Psalms - కీర్తనల గ్రంథము 69 | View All

1. దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.

ఈ శ్రేష్ఠమైన కీర్తనలోని కొన్ని వచనాలు క్రొత్త ఒడంబడికలో రాసి ఉన్నాయి. 4వ వచనం యోహాను 15:25 లో ఉంది. 9వ వచనం యోహాను 2:17 లో; రోమీయులకు 5:3 లో ఉంది. 21వ వచనం మత్తయి 27:34 లో ఉంది. దావీదు దీన్ని తన గురించీ, యేసు ప్రభువును గురించీ, తన బాధల గురించీ, యేసు ప్రభువు భరించిన బాధల గురించీ కూడా రాశాడు. ఈ మాటలను వేరు చేయడం ఎలా? వీటిలో దావీదుకు వర్తించేవి ఏవి, క్రీస్తుకు వర్తించేవి ఏవి, ఇద్దరికి వర్తించేవి ఏవి? తెలుసుకోవడం అంత తేలిక పని కాదు. యేసుప్రభువును చూడగలిగిన చోట యేసుప్రభువును, దావీదును చూడవలసిన మాటల్లో దావీదును, సాధ్యపడిన చోట ఇద్దరినీ చూడడం అనే నియమం మంచిది కావచ్చు. ఉదాహరణకు 5వ వచనంలో యేసు ప్రభువును చూడ్డం సాధ్యం కాదు. ఎందుకంటే యేసుప్రభువులో మూర్ఖత్వం లేదు, ఆయనేమీ అపరాధాలు చేయలేదు. కానీ ఆ వచనంలో దావీదు స్పష్టంగా కనిపిస్తున్నాడు. 22-28 వచనాల్లో దుర్మార్గులకు వ్యతిరేకంగా కనిపించే ఈ ప్రార్థన లూకా 23:34 లో తన శత్రువుల కోసం ప్రభువు చేసిన ప్రార్థనలాగా లేదు (అయితే అక్కడ తాము ఏం చేస్తున్నారో తమకే తెలియని వారి గురించి యేసు ప్రార్థించాడు. అంతేగాని తెలిసి తెలిసి పాపం చేసేవారి గురించి కాదు). ఈ కీర్తనలోని మరికొన్ని మాటలు దావీదుకు వర్తింపజేయడం కష్టసాధ్యం. దేవుని పవిత్రాత్మ దావీదును ప్రేరేపించి అతని అనుభవాలకు అతీతమైన పలుకులు రాబోయే క్రీస్తును గురించిన మాటలు రాయించాడు. 1-3 వచనాలు ముంచుకు వచ్చిన అత్యంత ప్రమాదం, దిక్కులేనితనం కనిపిస్తున్నాయి. దావీదుకు ఇలాంటి అనుభవాలు కలిగాయని నిస్సందేహంగా చెప్పవచ్చు (కీర్తనల గ్రంథము 40:2; కీర్తనల గ్రంథము 18:16-17; కీర్తనల గ్రంథము 6:6). అయితే ఈ మాటలు యేసు ప్రభువు అనుభవాలకు సరిపోవడం సాధ్యమా? ఆయన దేవుని అవతారం గదా. ఇక్కడ వర్ణించబడినంత అపాయం, నిస్సహాయ స్థితిలో ఆయన ఉండడం సాధ్యమా? అయితే మనం అర్థం చేసుకోవలసినది ఒకటుంది – ఆయన తన దివ్య మహిమనూ బల ప్రభావాలనూ స్థితిస్థానాలనూ ప్రక్కన పెట్టి మానవుడై మరణమయ్యేలా దేవునికి విధేయుడయ్యాడు (ఫిలిప్పీయులకు 2:5-8). తానుగా ఏమీ చేయలేనని ఆయనే అన్నాడు (యోహాను 5:19 యోహాను 5:30) అంటే చావునుంచి తనను తాను రక్షించుకోలేకపోయాడు కూడా. మరణం తాను అనుభవించవలసిన దేవుని సంకల్పమని ఆయనకు తెలుసు. ఏ విషయంలో అయినా ఆయన దేవుని సంకల్పాన్ని ఎదిరించేవాడు కాడు కాబట్టే తానుగా ఏమీ చేయలేకపోయాడు, తనను మరణం నుంచి రక్షించుకోలేకపోయాడు. అందుచేత ఆయన వేదనతో చేసిన కన్నీటి ప్రార్థనల గురించి కనిపిస్తున్నది (లూకా 22:41-44; హెబ్రీయులకు 5:7). కాబట్టి సిలువను ఎదుర్కోబోతున్న యేసుకు ఈ వచనాలు అతికినట్టుగా సరిపోతున్నాయి. అయితే ఆయన తన ఇష్ట ప్రకారం ఇలాంటి స్థితికి తనను తాను అప్పగించుకున్నాడనీ, ఇదంతా మనకోసమే చేశాడనీ గుర్తుంచు కోవాలి.

2. నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి.

3. నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను.

4. నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను.
యోహాను 15:25

“ద్వేషించేవాళ్ళు”– దావీదును సౌలురాజు, తదితరులు ద్వేషించిన మాట నిజమే. అయితే యేసుప్రభువు విషయంలో ఇది మరింత నిజం. ఎలాగంటే ఆయన కాలంలో దాదాపు యూదమత నాయకులందరితో బాటు దాదాపుగా సర్వ లోకం ఆయన్ను ద్వేషించింది (యోహాను 15:18 యోహాను 15:24-25). “చంపాలని చూచేవాళ్ళు”– మత్తయి 26:3-4; అపో. కార్యములు 4:27. “అపహరించనిది”– కీర్తనల గ్రంథము 35:11.

5. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు.

ఇది దావీదు విషయంలో నిజం (కీర్తనల గ్రంథము 32:5; కీర్తనల గ్రంథము 51:1-4). యేసు విషయంలో ఇది నిజం కాదు (యోహాను 8:46; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26; 1 పేతురు 2:21-22).

6. ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగనియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన అవమానము నొంద నియ్యకుము.

ఇది ప్రార్థన చేయడంలో బలమైన ఆధారం. దేవుడు ఇతణ్ణి ఈ కష్టాల్లో నుంచి విజయవంతంగా వెలికి తీసుకురాకపోతే అతని స్నేహితులు, అనుచరులు కూడా సిగ్గుపాలౌతారు. యేసును అనుసరించేవారికి ఇది ఎన్నడూ జరగదని మనం నిశ్చింతగా ఉండవచ్చు (రోమీయులకు 9:33; రోమీయులకు 10:11). “సేనల ప్రభువు యెహోవా”– 1 సమూయేలు 1:3 నోట్.

7. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.

దావీదు విషయంలో నిజం, యేసు క్రీస్తు విషయంలో మరింత నిజం (మత్తయి 9:24; మత్తయి 27:29 మత్తయి 27:41; మార్కు 3:21 మార్కు 3:30; మార్కు 6:6; లూకా 23:26; యోహాను 8:48; యోహాను 7:5; యోహాను 1:11).

8. నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని.

“ఆసక్తి”– యోహాను 2:17. తన స్వజనమే ఆయన్ను ద్వేషించి, అగౌరవపరచి ఎవరో పరాయివాణ్ణిగా ఆయన్ను చూడడానికి కారణాల్లో ఇదొకటి. ధనార్జన, అధికారం చేజిక్కించుకోవడానికి, తమ గౌరవ ప్రతిష్ఠలు పెంపొందించు కోవడానికి ఎంతో ఆసక్తి పెట్టుకున్న లోకులు దేవుని విషయంలో ఆసక్తి ఉన్నవారంటే సహించలేరు. అలాంటి ఆసక్తిని వెర్రి భక్తి అంటారు. దేవుని ఇల్లు, దేవుని పని, దేవుని పేరు ప్రతిష్ఠల కోసం ఇంతగా ప్రాకులాడే భక్తులను వారు అర్థం చేసుకోలేక పోతారు. ఇలాంటివాటి ప్రాముఖ్యత గురించి వారికేమీ తెలియదు. దేవుని ఇంటి విషయంలో యేసుప్రభువుకు ఎంత తీవ్రమైన ఆసక్తి ఉన్నదంటే అది ఆయన్ను నిలువునా తినివేస్తూ ఉంది. “నిందలు”– దేవునికి వ్యతిరేకంగా భక్తిహీనులు ఆరోపించిన నిందలకు యేసు క్రీస్తు గురి అయ్యాడు.

9. నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.
యోహాను 2:17, రోమీయులకు 15:3, హెబ్రీయులకు 11:26

10. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను.

యెషయా 53:3. యేసుక్రీస్తు చేసిన ఏ పనీ దుర్మార్గులకు సంతోషం కలిగించలేకపోయింది. వారి విషయంలో ఆయన దుఃఖం, రోదనం కూడా వారు ఆయన్ను నిందించేందుకు వారి దృష్టిలో కారణమైంది.

11. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని.

“గోనెపట్ట”– సంతాపానికి గుర్తుగా.

12. గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాటలాడుకొందురు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు.

“గుమ్మం”– ఆదికాండము 19:1; రూతు 4:1. “త్రాగుబోతులు”– వీరు తరుచుగా మతాన్ని ఎగతాళి చేస్తూ దేవుని పవిత్ర కుమారుణ్ణి హేళన చెయ్యడం వినోదంగా భావిస్తారు. ఆసక్తి కలిగిన దేవుని పిల్లలు కూడా భక్తిహీనుల హేళనకు గురి అవుతారు.

13. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము.

కీర్తనల గ్రంథము 22:19 కీర్తనల గ్రంథము 22:21 పోల్చి చూడండి. ఇది దావీదుకు యేసుప్రభువుకు కూడా తగిన ప్రార్థన. అంతేగాక అప్పటినుంచి గొప్ప అపాయంలో చిక్కుకున్న అనేకులకు తగిన ప్రార్థన. ఇలాంటి ప్రార్థనకు జవాబివ్వడం తండ్రి అయిన దేవుడికి ఇష్టం.

14. నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలోనుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము.

15. నీటి వరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మింగనియ్యకుము గుంట నన్ను మింగనియ్యకుము.

“పడనియ్యకు”– మరణం తన్ను బంధించకూడదని దేవునికి చేస్తున్న ప్రార్థన. క్రీస్తు చనిపోయి సజీవంగా లేవడంలో ఇది అద్భుతంగా నెరవేరింది.

16. యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్య బాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.

17. నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.

18. నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము.

19. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.

కీర్తనల గ్రంథము 22:6 కీర్తనల గ్రంథము 22:12-13 కీర్తనల గ్రంథము 22:16. యూదా, కయప, పిలాతు, యాజులు, దుర్మార్గులైన మూక, రోమ్ సైనికులు అంతా ఆయనకు శత్రువులయ్యారు.

20. నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి.

యేసుప్రభువు పగిలిన హృదయంతో దిక్కులేని వాడై హేళనలకు, నిందలకు గురై చనిపోయాడు. దీన్ని చూచి కొందరు చలించిపోయారు కానీ జాలి ఎవరికుంది? ఆయన కోసం స్నేహ పూర్వకంగా ఒక్క కన్నీటి బొట్టును ఎవరు కార్చారు?

21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.
మత్తయి 27:34-38, మార్కు 15:23-36, లూకా 23:36, యోహాను 19:28-29

మత్తయి 27:34 మత్తయి 27:48. బాధలు పడుతున్నవానికి నోట పెట్టుకోరానంత అరుచికరమైన పదార్థాలు పుచ్చుకునేందుకు ఇవ్వబడ్డాయి. ఈ వచనం పాత ఒడంబడికలో యేసు చనిపోకముందు నెరవేరిన ఆఖరు భవిష్యద్వాక్కు (యోహాను 19:28-30). యేసుప్రభువు మానవాళికి ఎన్నో శ్రేష్ఠమైన వాటితో వచ్చాడు. ప్రతిగా తమకు చేతనైనంత వ్యర్థమైన వాటిని వారాయనకు ఇచ్చారు.

22. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక.
రోమీయులకు 11:9-10

కీర్తనల గ్రంథము 35:8 నోట్. ఈ వచనాలు లూకా 23:24 కు వేరుగా ఉన్నట్టుంది గాని ధర్మశాస్త్రం క్రింద ఉన్న దావీదును పవిత్రాత్మ ప్రేరేపించి, దైవకుమారుని మరణానికి కారణమైన వారి మీదికి వచ్చి పడబోయే న్యాయమైన ప్రతీకారాన్ని చూపించడానికి రాయించాడు. యేసుప్రభువు తన జీవితంలో గానీ మరణ సమయంలో గానీ ఈ మాటలను అనలేదని అనుకోవడానికి కారణం ఉన్నా ఇవి ఈ కీర్తనలో ఉన్నాయనీ నెరవేరతాయనీ ఆయనకు తెలుసు. ఆయన ఈ విషయాన్ని ఉదాహరణ రూపంలోను (మత్తయి 21:38-41; మత్తయి 22:6-7) తేట పలుకుల్లోను (మత్తయి 23:33-36) నేర్పాడు. “బల్ల” (వ 22) – అంటే భోజనం లేక పోషణ లేక జీవిత అవసరాలు అని అర్థం. ఈ కీర్తన 22,23 వచనాలను సౌలు తన కాలంలోని అవిశ్వాసులైన యూదులకు వర్తింపజేశాడు (రోమీయులకు 11:9-10). యేసును శత్రువులకు పట్టియిచ్చిన ద్రోహి యూదాకు 25 వ వచనాన్ని ఆపాదించాడు పేతురు (అపో. కార్యములు 1:20). యేసు యూదుల జాతి విషయంలోనూ ఈ మాటలను వాడాడు (మత్తయి 23:38). ఈ వచనాల్లో లోపంలేని న్యాయం సిద్ధించాలన్న ఆక్రోశం కనిపిస్తున్నది. అది గతంలో సిద్ధించింది, భవిష్యత్తులో సిద్ధిస్తుంది (కీర్తనల గ్రంథము 18:25-26; 2 థెస్సలొనీకయులకు 1:6 చూడండి). వాళ్ళు యేసుకు చేదునూ పులిసిన ద్రాక్షరసాన్ని ఇచ్చారు. అందుకని వారి బల్ల వారికి ఉరి అవుతుంది. వాళ్ళు దేవుని వెలుగును ఆర్పేందుకు ప్రయత్నించారు. వాళ్ళ కళ్ళే చీకటి అవుతాయి. వాళ్ళు యేసు ప్రభువును వణికించేందుకు ప్రయత్నించి కొరడాతో కొట్టించారు. వాళ్ళ నడుములే గజగజ వణికిపోతాయి. వాళ్ళు దేవుని కుమారునిపై తమ కోపాన్ని కురిపించారు. దేవుని కోపం వాళ్ళపై వర్షిస్తుంది.

23. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము.
రోమీయులకు 11:9-10

24. వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక
ప్రకటన గ్రంథం 16:1

25. వారి పాళెము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక
అపో. కార్యములు 1:20

26. నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
మత్తయి 27:34, మార్కు 15:23, యోహాను 19:29

యెషయా 53:4-6 యెషయా 53:10 చూడండి.

27. దోషముమీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము.

ఇక్కడ కనిపించేవారు వారి తండ్రి అబ్రాహాములాగా (ఆదికాండము 15:6) దేవుని నీతిన్యాయాల్లో ఎప్పుడూ భాగస్థులు కాలేదు.

28. జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.
ఫిలిప్పీయులకు 4:3, ప్రకటన గ్రంథం 3:5, ప్రకటన గ్రంథం 13:8, ప్రకటన గ్రంథం 17:8, ప్రకటన గ్రంథం 20:12-15, ప్రకటన గ్రంథం 21:27

వీరెన్నడూ న్యాయవంతుల జాబితాలో చేరలేదు. అంటే వీరెన్నడూ దేవునిలో నమ్మకం ఉంచలేదు, పాపవిముక్తి పొందలేదు. కాబట్టి ఈ వచనం మొదటి భాగానికి అర్థమేదైనప్పటికీ ఒకసారి పాపవిముక్తి పొంది, న్యాయవంతులుగా ఎంచబడిన వారు మళ్ళీ పూర్తిగా పడిపోయి నాశనమౌతారని మాత్రం అర్థం రాదు. బైబిల్లో మరి కొన్ని చోట్ల కనిపించే సత్యాన్ని అలాంటి అర్థం వ్యతిరేకిస్తుంది (యోహాను 5:24; యోహాను 6:37-40; యోహాను 10:28; రోమీయులకు 5:9-10; 1 పేతురు 1:4-5). దేవుని పుస్తకాల గురించి ప్రకటన గ్రంథం 3:5; ప్రకటన గ్రంథం 20:15 నోట్ చూడండి.

29. నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక.

కీర్తనల గ్రంథము 22:11-21 చూడండి.

30. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను

ఇంతటి అద్భుత కార్యాలు చేసిన దేవుడు స్తుతులకు పాత్రుడు. యేసు ఆయన్ను కీర్తిస్తున్నాడు. మరి మనం కూడా అలా చేయమా? స్తుతికంటే శ్రేష్ఠమైన అర్పణ ఏముంది? “కృతజ్ఞత”– కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 50:14-15; కీర్తనల గ్రంథము 56:12-13; లేవీయకాండము 7:12-13; ఎఫెసీయులకు 5:20; 1 థెస్సలొనీకయులకు 5:18.

31. ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము

32. బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక.

దీనంతటిలో యథార్థ హృదయంతో ప్రవేశించ గలవారు దీనదశలో ఉన్న భక్తులు, తమ ఆధ్యాత్మిక దరిద్రాన్ని గుర్తించినవారు (మత్తయి 5:3), గానీ అహంభావులు కాదు. వినయ విధేయతలతో దేవుణ్ణి వెతికేవారికి అన్నీ లభ్యమౌతాయి. తద్వారా హృదయం జీవంతో అలరారుతుంది.

33. యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు.

“వింటాడు”– దేవుడు అణుకువ, భక్తిగల పేదలు చేసిన ప్రార్థనలు వింటాడు. అంతేగాని పేదలు గదా అని వారు దుర్మార్గులైనప్పటికీ వారి ప్రార్థనలు వింటాడనుకోకూడదు. “ఖైదీలు”– కీర్తనల గ్రంథము 68:6

34. భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక.

కీర్తనల గ్రంథము 96:11; కీర్తనల గ్రంథము 98:7; కీర్తనల గ్రంథము 148:1-13; కీర్తనల గ్రంథము 150:6. యేసుప్రభువు ద్వారా దేవుడు దివ్య కార్యాలు జరిగించాడు. అన్ని కాలాల్లోనూ అనంత యుగాలలోనూ అంతటా స్తుతి ప్రశంసలకు యోగ్యమైన పనులివి.

35. దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.

కీర్తనల గ్రంథము 147:2; కీర్తనల గ్రంథము 51:18; కీర్తనల గ్రంథము 46:5; కీర్తనల గ్రంథము 25:13.

36. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు కొనును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Psalms - కీర్తనల గ్రంథము 69 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

డేవిడ్ గొప్ప బాధ గురించి ఫిర్యాదు చేశాడు. (1-12) 
ఇక్కడ ప్రస్తావించబడిన బాధితుడి గుర్తింపు గురించి మనం తరచుగా ఆలోచించాలి మరియు అతను ఏమి భరించాడో మాత్రమే కాకుండా అతను దానిని ఎందుకు భరించాడో కూడా ఆలోచించాలి. అటువంటి ధ్యానం ద్వారా, మన పాపాల పట్ల లోతైన వినయాన్ని మరియు మన ప్రమాదకరమైన స్థితి గురించి అధిక అవగాహనను పెంపొందించుకోవచ్చు. ఇది, మనలో కృతజ్ఞత మరియు ప్రేమ యొక్క లోతైన భావాన్ని రేకెత్తిస్తుంది, మన మోక్షానికి తనను తాను త్యాగం చేసిన వ్యక్తి యొక్క కీర్తి కోసం జీవించడానికి మనల్ని బలవంతం చేస్తుంది.
ఈ పాఠం మనకు కష్ట సమయాల్లో, చేదు లేదా నిరాశను పట్టుకోకుండా నిరోధించడానికి మన ఆత్మలను దేవుని సంరక్షణకు అప్పగించాలని బోధిస్తుంది. దావీదు అన్యాయంగా ద్వేషించబడ్డాడు, అయితే ఈ మాటలు క్రీస్తుకు మరింత లోతుగా వర్తిస్తాయి. చాలా అన్యాయంతో గుర్తించబడిన ప్రపంచంలో, తప్పుడు శత్రువులను ఎదుర్కోవడం మనకు ఆశ్చర్యం కలిగించదు. ఏది ఏమైనప్పటికీ, మనం తప్పు చేయకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉందాం, తద్వారా మనకు అన్యాయం జరిగినప్పుడు, దానిని మరింత సునాయాసంగా భరించగలము.
క్రీస్తు తన స్వంత రక్తముతో మన పాపములకు చేసిన ప్రాయశ్చిత్తము ద్వారా, మన ఋణము చెల్లించి, మన అతిక్రమములకు పర్యవసానములను భరింపజేసి, అతడు తీసివేయని దానిని సమాధానపరచెను. మానవుల నుండి వచ్చే అన్యాయమైన ఆరోపణలకు వ్యతిరేకంగా మన నిర్దోషిత్వాన్ని నొక్కి చెప్పగలిగినప్పుడు కూడా, దేవుని ముందు మనకు సంభవించే అన్నింటికీ మనం అర్హులమని మనం గుర్తించాలి. మన మూర్ఖత్వం మన పాపాలన్నింటికి దారి తీస్తుంది మరియు దేవుడు వాటన్నింటినీ గమనిస్తాడు.
డేవిడ్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల దయతో విలపించాడు, ఇది క్రీస్తులో నెరవేరిన ప్రవచనం, అతని స్వంత సోదరులు ఆయనను విశ్వసించలేదు మరియు అతని శిష్యులచే విడిచిపెట్టబడ్డారు. క్రీస్తు మనపట్ల ఉన్న సంతృప్తి దేవునికి ఇవ్వాల్సిన గౌరవాలను వదులుకోవడమే కాకుండా ఏ వ్యక్తిపైనైనా కుప్పకూలిన గొప్ప అవమానాలను భరించడానికి కూడా విస్తరించింది.
దేవుని సత్యాలు, ఆజ్ఞలు మరియు ఆరాధనల పట్ల మన ఉత్సాహం కొందరి నుండి అపహాస్యాన్ని రేకెత్తిస్తే లేదా ఇతరులు మన భక్తి దుఃఖాన్ని మరియు ప్రాపంచిక విషయాల నుండి నిర్లిప్తతను అపహాస్యం చేసేలా నడిపిస్తే, మనం నిరుత్సాహపడకూడదు.

మరియు సహాయం కోసం వేడుకున్నాడు. (13-21) 
ఇక్కడ ప్రస్తావించబడిన బాధితుడి గుర్తింపు గురించి మనం తరచుగా ఆలోచించాలి మరియు అతను ఏమి భరించాడో మాత్రమే కాకుండా అతను దానిని ఎందుకు భరించాడో కూడా ఆలోచించాలి. అటువంటి ధ్యానం ద్వారా, మన పాపాల పట్ల లోతైన వినయాన్ని మరియు మన ప్రమాదకరమైన స్థితి గురించి అధిక అవగాహనను పెంపొందించుకోవచ్చు. ఇది, మనలో కృతజ్ఞత మరియు ప్రేమ యొక్క లోతైన భావాన్ని రేకెత్తిస్తుంది, మన మోక్షానికి తనను తాను త్యాగం చేసిన వ్యక్తి యొక్క కీర్తి కోసం జీవించడానికి మనల్ని బలవంతం చేస్తుంది.
ఈ పాఠం మనకు కష్ట సమయాల్లో, చేదు లేదా నిరాశను పట్టుకోకుండా నిరోధించడానికి మన ఆత్మలను దేవుని సంరక్షణకు అప్పగించాలని బోధిస్తుంది. దావీదు అన్యాయంగా ద్వేషించబడ్డాడు, అయితే ఈ మాటలు క్రీస్తుకు మరింత లోతుగా వర్తిస్తాయి. చాలా అన్యాయంతో గుర్తించబడిన ప్రపంచంలో, తప్పుడు శత్రువులను ఎదుర్కోవడం మనకు ఆశ్చర్యం కలిగించదు. ఏది ఏమైనప్పటికీ, మనం తప్పు చేయకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉందాం, తద్వారా మనకు అన్యాయం జరిగినప్పుడు, దానిని మరింత సునాయాసంగా భరించగలము.
క్రీస్తు తన స్వంత రక్తముతో మన పాపములకు చేసిన ప్రాయశ్చిత్తము ద్వారా, మన ఋణము చెల్లించి, మన అతిక్రమములకు పర్యవసానములను భరింపజేసి, అతడు తీసివేయని దానిని సమాధానపరచెను. మానవుల నుండి వచ్చే అన్యాయమైన ఆరోపణలకు వ్యతిరేకంగా మన నిర్దోషిత్వాన్ని నొక్కి చెప్పగలిగినప్పుడు కూడా, దేవుని ముందు మనకు సంభవించే అన్నింటికీ మనం అర్హులమని మనం గుర్తించాలి. మన మూర్ఖత్వం మన పాపాలన్నింటికి దారి తీస్తుంది మరియు దేవుడు వాటన్నింటినీ గమనిస్తాడు.
డేవిడ్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల దయతో విలపించాడు, ఇది క్రీస్తులో నెరవేరిన ప్రవచనం, అతని స్వంత సోదరులు ఆయనను విశ్వసించలేదు మరియు అతని శిష్యులచే విడిచిపెట్టబడ్డారు. క్రీస్తు మనపట్ల ఉన్న సంతృప్తి దేవునికి ఇవ్వాల్సిన గౌరవాలను వదులుకోవడమే కాకుండా ఏ వ్యక్తిపైనైనా కుప్పకూలిన గొప్ప అవమానాలను భరించడానికి కూడా విస్తరించింది.
దేవుని సత్యాలు, ఆజ్ఞలు మరియు ఆరాధనల పట్ల మన ఉత్సాహం కొందరి నుండి అపహాస్యాన్ని రేకెత్తిస్తే లేదా ఇతరులు మన భక్తి దుఃఖాన్ని మరియు ప్రాపంచిక విషయాల నుండి నిర్లిప్తతను అపహాస్యం చేసేలా నడిపిస్తే, మనం నిరుత్సాహపడకూడదు.

అతను దేవుని తీర్పులను ప్రకటిస్తాడు. (22-29) 
ఈ వచనాలలో క్రీస్తును హింసించిన వారి పతనానికి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. రోమీయులకు 11:9-10. మన స్వభావం యొక్క అవినీతి కారణంగా జీవిత అవసరాలు మరియు ఇంద్రియాలకు సంబంధించిన ఆనందాలు పాపానికి పోషణ మరియు ప్రోత్సాహకరంగా మారినప్పుడు, మన పట్టిక ఉచ్చుగా మారుతుంది. వారి పాపం వారు చూడకూడదని ఎంచుకున్నారు; వారు ఉద్దేశపూర్వకంగా కాంతికి కళ్ళు మూసుకున్నారు, బదులుగా చీకటిని ఇష్టపడతారు. వారి శిక్ష ఏమిటంటే, వారు దృష్టిని కోల్పోతారు, వారి స్వంత పాపపు కోరికలను అనుసరించడానికి వదిలివేయబడతారు, ఇది వారి హృదయాలను మరింత కఠినతరం చేస్తుంది. దేవుడు తమకు అందించిన గొప్ప రక్షణను తిరస్కరించే వారు ఆయన ఉగ్రత తమపైకి వస్తుందని భయపడడానికి కారణం ఉంది. ప్రజలు పాపం చేయడానికి ఎంచుకుంటే, ప్రభువు వారికి జవాబుదారీగా ఉంటాడు. అయినప్పటికీ, విస్తృతమైన పాపంలో మునిగిపోయిన వారు కూడా మధ్యవర్తి యొక్క నీతి ద్వారా దయను పొందవచ్చు. దేవుడు ఈ నీతి నుండి ఎవరినీ మినహాయించడు; ఇది వ్యక్తులను దాని నుండి మినహాయించే అపనమ్మకం.
ఇంకా గర్వం మరియు మొండితనంతో నిండిన వారు, దేవుని నీతిని అంగీకరించడానికి నిరాకరించినంత వరకు, వారు స్వయంగా నిర్ణయించిన పరిణామాలను ఎదుర్కొంటారు. వారు దానిని ఇష్టపూర్వకంగా స్వీకరించడానికి ఇష్టపడకపోతే దాని నుండి ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకూడదు. ధనవంతులుగా, ఉల్లాసంగా ఉండటమే కాకుండా ఆయన శాపానికి గురై ప్రభువు ఆశీర్వాదంతో పేదలుగా మరియు దుఃఖంతో ఉండటం చాలా మేలు. ఈ భావనను క్రీస్తుకు కూడా అన్వయించవచ్చు. అతను భూమిపై ఉన్న సమయంలో, అతను దుఃఖంతో పరిచయం ఉన్న వ్యక్తి, తల వంచడానికి స్థలం లేదు; ఇంకా దేవుడు ఆయనను హెచ్చించాడు. మనము ప్రభువును పిలుద్దాము, మరియు మనం పేదవారమై, దుఃఖంతో బాధపడ్డా, అపరాధులమైనా మరియు పాపంతో తడిసినప్పటికీ, ఆయన మోక్షం మనల్ని పైకి లేపుతుంది మరియు మనలను ఉద్ధరిస్తుంది.

అతను ఆనందం మరియు ప్రశంసలతో ముగించాడు. (30-36)
కీర్తనకర్త తన కీర్తనను పవిత్రమైన ఆనందం మరియు ప్రశంసలతో ముగించాడు, అతను మొదట్లో వ్యక్తం చేసిన మనోవేదనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాడు. దేవుడు అత్యంత విపరీతమైన మరియు ఆడంబరమైన త్యాగాల కంటే వినయపూర్వకమైన మరియు కృతజ్ఞతతో కూడిన ప్రశంసలను మరింత సంతోషకరమైనదిగా గుర్తించడం ఒక భరోసా కలిగించే ఆలోచన. వినయస్థులు ఆయనను వెదకుతారు మరియు ఆనందాన్ని పొందుతారు; క్రీస్తు ద్వారా ఆయనను వెదకేవారు జీవాన్ని మరియు ఓదార్పును పొందుతారు. సువార్త చర్చి కొరకు దేవునికి విశేషమైన ప్రణాళికలు ఉన్నాయి మరియు హృదయంలో దాని ఉత్తమ ప్రయోజనాలను కలిగి ఉన్నవారందరూ సంతోషించాలి. ఒక తరం భూమిపై ఆయనను సేవిస్తుంది మరియు అతని నమ్మకమైన సేవకులు ఆయన పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని గౌరవించే వారు ఆయన సన్నిధిలో శాశ్వతంగా ఉంటారు.
దీనిని పరిగణించండి: దేవుడు తన స్వంత కుమారుడిని విడిచిపెట్టకుండా, మన నిమిత్తము ఆయనను అప్పగించినట్లయితే, మనకు అవసరమైన అన్నిటినీ ఆయన ఉదారంగా అందిస్తాడని మనం ఎలా సందేహించగలం? పురాతన నివాస స్థలాల గొప్ప పునరుద్ధరణకర్త, లేచి, నీ ప్రజల నుండి భక్తిహీనతను బహిష్కరించు
.



Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |