Psalms - కీర్తనల గ్రంథము 38 | View All

1. యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము.

ఇది పశ్చాత్తాప కీర్తనల్లో ఒకటి. వ్యక్తిగత పాపాల గురించి విలపించే గీతం. ఇలాంటివే ఇతర కీర్తనలు 6, 31, 32 51. ఇక్కడ దావీదు తన శారీరక అస్వస్థత, తన మానసిక వేదన, తన స్నేహితుల అలక్ష్యం గురించి రాస్తున్నాడు. వీటన్నిటికీ కారణం తన పాపమేనని గుర్తించాడు. తన స్థితిని బట్టి వ్యర్థంగా అనవసరంగా సణుక్కోకుండా దావీదు ఇక్కడ తన పాపాలను ఒప్పుకుంటూ తన హృదయాన్ని దేవుని ఎదుట తెరుస్తున్నాడు. ఇది మనందరికీ మంచి ఆదర్శం. ఈ భాగం కీర్తనల గ్రంథము 6:1-10; కీర్తనల గ్రంథము 31:9-12; కీర్తనల గ్రంథము 102:3-11 లాంటిదే. కీర్తనల గ్రంథము 6:1.

2. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది.

ద్వితీయోపదేశకాండము 32:23; యోబు 6:4.

3. నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.

4. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి.

ప్రతి ఒక్క మనిషి విషయంలోనూ ఇది సత్యమే గాని అందరూ దీన్ని గ్రహించరు.

5. నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.

6. నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.

పాపాల విషయంలో ఒప్పించబడడం ఎంతో బాధకరమైన అనుభవం (17,18 వ).

7. నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు.

8. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను

9. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.

10. నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను.

11. నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు
లూకా 23:49

స్నేహితులు సానుభూతి చూపకపోవడం అతని దుఃఖాన్ని ఇంకా ఎక్కువ చేసింది (కీర్తనల గ్రంథము 31:11; యోబు 19:13-19).

12. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డు చున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.

న్యాయవంతుడు పడిపోతే అతని శత్రువులు అతణ్ణి మరో తన్ను తన్నేందుకు ప్రయత్నించి అతని దురవస్థను చూచి ఆనందిస్తారు (16 వ).

13. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.

యోబులాగా కాక అతడు తనను తాను సమర్థించుకోలేక ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నాడు. తన పాపం తనకు తెలుసు.

14. నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.

15. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను.

నోరెత్తకుండా దేవునికి లోబడుతున్నాడు దావీదు. తనకు సంభవించినదంతా తన పాపం వల్లే అని దావీదుకు బాగా తెలుసు. అతను తన పాపం ఒప్పుకున్నాడు. ఇప్పుడిక దేవుడు తనకు విజయమిస్తాడన్న నమ్మకం అతనికి వచ్చింది.

16. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.

17. నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.

18. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను.

19. నా శత్రువులు చురుకైనవారును బలవంతులునై యున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు.

కీర్తనల గ్రంథము 35:19; కీర్తనల గ్రంథము 37:14.

20. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి

నాలుగో వచనంలో అతి ఘోరమైన తన పాపాన్ని గురించి దావీదు మాట్లాడాడు. అయితే ఇక్కడ మంచిని చెయ్యాలన్న తన అభిలాషను బయట పెడుతున్నాడు. అంటే తన పాపంలోనే నిలిచి ఉండడం అతను అంగీకరించడం లేదన్నమాట. దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని నిశ్చయించు కున్నాడు. ఇలాంటి ఆశ, నిర్ణయం లేకుండా పాపాన్ని ఒప్పుకోవడం వ్యర్థం. తన బ్రతుకు తీరు అంతా మంచి చెయ్యడం వైపే మొగ్గుతున్నదనీ, పాపం చేయడమన్నది అప్పుడప్పుడూ తలెత్తితే అది మామూలు సంగతి కాదనీ, అది క్రమం నుంచి తొలగిపోవడం మాత్రమే అనీ అతని ఉద్దేశం. పందుల్లాగా గొర్రెలు కూడా బురదలోనే నిలిచి జలకాలాడవు గదా.

21. యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము.

పశ్చాత్తాపం పొందిన హృదయం నుంచి వెలువడే ఇలాంటి ప్రార్థనలు దేవుని చెవికి ఇంపైన సంగీతంలా ఉంటాయి.

22. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.