Psalms - కీర్తనల గ్రంథము 61 | View All

1. దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము

2. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము.

“భూమి అంచు”– ఈ కీర్తన రాసినప్పుడు దావీదు కనాను దేశంలో లేడని ఇది సూచిస్తున్నది. అబ్‌షాలోం తిరుగుబాటు సమయంలో దావీదు అక్కడనుంచి పారిపోయినప్పుడు దీన్ని రాశాడని కొందరు పండితుల అభిప్రాయం. ఏది ఏమైనా ఇది దావీదు పాలిట హృదయాన్ని కృంగదీసి, దుఃఖంతో అతని మనస్సును ఉక్కిరిబిక్కిరి చేసిన సమయం. కష్టాల కడలిలో తాను మునిగిపోతున్నట్టు దావీదుకు అనిపిస్తున్నది. క్షేమంగా ఉంచే ఆశ్రయ శిల ఉంది గాని అది అతడు ఎగబ్రాకలేనంత ఎత్తుగా ఉంది. ఆ శిల దేవుడే (ద్వితీయోపదేశకాండము 32:4). కష్ట కాలంలో ఆయన తన ప్రజల పాలిట సంరక్షకుడు, భద్రతకు కారకుడు. ఈ ఆశ్రయ శిలపై మనం నిలబడితే ఈ లోకంలోని కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు అన్నీ కలిపినా మనల్ని అపాయంలోకి తేలేవు. అయితే ఈ శిలపై దేవుడు తానే మనలను నిలపవలసి ఉందని గమనించండి (కీర్తనల గ్రంథము 27:5; కీర్తనల గ్రంథము 40:2). అదంతా కేవలం ఆయన కృపే.

3. నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి

4. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా.)

5. దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించి యున్నావు నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము నీవు నాకనుగ్రహించి యున్నావు.

ఇక్కడనుంచి దావీదు ఆ ఆశ్రయశిలపై నిలచి సురక్షితంగా ఉండి, తొణుకు, బెణుకు లేకుండా భవిష్యత్తును చూస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. “శపథాలు”– కీర్తనల గ్రంథము 22:25; కీర్తనల గ్రంథము 50:14; కీర్తనల గ్రంథము 56:12; కీర్తనల గ్రంథము 66:13; కీర్తనల గ్రంథము 116:14 కీర్తనల గ్రంథము 116:18. “వారసత్వం”– ఈ మాట దేవుడు అబ్రాహాముకు ఇస్తానన్న వాగ్దానాలన్నిటితో సంబంధం గలది (ఆదికాండము 12:1-2). వీటన్నిటినీ యేసుప్రభువు తన విశ్వాసుల కోసం సంపాదించి పెట్టాడు (కీర్తనల గ్రంథము 16:5; కీర్తనల గ్రంథము 37:18; అపో. కార్యములు 20:32; రోమీయులకు 4:16; ఎఫెసీయులకు 1:11; కొలొస్సయులకు 1:12; హెబ్రీయులకు 1:4; హెబ్రీయులకు 9:15; 1 పేతురు 1:4).

6. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములు గడచును గాక.

దావీదు తానే ఈ లోకంలో తరతరాలు, శాశ్వతంగా (వ 7) బ్రతికే ఉంటానని అనుకోలేడు గదా. ఈ మాటలు దేవునితో పరలోకంలో శాశ్వత జీవం అనుభవించగలనన్న నిశ్చయతను సూచిస్తున్నాయేమో. కానీ దావీదు ఇక్కడ “నేను” అనే పదాన్ని వాడలేదు. “రాజు” అని మాత్రమే రాశాడు. కాబట్టి దావీదు తన రాజవంశం గురించి, అంటే దేవుని వాగ్దానాల ప్రకారం శాశ్వతంగా రాజ్యపాలన చెయ్యవలసిన తన సంతానాన్ని గురించి మాట్లాడుతున్నట్టు ఉంది (2 సమూయేలు 7:12-16). వేరే మాటల్లో చెప్పాలంటే యేసు క్రీస్తును గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ఆయన దావీదు వంశీయుడు, శాశ్వతంగా రాజై ఉండాలని దేవుడు నియమించినవాడు (కీర్తనల గ్రంథము 2:6-12; లూకా 1:31-33).

7. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము.

8. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించు నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.

తన విధానాల్లో ఇంత కృప చూపే దేవుడు నిజంగా మన స్తుతి ప్రశంసలకు పాత్రుడు (కీర్తనల గ్రంథము 30:4; కీర్తనల గ్రంథము 33:1-2; కీర్తనల గ్రంథము 71:22).Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |