తనల గ్రంథము 146:5 నోట్.

2. పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాక సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.

3. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాకనీ దహనబలులను అంగీకరించును గాక.

4. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.

5. యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాముమా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.

6. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపునుతన పరిశుద్ధాకాశములో నుండి అతని కుత్తరమిచ్చును.

ఇప్పటివరకు, “మేము” అంటూ సాగిన ఈ సంకీర్తనలో ఇక్కడినుంచి “నేను” అంటూ ఏకవచనం కనిపిస్తుంది. బహుశా అప్పుడు ఎవరో ఒక యాజి లేక లేవీగోత్రికుడు, ప్రధాన గాయకుడు ఈ మాటలు పాడాలేమో. ఇక్కడ “అభిషిక్తుడు” అంటే యేసుప్రభువు అని భావించడం తప్పుకాదు. యూదులకు రాజుగా జన్మించినవానికి (మత్తయి 1:1; మత్తయి 2:2-6) ఇస్రాయేల్‌కి రాజు సూచన.

7. కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.

ఇక్కడ మళ్ళీ బహువచనం. ప్రజలంతా కలిసి దేవునికి తమ నిబ్బరాన్నీ ఆనందాన్నీ వెల్లడి చేస్తున్నారు. కీర్తనల గ్రంథము 33:16-18; 1 సమూయేలు 17:45; ద్వితీయోపదేశకాండము 20:2-4.

8. వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.

ఒక మనిషి దేనిపై నమ్మకం పెట్టుకుంటాడు అన్న విషయంపై చాలా మట్టుకు అతని జీవితంలోని అనుభవాలు, ఫలితాలు మంచివో కావో ఆధారపడి ఉంటుంది (కీర్తనల గ్రంథము 32:10; కీర్తనల గ్రంథము 34:8; సామెతలు 11:28; సామెతలు 28:26; యెషయా 31:1-3; యెషయా 42:17; యెషయా 47:10-11; యిర్మియా 7:4 యిర్మియా 7:8 యిర్మియా 7:14-15; యిర్మియా 13:24-25; యిర్మియా 17:5 యిర్మియా 17:7; యెహెఙ్కేలు 33:13; హోషేయ 10:13; అపో. కార్యములు 16:31).

9. యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక.

యెహోవాయే నిజమైన శాశ్వతుడైన రాజు అన్న గుర్తింపు ఇక్కడ కనిపిస్తున్నది. సత్యంతో, ఆత్మతో ప్రార్థన చేసేవారు తమ ప్రార్థనలకు జవాబును ఆశిస్తారు. కేవలం ఆచారం కోసం ప్రార్థించడంతో వారు సంతృప్తి చెందరు.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |