Psalms - కీర్తనల గ్రంథము 28 | View All

1. యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.

“ఆధారశిల”– ద్వితీయోపదేశకాండము 32:4 చూడండి. తన ప్రార్థనల వల్ల ఫలితాలను చూడాలని ఆశించాడు. దేవునినుంచి జవాబు రానిదే అతనికి తృప్తి లేదు. మన ప్రార్థనల్లో కూడా ఇదే పట్టుదల ఉండాలి. ఏదో మొక్కుబడికన్నట్టు చేసే చల్లారిపోయిన, జీవం లేని ప్రార్థనలు ఎందుకూ కొరగానివి.

2. నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము.

3. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు

ఇది సాధ్యమేనని దావీదుకు అనిపించిందా? తన భ్రష్ట స్వభావం గురించి దావీదుకు బాగా తెలుసు.

4. వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయుము. వారు చేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము.
మత్తయి 16:27, 2 తిమోతికి 4:14, 1 పేతురు 1:17, ప్రకటన గ్రంథం 20:12-13, ప్రకటన గ్రంథం 22:12

5. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును.

దుర్మార్గులు తనకేదో హాని చేశారని కాదు, దేవుని పట్ల వారు చూపే మనసును బట్టి వారికి శిక్ష రావాలని దావీదు కోరాడు. తన శత్రువులకు తీర్పు తీర్చాలని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడంటే అది వ్యక్తిగతమైన పగవల్ల కాదు.

6. యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక.

7. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.

“డాలు”– కీర్తనల గ్రంథము 3:3; కీర్తనల గ్రంథము 5:12; కీర్తనల గ్రంథము 18:35; కీర్తనల గ్రంథము 32:7 కీర్తనల గ్రంథము 32:10; కీర్తనల గ్రంథము 33:20; ఆదికాండము 15:1. దేవుడెన్నుకున్న వారి పైకి ఆయన అనుమతించినవి తప్ప మరేవి బయటనుంచి రావడానికి వీల్లేదు. వారి విషయంలో తన సంకల్పం కాని వాటన్నిటినుంచి ఆయన వారిని సంరక్షిస్తాడు. సైతానునుంచీ దుర్మార్గులనుంచీ ఆయనే వారికి ఆశ్రయం. నమ్మకముంచే హృదయానికి ఇది ఎంత సంతోషం! “కృతజ్ఞత”– కీర్తనల గ్రంథము 7:17; లేవీయకాండము 7:12-13 మొ।।

8. యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము.

“బలం”– కీర్తనల గ్రంథము 18:1; కీర్తనల గ్రంథము 21:1; కీర్తనల గ్రంథము 68:28; కీర్తనల గ్రంథము 84:5; నిర్గమకాండము 15:2; యెషయా 12:2; యెషయా 40:31; 1 దినవృత్తాంతములు 16:11. “అభిషిక్తుడు”– ఇస్రాయేల్‌వారిపై రాజుగా దావీదు అభిషేకం పొందాడు. అయితే ఆ దావీదు కుమారుడు అభిషిక్తుడైన యేసుప్రభువును కూడా మనమిక్కడ చూడగలం. క్రీస్తుకు సంభవించినదంతా దేవుని సంకల్పానుసారమే జరిగింది (యోహాను 18:11; అపో. కార్యములు 2:22-23).

9. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |