Psalms - కీర్తనల గ్రంథము 85 | View All

1. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు.

శీర్షిక – కీర్తన 42 నోట్. ఈ కీర్తనను సహజంగా మూడు భాగాలు చెయ్యవచ్చు. మొదటి 3 వచనాల్లో రచయిత గతంలో దేవుడు చూపిన అనుగ్రహాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. 4-7 వచనాల్లో అప్పటిలాగానే అనుగ్రహించవలసిందని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. 8-13 వచనాల్లో దేవునినుంచి వచ్చిన సందేశాన్ని వివరిస్తున్నాడు. ప్రత్యేకించి ఏ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని రచయిత ఇది రాశాడో తెలియదు. న్యాయాధిపతులు గ్రంథంలో రాసివున్న కొన్ని వివిధ సంఘటనలను గురించి రాసివుండవచ్చు. “వెనక్కు రప్పించావు”– దీని గురించి కీర్తనల గ్రంథము 80:3 నోట్ చూడండి. ఈ హీబ్రూ పదానికి ఆధ్యాత్మికమైన విడుదల, లేక ఇహసంబంధమైన చెరనుంచి విడుదల అనే రెండు అర్థాలూ ఉన్నాయి. లేక రకరకాల బాధలనుండి విడుదల అనే అర్థం కూడా రావచ్చు (కీర్తనల గ్రంథము 14:7; కీర్తనల గ్రంథము 53:6; కీర్తనల గ్రంథము 68:18; యోబు 42:10).

2. నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా.)

3. నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు

కీర్తనల గ్రంథము 78:38; కీర్తనల గ్రంథము 106:23. దేవుని కోపాన్ని రేపేది పాపం. పాపాన్ని బలిమూలంగా కప్పివేయడంద్వారా క్షమాపణ పొందితే దేవుని కోపం తొలగిపోతుంది. కీర్తనల గ్రంథము 90:7-11; సంఖ్యాకాండము 25:3 దగ్గర దేవుని కోపంపై నోట్స్ చూడండి.

4. మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము.మా మీదనున్న నీ కోపము చాలించుము.

దేవుడు ఇప్పటికే వారిని విడిపించి తన కోపాన్ని మరల్చుకున్నట్లయితే, అలా చెయ్యాలని ఇంకా ఈ ప్రార్థన ఎందుకు? ప్రజలు మళ్ళీ పాపంలో పడిపోయినట్టు ఉంది. న్యాయాధిపతులు 2:11-19; ఎజ్రా 9:5-10 పోల్చి చూడండి.

5. ఎల్లకాలము మామీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా?

6. నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా?

ఆధ్యాత్మిక జీవం లేకుండా, దేవుని కృప, రక్షణ, పాపవిముక్తి అనుభవం లేకుండా నిజమైన ఆనందం లేదు. తన ప్రజలు పాపాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండాలన్నది దేవుని కోరిక కాబట్టి ఇది ఆయన సంకల్పమనే స్థిరమైన పునాదిపై ఆధారపడిన ప్రార్థన.

7. యెహోవా, నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయుము.

8. దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ వచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.

“వింటాను”– దేవునితో మాట్లాడడమొక్కటే చాలదు. ఆయన్ను మనతో మాట్లాడనివ్వాలి. ఆయన మనతో చెప్పేదాన్ని మనం వింటే మనం చెప్పేదాన్ని ఆయన వింటాడు. ఆయన జవాబిచ్చేదాకా ప్రార్థన ఆపకుండా నమ్మకంతో ఎదురు చూస్తే ఆయన తప్పక జవాబిస్తాడు. ఇక్కడ రచయిత శాంతి, నీతిన్యాయాల సందేశాన్ని విన్నాడు. మిగిలిన వచనాల్లో న్యాయం అనే మాట నాలుగు సార్లు కనిపిస్తుంది. ఇదే ఈ భాగానికి మూలాంశం. “మళ్ళీ”– మనం మన మూర్ఖత్వం, పాపంతో కూడిన మార్గాలవైపు మళ్ళీ తిరిగితే త్వరలోనే దేవుని శాంతిని కోల్పోతాం.

9. మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.

దేశంలో దేవునిపట్ల భయభక్తులున్నవారు కొందరింకా నిలిచి ఉన్నారు కాబట్టే జెరుసలంలో దేవుని మహిమ నివసిస్తూ ఉంది. యెహెజ్కేలు కాలంలో అది ఆలయంనుంచి వెళ్ళిపోయింది (యెహెఙ్కేలు 10:18-19; యెహెఙ్కేలు 11:23). క్రీస్తు రాకడతో ఇస్రాయేల్‌కు మరింత లోతైన సంపూర్ణమైన విధానంలో దేవుని మహిమ తిరిగి వచ్చింది (యోహాను 1:14). దేవునిపట్ల భయభక్తుల గురించి నోట్స్ కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; ఆదికాండము 20:11; సామెతలు 1:7 చూడండి.

10. కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.

దేవునికి చెందిన ఈ నాలుగు దివ్య లక్షణాలు యేసుప్రభువులో ఏకమై పెనవేసుకున్నాయి. ముఖ్యంగా యేసు సిలువ దగ్గర ఇవన్నీ మిళితమైనట్టు చూడవచ్చు. మనం ఊహించగలిగినంత వరకు దేవుని కృప అత్యంత అమోఘంగా అక్కడే ప్రదర్శించబడింది. అక్కడ మానవ స్వభావం గురించి, క్రీస్తు స్వభావం గురించి, తండ్రి అయిన దేవుని స్వభావం గురించిన సత్యం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వెల్లడైంది. అక్కడ మనుషుల పాపాలను శిక్షించవలసిన దేవుని న్యాయం నెరవేరింది, పవిత్రుడైన దేవునికీ పాపియైన మనిషికీ మధ్య శాంతి ప్రవాహాలు బయలుదేరాయి (రోమీయులకు 3:21-26; 2 కోరింథీయులకు 5:18-19; కొలొస్సయులకు 1:19-20). నీతిన్యాయాలే శాంతికి ఆధారమై ఉండాలి (యెషయా 32:17). నీతిన్యాయాల పై ఆధారపడని శాంతి నిజమైన శాంతి కానే కాదు.

11. భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును.

యెషయా 45:8. సిలువపై క్రీస్తు నెరవేర్చిన పని ద్వారా సత్యమనే విత్తనం భూమిపై చల్లినట్టయింది. అది మొలకెత్తి ఎదిగి సమృద్ధిగా కోతకు వస్తుంది. నీతి న్యాయాలు పరలోకంనుంచి ప్రశాంతంగా, చిరునవ్వుతో తొంగిచూస్తాయి. ఈ వచనం నెరవేర్పు కోసం భూమి ఇంకా ఎదురు చూస్తూవుంది.

12. యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.

13. నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.

కీర్తనల గ్రంథము 89:14 దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతిన్యాయాలు కూడా వెళ్తాయి. నీతిన్యాయాలు వెళ్ళేచోటికి కృప, సత్యం వెళ్తాయి. మనం దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే ఇవన్నీ మనవే అవుతాయి.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |