Psalms - కీర్తనల గ్రంథము 55 | View All

1. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.

కీర్తనల గ్రంథము 5:1; కీర్తనల గ్రంథము 17:6; కీర్తనల గ్రంథము 54:2; కీర్తనల గ్రంథము 61:1; కీర్తనల గ్రంథము 86:6 చూడండి. దావీదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడో మనకు తెలియదు. 2 సమూ 15–17 అధ్యాయాల్లో కనిపించే అబ్‌షాలోం తిరుగుబాటు సందర్భంలో బహుశా దీన్ని రాశాడేమో. మొదటి 11 వచనాల్లో తన శత్రువుల గురించి స్థూలంగా దావీదు రాశాడు. తరువాతి 4 వచనాల్లో సన్నిహితుడైన ఒక వ్యక్తి తనకు ద్రోహం చెయ్యడం గురించి ఉంది. మిగతా 8 వచనాల్లో దావీదుకు వాటిల్లిన ఆ విషమ పరీక్షలో, అపాయంలో అతనికి దేవునిపై ఉన్న నమ్మకం వెల్లడౌతున్నది.

3. శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టుల బలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారుఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.

4. నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది

కీర్తనల గ్రంథము 18:4-5; కీర్తనల గ్రంథము 116:3 విశ్వాసులకు చావంటే భయం ఎప్పుడైనా ఉంటుందా? ఉండకూడదు. కానీ కొందరికి ఉంటుంది. వారి నమ్మకం బలహీనమైనదైతేనో, లేక పరిస్థితుల ప్రభావంవల్ల అది తలక్రిందులైతేనో లేక దేవుని సాన్నిహిత్యం వారు అనుభవించలేని సమయంలోనో, లేక దేవుని వాక్కు వారికి సరిగా తెలియకనో లేక సైతాను వారిని సమీపించి వారిపై ఒత్తిడి తెచ్చినప్పుడో ఇలా జరుగుతుంది. అయితే క్రీస్తులో నమ్మకం ఉంచినవారంతా చావు భయంనుంచి విముక్తి పొందేందుకు క్రీస్తు మరణించాడన్నది మనం గుర్తు పెట్టుకోవాలి (హెబ్రీయులకు 2:14-15; 1 యోహాను 4:18; ప్రకటన గ్రంథం 2:10). క్రీస్తు వేదనపాలై మరణించాడు గనుక విశ్వాసి ప్రశాంతంగా విజయవంతంగా కన్ను మూయవచ్చు (అపో. కార్యములు 7:59-60; 1 కోరింథీయులకు 15:55-57; 2 కోరింథీయులకు 5:1-8; ఫిలిప్పీయులకు 1:20-23). అయితే పాత ఒడంబడిక కాలం విశ్వాసులకు ఇది సంపూర్తిగా వెల్లడి కాలేదు.

5. దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను.

6. ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే

కొన్ని సార్లు కష్టాలు, దుఃఖాలు భరించరానివిగా అనిపిస్తాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు తహతహ లాడతాం. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి అలాంటి విషమ పరీక్షలను దేవుడు మంచి ఉద్దేశంతో రానిస్తాడని గ్రహిస్తాడు. మనం వాటినుంచి తప్పించుకోవాలని చూడక, దేవుని మహిమార్థం, మన మేలుకోసం వాటిని సహించాలి (లూకా 22:41-42; యాకోబు 1:2-4; 1 పేతురు 1:6-7; 1 పేతురు 4:12-13). కష్టాల నుంచి పారిపోవాలని ప్రయత్నించడం సహజమే గాని అందువల్ల ఉపయోగం లేదు. అది మన విషయంలో దేవుడు నియమించిన మార్గం కాదు. మన విశ్రాంతికి పనికి వచ్చే ఏ అరణ్యమూ లేదు. అయితే పారిపోవడం కంటే మరింత ఉత్తమమైన మార్గం, విశ్రాంతికి మరింత శ్రేష్ఠమైన ప్రదేశం ఉన్నాయి. అవేమంటే క్రీస్తు సంకల్పంలో శాంతిని కనుక్కొవడం, దేవుని జాలిగల వక్షస్థలాన విశ్రాంతి తీసుకోవడం (మత్తయి 11:29; యోహాను 14:1; యోహాను 16:33; 2 కోరింథీయులకు 1:3-5; ఫిలిప్పీయులకు 4:6-7).

7. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని

8. అరణ్యములో నివసించియుందునే అను కొంటిని.

9. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.

ఇక్కడ వర్ణించబడిన వ్యక్తి అహీతోపెలు (2 సమూయేలు 15:12; 2 సమూయేలు 16:23) కాకుంటే ఇతనెవరో తెలుసుకునే ఆధారమేదీ మనకు లేదు. 9 వచనం చివరి భాగంలో ఈ వ్యక్తి విషయంలో దావీదు రాసిన మాటలు అహీతోపెలు గురించి దావీదు 2 సమూయేలు 15:31 లో చేసిన ప్రార్థనకు సరిగ్గా సరిపోతున్నాయి. కొందరు ఈ మాటల్లో యేసుకు ద్రోహం తలపెట్టిన యూదా ఇస్కరియోతు కనిపిస్తున్నాడన్నారు. మత్తయి 26:50 లో యేసు అతణ్ణి “స్నేహితుడు” అన్నాడు, నిజమే గాని ఆయన అతణ్ణి ఎప్పుడూ నమ్మలేదు (కీర్తనల గ్రంథము 41:9; యోహాను 6:64 యోహాను 6:70-71).

10. రాత్రింబగళ్లు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.

11. దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి.

12. నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.

13. ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు.

14. మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిర మునకు పోయి యున్నవారము.

15. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము నందును ఉన్నది

ఇలాంటి ప్రార్థనల గురించి కీర్తనల గ్రంథము 35:8 నోట్ చూడండి.

16. అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.

శత్రువుల చేతిలోనుంచి విడుదల, యుద్ధంలో విజయం దావీదు జీవితంలో సామాన్యంగా జరుగుతూ వచ్చినవే. దీనికి కారణం అతని ప్రార్థనా జీవితమే (లూకా 11:9-13; లూకా 18:1-8; ఎఫెసీయులకు 6:18; యాకోబు 5:16 పోల్చి చూడండి). తన అంతర్వాణిని నిందించనిదిగానూ, తన హృదయాన్ని పరిశుభ్రంగానూ ఉంచుకునేందుకూ తన ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉండేందుకూ విశ్వాసంతో ప్రార్థించేందుకూ అతను ప్రయాసపడ్డాడు. దీని ఫలితంగా దేవునిపట్ల అతనికి గొప్ప నిశ్చయత కలిగింది (కీర్తనల గ్రంథము 6:8-10 చూడండి).

17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును

18. నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు.

19. పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర మిచ్చును.

ఆ గాఢాంధకార సమయంలో కూడా దేవుడు పరిపాలిస్తున్నాడనీ, అన్నీ ఆయన అదుపాజ్ఞల్లో ఉన్నాయనీ అతడు నమ్మాడు (కీర్తనల గ్రంథము 29:10; కీర్తనల గ్రంథము 90:2; కీర్తనల గ్రంథము 93:2; ద్వితీయోపదేశకాండము 33:27) “భయమేమీ లేదు”– కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; ఆదికాండము 20:11; సామెతలు 1:7 నోట్స్ చూడండి.

20. తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.

12-14 వచనాలు. మోసగాడు, కపటి అయిన స్నేహితుడు కత్తి కట్టిన శత్రువు కంటే ప్రమాదకరం. ముఖంపై స్నేహం రంగు పులుముకుని మనసులో పగను ఉంచుకునే మనిషితో మెలగడం కష్టం, బాధకరం (కీర్తనల గ్రంథము 12:2; కీర్తనల గ్రంథము 28:3; కీర్తనల గ్రంథము 62:4). అయితే అలాంటి కపటులను ఏమి చెయ్యాలో దేవునికి తెలుసు (23 వ).

21. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.

22. నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
1 పేతురు 5:7

తన బాధలు భరించరానివని దావీదుకు అనిపించినప్పటికీ (6-8 వ), వీటి విషయంలో తాను ఏమి చెయ్యాలో అతనికి తెలుసు (కీర్తనల గ్రంథము 37:5; సామెతలు 16:3; 1 పేతురు 5:7 చూడండి). ఇలా చేసేవారు స్థిరంగా ఉంటారు (కీర్తనల గ్రంథము 15:5; కీర్తనల గ్రంథము 112:6; 2 పేతురు 1:10; యూదా 1:24).

23. దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి యున్నాను.

ఇందులోని చివరి మాటల మూలంగా విశ్వాసులకు ఎన్ని విజయాలు! ఎంత మనశ్శాంతి! దేవునికి ఎంత మహిమ!Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |