తమను ఆయనదగ్గరికి రానిమ్మనీ తమ బాగోగులు చూడాలనీ మనుషులు దేవుణ్ణి ప్రాధేయపడడం కాదు. దేవుడే మనుషులను బ్రతిమాలవలసి వస్తున్నది! ప్రార్థించండని అస్తమానమూ వారికి ఆయనే గుర్తు చేస్తుండాలి. తమను ప్రార్థన చెయ్యనిమ్మని మనుషులు దేవుణ్ణి బ్రతిమాలడం లేదు. దేవుని దీవెనలను మనిషి ఆశించిన దానికంటే మరింత ఆత్రుతతో వారిని దీవించాలని దేవుడు చూస్తున్నాడు. తన ప్రజలకు శ్రేష్ఠమైన వస్తువులు సమృద్ధిగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నోరు అంటే ఇక్కడ మొత్తంగా మనిషి అని అర్థం. మనకు అవసరమైనవన్నీ అంటే శరీర సంబంధమైనవీ, ఆధ్యాత్మికమైనవీ దేవుడు ఇస్తాడు. మన మనస్సులను, హృదయాలను, జీవితాలను ఆయనకు పూర్తిగా తెరవడం మన బాధ్యత (కీర్తనల గ్రంథము 37:4; కీర్తనల గ్రంథము 107:9; మత్తయి 7:7-11).