Psalms - కీర్తనల గ్రంథము 83 | View All

1. దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.

ఇస్రాయేల్‌ప్రజల గురించి రాసివున్న చరిత్ర అంతటిలో ఎక్కడా ఈ కీర్తనలో కనిపించిన దేశాలన్నీ కూటమిగా ఏర్పడి వారిని నిర్మూలం చేసేందుకు కూడి వచ్చినట్టు లేదు. ఆయా సమయాల్లో ఆయా దేశాలు ఇస్రాయేల్ పై చేసిన దాడుల గురించి ఆసాపు ఆలోచించి రాస్తూ ఉండవచ్చు. అంటే గడిచిన శతాబ్దాలన్నిటిలో ఇస్రాయేల్‌కు శత్రు దేశాలందరిదీ ఒకటే ఉద్దేశం – ఒక జాతిగా లేకుండా వారిని తుడిచిపెట్టెయ్యడం. దేవుని శత్రువులు మౌనంగా లేరు (2 వ). దేవుడు మాట్లాడి వారి నోరు మూయించాలి.

2. నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు.

తన వాక్కును, సత్యాన్ని, రక్షణను లోకానికి అందించేందుకు దేవుడు ఇస్రాయేల్‌ను ఎన్నుకొని హెచ్చించాడు. ఇస్రాయేల్‌ను ద్వేషించేవారు వెలుగును, సత్యాన్ని, దేవుణ్ణి ద్వేషించారన్నమాటే. ఈనాడు కూడా క్రీస్తు విశ్వాసులను ద్వేషించేవారు ఇదే శోచనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారు దైవద్వేషులు (యోహాను 3:20; యోహాను 15:18 యోహాను 15:24; రోమీయులకు 1:30; 1 యోహాను 3:13).

3. నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్ను చున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచన చేయు చున్నారు

“నీలో దాక్కొన్నవారిని”– హీబ్రూ పదానికి అర్థం దాక్కొన్నవారు లేక అపురూపంగా దాచిపెట్టుకున్న ధనం లేక ఈ రెండు అర్థాలు దాచబడిన నిధి. దేవుని దృష్టిలో విశ్వాసులు ఇలాంటివారే.

4. వారుఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు.

వివిధ రకాల జనాలు, ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేనివారు కూడా ఒకే ఉద్దేశంతో ఏకమయ్యారు – వారంతా దేవునికి వ్యతిరేకులై వీలుంటే దేవుని ప్రజలను నాశనం చేయాలని ఇష్టపడతారు. శత్రువులైన హేరోదు, పిలాతు అంతే గదా. క్రీస్తును సిలువ వేసిన సందర్భంలో ఇద్దరూ స్నేహితులయ్యారు (లూకా 23:12; కీర్తనల గ్రంథము 2:2 చూడండి). ఈజిప్ట్‌లో ఫరో, కనాను చుట్టూ ఉన్న జాతులు, పర్షియాలో హేమాను అప్పటినుంచి జర్మనీకి పాలకుడైన హిట్లర్‌తో సహా ఎంతో మంది ఇస్రాయేల్‌వారిని చితక్కొట్టి వారి పేరే ఇక వినబడకుండా సమూలంగా తుడిచిపెట్టేద్దామని చూశారు. ఇలాంటి ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఇకనుంచీ విఫలం కాక మానవు. ఇస్రాయేల్ ప్రజల విషయంలో దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. వాటిని ఆయన తప్పక నెరవేర్చుకొంటాడు. అదే విధంగా ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులూ జనాలూ క్రీస్తును అనుసరించేవారిని సమూల నాశనం చేసేందుకు చూశారు. అలా చెయ్యడం కేవలం అసాధ్యం (మత్తయి 16:18). నిజానికి అలాంటి ప్రయత్నాలు తరచుగా ఇంకా వారి సంఖ్య అధికం అయ్యేందుకే, వారి బలప్రభావాలూ పవిత్రత పెరిగేందుకే దోహదం చేశాయి.

5. ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు.

6. గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును

ఇక్కడ చెప్పిన శత్రువులు ఇస్రాయేల్‌కు అన్ని దిశల్లోనూ ఉన్నారు.

7. గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.

8. అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు.(సెలా.)

9. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.

ఆసాపు ఇస్రాయేల్ ప్రజల చరిత్రను ఆధారం చేసుకొని ప్రార్థిస్తున్నాడు. న్యాయాధిపతులు 4:7 న్యాయాధిపతులు 4:15 న్యాయాధిపతులు 4:21-24; న్యాయాధిపతులు 7:1-25; న్యాయాధిపతులు 8:12 న్యాయాధిపతులు 8:21.

10. వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.

11. ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.

12. దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు.

“నివాసాలు”– ఇక్కడి హీబ్రూ పదానికి పచ్చిక మైదానాలు అనే అర్థం కూడా వస్తుంది.

13. నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము

ఇలాంటి ప్రార్థనల గురించి కీర్తనల గ్రంథము 35:8 నోట్ చూడండి.

14. అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు

15. నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.

16. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.

తమ శత్రువులకు నాశనం లేక ఓటమి రావాలని ప్రార్థించడంలో దేవుని మూలంగా రాసిన కీర్తనకారులకు మంచి కారణాలు ఉన్నాయి (కీర్తనల గ్రంథము 7:6-9 చూడండి). ఇక్కడ ఆసాపు రెండు కారణాలను ఇస్తున్నాడు. మనుషులు నిజ దేవుణ్ణి వెదికేలా (16 వ), యెహోవాయే విశ్వమంతటిలోనూ దేవుడని తెలుసుకునేలా (18 వ). కాబట్టి ఆసాపు పగపట్టి గానీ మానవపరమైన ప్రతీకారం సాధించాలనే తలంపుతో గానీ ప్రార్థించలేదు. దేవునికి మహిమ కలగాలనీ, దేవుణ్ణి వెదికి ఆయన్ను తెలుసుకునే వారందరికీ మేలు జరగాలనీ అతడు ఈ విధంగా ప్రార్థించాడు. ఈ మంచి విషయంతో ఆసాపు రాసిన కీర్తనలకు సమాప్తం అయింది.

17. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక.

18. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |