Psalms - కీర్తనల గ్రంథము 47 | View All

1. సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.

భూజనాలన్నిటికీ సత్య దేవుని చర్యలను బట్టి చూస్తే ఆనందానికి గొప్ప కారణం ఉంది. ఒక కారణం వ 2లో కనిపిస్తున్నది.

2. యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.

ఇస్రాయేల్‌వారి దేవుడైన యెహోవా ఏదో ఒక గోత్రానికే దేవుడు కాదు, ఒక జాతివారికి మాత్రమే దేవుడు కాదు. ఆయన ఉనికిలో ఉన్న ఏకైక దేవుడు. విశ్వానికి సృష్టికర్త (యెషయా 45:21-22). అన్ని జాతులకూ, ప్రభుత్వాలకూ పైగా ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అంటే పవిత్రతలోను, న్యాయం, కృప, ప్రేమలలో లోపంలేనివాడు మానవాళి అంతటిమీదా పరిపాలన చేస్తున్నాడు. ఇది ఆనంద కారణం కాదా (వ 6-9). “గొప్ప రాజు”– కీర్తనల గ్రంథము 5:2; కీర్తనల గ్రంథము 24:8; కీర్తనల గ్రంథము 95:3; యెషయా 6:5; యెషయా 33:22; యెషయా 43:15; యిర్మియా 10:6-7 యిర్మియా 10:10; దానియేలు 4:34-37; మలాకీ 1:14; 1 తిమోతికి 1:17; 1 తిమోతికి 6:15; ప్రకటన గ్రంథం 15:3; ప్రకటన గ్రంథం 17:14; ప్రకటన గ్రంథం 19:16. కొంతమంది దేవుని పరిపాలన విధానాన్ని ప్రశ్నిస్తూ ఇలా అడుగుతారు: “దేవుడు లోకమంతటిమీదా గొప్ప రాజు గనుక అయితే భూమిమీద పరిస్థితులు ఎందుకు ఇంత భయంకరంగా ఉన్నాయి? దుష్టత్వం ఎందుకు పైచేయిగా ఉంది? అమాయకులు, నిర్దోషులు ఎందుకు బాధలకు గురి అవుతున్నారు? పేదలు, బలహీనులు ఎందుకు ధనికుల, బలవంతుల పాదాల కింద తొక్కబడుతున్నారు? విపత్తులు ఎందుకు వస్తాయి – వర్షం లేమి, తుఫానులు, భూకంపాలు, వరదలు? ఇలాంటి ప్రశ్నలు వేస్తూ దేవుడనేవాడు బొత్తిగా లేడని కొందరు అంటారు. ఒకవేళ దేవుడు ఉంటే ఇప్పటి పరిస్థితులు ఉండేవి కావు, అంతా వేరుగా ఉంటుంది అంటూ బల్ల గుద్ది చెప్తారు. అయితే ఇది మంచి వేదాంతం కాదు, బుద్ధికి అనుగుణం కాదు (కీర్తనల గ్రంథము 14:1 నోట్ చూడండి). అలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు మనం కొన్ని ప్రాముఖ్యమైన బైబిలు సత్యాలను మన ఆలోచనల్లో విడిచిపెట్టకూడదు. లోకం ఇప్పటి పరిస్థితులలో ఎందుకు ఉన్నదంటే దేవుడు లేకపోవడం వల్ల కాదు, ఆయన సరిగా పాలించకపోవడం వల్లా కాదు గాని మొత్తం మీద మానవత దేవుని పరిపాలనను అంగీకరించకపోవడం వల్లనే. మనుషులు పాపులు, దోషులు, విశ్వానికి ఉన్న గొప్ప రాజుమీద తిరగబడుతూ ఉన్నారు. లోకాన్ని పాడు చేస్తున్నది వారే గాని దేవుడు కాదు. కీర్తనల గ్రంథము 14:2-3; ఆదికాండము 6:5-7 ఆదికాండము 6:11-12; ఆదికాండము 8:21; యెషయా 24:5; రోమీయులకు 1:18-32; ప్రకటన గ్రంథం 11:18. దేవుని నుంచి మంచిది ఏదైనా పొందడానికి మానవాళి యోగ్యమైనది కాదు. అయినా అనేక మేలులను పొందుతూ ఉన్నది. మనుషులలో అధిక సంఖ్యాకులు ఈ మంచివాటిని తీసుకొని, పరమ రాజుకు కృతజ్ఞత ఏమీ చెప్పకుండా, వాటిని దుర్వినియోగం చేస్తుంటారు. వాటి కంటే ఇంకా మంచివాటిని దేవుడు తమకివ్వకపోతే ఆయనమీద సణుగుతారు. అనేకులు దేవుని పేరు వ్యర్థంగా పలకడం, లేక దూషించడం, లేక దేవుని మీద ఫిర్యాదులు చేయడం కోసం తప్ప దేవుని పేరు పలకరు. దేవుడు న్యాయవంతుడైన పరిపాలకుడుగా దుర్మార్గులమీదికి శిక్షలు పంపాలి. అలా చేయకపోతే ఆయన న్యాయవంతుడు అయివుండేవాడు కాదన్నమాట. మనిషిలోని నెమ్మది లేని, అత్యాశ గల గుణాన్ని, తిరగబడే స్వభావాన్ని అదుపులో ఉంచడానికి వేరువేరు విధానాలనూ సాధనాలనూ ఉపయోగిస్తాడు దేవుడు. కొన్ని సార్లు అవి కఠినమైనవి, తీవ్రమైనవి. ఆయన ఇలా చేయడం తప్పు కాదు (ప్రకటన గ్రంథం 16:5-7; 2 థెస్సలొనీకయులకు 1:6). నిజంగా దేవుని తీర్పులు ఎప్పుడూ లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఆ తీర్పులన్నీ న్యాయమైనవి. వ్యక్తుల పట్ల, జాతులపట్ల, మానవత అంతటి పట్లా ఆయన వ్యవహారాలన్నీ ఎప్పుడూ న్యాయసమ్మతమే – కీర్తనల గ్రంథము 33:5; కీర్తనల గ్రంథము 89:14. దీన్ని అంగీకరించవలసింది నమ్మకం మూలంగానే. బైబిలులో దేవుడు తన గురించి వెల్లడి చేసిన సత్యాలను మనం నమ్మితే భూలోకం మీద ఆయన పరిపాలన గురించి ఆనందించగలం (ఇలా చేయాలని వ 1 చెప్తున్నది గదా). మనం అలా నమ్మితే దేవుడు ఎవరి విషయంలోనూ ఎప్పుడూ ఏ తప్పూ, అన్యాయమైనదేదీ చేయడని గ్రహించగలం. ఆయన తాను ఏమేమి చేస్తున్నాడో తనకు తెలుసుననీ మనకు తెలియని ఆలోచనలూ మార్గాలూ ఆయనకు ఉన్నాయనీ అవి మన గ్రహింపుకు అతీతం (యెషయా 55:8-9; రోమీయులకు 11:33-36) అనీ మనం గ్రహించగలం. ఆయన స్వభావంలోనూ చర్యలలోనూ దేవుడు భయభక్తులకు పాత్రుడు, సంపూర్ణమైన నమ్మకానికి యోగ్యుడు. ఈ సత్యంలో మనకు మనశ్శాంతి లభిస్తుంది.

3. ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును.

ఆనందానికి మరో కారణం దేవుడు తాను ఎన్నుకొన్న ఇస్రాయేల్‌ప్రజల విషయంలో జరిగించిన కార్యక్రమాలు. ఈ వచనాలు గతంలో ఎంత చక్కగా నెరవేరినప్పటికీ, భవిష్యత్తులో మరింత సంపూర్ణమైన నెరవేర్పు కలగబోతుంది (యెషయా 2:1-4; యెషయా 9:6-7; యెషయా 11:1-10; మత్తయి 19:28; అపో. కార్యములు 1:6; ప్రకటన గ్రంథం 20:4-6). భూమి అంతా యేసుప్రభువు ఆధీనంలోకి ఆయనతోపాటు ఆయనలో నమ్మకముంచినవారి అధికారం క్రిందికి వస్తుంది. దేవుడే మన వారసత్వాన్ని నియమించాలని ఆ సంగతి ఆయనకు అప్పగించి ఊరుకుంటే అది ఏమిటి? ఎంత వస్తుంది? అన్న విషయంలో ఆందోళన చెందనక్కరలేదు (అపో. కార్యములు 20:32; అపో. కార్యములు 26:18; ఎఫెసీయులకు 1:11 ఎఫెసీయులకు 1:14; కొలొస్సయులకు 1:12; హెబ్రీయులకు 9:15; 1 పేతురు 1:4).

4. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పద ముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు.

5. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను.
మార్కు 16:19, లూకా 24:51, యోహాను 6:62, అపో. కార్యములు 1:9, ఎఫెసీయులకు 4:9

ఘన విజయం సాధించి యెహోవాదేవుడు తన సింహాసనం దగ్గరికి పైకి వెళ్ళిపోయినట్టు ఇక్కడ చూస్తున్నాం. యెహోవా అవతారమైన యేసుప్రభువు సైతాను శక్తులన్నిటిపైనా యుద్ధమాడి గెలిచి మహిమలోకి ప్రవేశించిన రోజును ఇది మనకు గుర్తుకు తెస్తున్నది (లూకా 24:50-52; అపో. కార్యములు 1:9-11; ఎఫెసీయులకు 4:7-10).

6. దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.

“స్తుతి”– కీర్తనల గ్రంథము 33:1 నోట్.

7. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.

9. జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయెను.

పాత ఒడంబడిక కాలాన్ని దాటి భవిష్యత్తులోకి చూస్తున్నది ఈ వచనం. ఇస్రాయేల్‌కు, ఇతర జనాలకు మధ్య ఉన్న గోడ కూలిపోయి ఇతర జనాల పాలకులు ఇస్రాయేల్‌ప్రజతో పాటు ఏకైక నిజ దేవుణ్ణి ఆరాధించే కాలం ఇది (ఎఫెసీయులకు 2:11-18; ఎఫెసీయులకు 3:6 పోల్చిచూడండి). కీర్తనల గ్రంథము 89:18. మానవాళి పట్ల తన మంచి సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు దేవుడు ఈ భూమిని కాపాడుతూ ఉంటాడు. ఈ లోక రాజులకున్న అధికారమంతా నిజానికి దేవునికి చెందినదే (రోమీయులకు 13:1-5).Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |