Psalms - కీర్తనల గ్రంథము 90 | View All

1. ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.

శీర్షిక – దేవుని మనిషి ఎవరైనా ప్రార్థించే మనిషి అయి ఉండడం తప్పనిసరి. ఈ కీర్తనలు గ్రంథంలో మోషే రాశాడని చెప్పిన కీర్తన ఇదొక్కటే. ఇది దాదాపు, 3,400 సంవత్సరాల క్రితం రాయబడింది. ఉనికిలో ఉన్న కీర్తనలన్నిట్లోనూ గీతాలన్నిట్లోనూ అతి ప్రాచీనమైన వాటిలో ఇది ఒకటి, బహుశా అన్నిటికంటే ప్రాచీనమైనదే. మనకు తెలిసిన మోషే ఇతర రచనల్లాగానే పదాల కూర్పు, విషయం, ఈ రెంటిలోనూ ఇది గంబీరమైనది, భావగర్భితమైనది. మోషే, ఇస్రాయేల్ ప్రజలు ఎడారిలో తిరుగుతూ, గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు. వారిది కాని ఒక దేశాన్ని విడిచి, తామింకా స్వంతం చేసుకోని మరో దేశానికి బయలు దేరారు. భూమి పై వారు బాటసారుల్లాగా యాత్రికుల్లాగా పరదేశుల్లాగా ఉన్నారు. అయితే వారికి స్థిరమైన శాశ్వతమైన నివాస స్థలం ఒకటుంది. అది సాక్షాత్తూ యెహోవాదేవుడే. ఈ క్రొత్త ఒడంబడిక యుగంలోని విశ్వాసుల విషయంలో కూడా ఇది వాస్తవమే (యోహాను 17:21; కొలొస్సయులకు 3:3; 1 యోహాను 4:15). దేవుడే మన నివాసం అయినప్పుడు ధనికులపై వారి భవనాల గురించి, రాజుల పై వారి నగరుల గురించి అసూయ చెందవలసిన పని లేదు. ఆ భవనాలు, నగరులు నేలకూలి దుమ్ములో కలిసిపోయినప్పటికీ విశ్వాసుల నివాస గృహమైన సజీవ దేవుడు ఇంకా ఉంటాడు. ఇప్పుడు విశ్వాసులు పూరి గుడిసెల్లో ఉండవలసివచ్చినా, కొండ గుహల్లో తల దాచుకోవలసివచ్చినా (హెబ్రీయులకు 11:37-38) వారికి ఇప్పుడు, శాశ్వతంగానూ నివాసస్థలం దేవుడేనని ఎప్పుడూ మర్చిపోకూడదు.

2. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు

మోషే ఇప్పుడు దేవుని శాశ్వత ఉనికికీ మనుషుల క్షణికమైన పెళుసు జీవితానికి ఉన్న తేడాను చూపుతున్నాడు. సృష్టికి ముందు దేవుడున్నాడు, ఈ సృష్టి గతించి పోయిన తరువాత ఉంటాడు. సృష్టి దేవునికి ఏదీ కలపలేదు, సృష్టి గతించిపోతే అది ఆయన్నుంచి ఏమీ తీసివేయదు (కీర్తనల గ్రంథము 93:20; కీర్తనల గ్రంథము 102:24 కీర్తనల గ్రంథము 102:27; ద్వితీయోపదేశకాండము 33:27; యిర్మియా 10:10; రోమీయులకు 1:20).

3. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.

అయితే మనిషి మంటినుంచి తీయబడ్డాడు. దానికే తిరిగి వెళ్ళిపోతాడు (ఆదికాండము 3:19; కీర్తనల గ్రంథము 104:29). అయితే ఈ బలహీనమైన అజ్ఞాన జీవులెంత గర్విష్ఠులు! వారిని చేసిన దేవుని ఉనికిని కూడా కాదనేంత అహంకారులు.

4. నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.
2 పేతురు 3:8

మనకు కాలం భారంగా గడుస్తుంది. నూరేళ్ళంటే మనకు సుదీర్ఘమైన కాలం. దేవునికైతే వెయ్యేళ్ళు అయినా ఒక రోజులాంటిది, లేదా మనుషులు నిద్రపోయే జాములాంటిది (2 పేతురు 3:8). ఆయనకు మానవ చరిత్ర కాలమంతా కొద్ది రోజుల్లాగా ఉంది. జాము అనే మాట తీసుకొంటే ఆ చరిత్రంతా ఒకే ఒక రోజులాంటిది దేవుని దృష్టిలో.

5. వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు

దేవుడు అనంతంగా జీవిస్తాడు. అయితే మానవజాతి తరం వెంట తరం వడిగా ప్రవహించే నదీ ప్రవాహం పై తేలే నురుగులాగా గతించిపోతుంది.

6. ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.

ఒక్క రోజు కూడా నిలిచి ఉండని గడ్డిలాంటివాడు మనిషి – కీర్తనల గ్రంథము 103:15; యెషయా 40:6-8; 1 పేతురు 1:24-25.

7. నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.

మానవ జీవితం అంత త్వరగా గతించిపోవడానికీ, అంత కష్టాలతో కన్నీళ్ళతో నిండి ఉండడానికీ కారణాలను మోషే ఏకరువు పెడుతున్నాడు. అదంతా మనుషుల పాపాల పై దేవుని కోపం ఫలితమే. మోషే ఇస్రాయేల్ ప్రజలను ఎడారి గుండా నడిపిస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోండి. వారి అపనమ్మకం, తిరుగుబాటుల ఫలితంగా ఈజిప్ట్ నుంచి బయటికి వచ్చిన వారిలో 20 ఏళ్ళు ఆ పై వయస్సు ఉన్నవారంతా నాశనానికి గురి అయ్యారు. వారి పైకి దేవుని కోపం పదే పదే రావడం కనిపిస్తున్నది (సంఖ్యాకాండము 25:3; ద్వితీయోపదేశకాండము 4:25 నోట్స్‌). ఆయన స్వంత ప్రజలమీదే దేవుడు కోపగించాడు కాబట్టి మానవజాతి అంతటి పాపాల మీద, అపనమ్మకం మీద కూడా తప్పక ఆయన కోపం ఉందని గట్టిగా చెప్పవచ్చు (యోహాను 3:36; రోమీయులకు 1:18). అయితే ఈ కృపాయుగంలో విశ్వాసుల మీదికి కూడా దేవుని కోపం వస్తుందా? పాపం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడెల్లా దేవుని కోపం ఉంటుంది. నరకంలో శాశ్వతకాలం అవిశ్వాసులపై మండే దేవుని కోపం నుంచి విశ్వాసులు తప్పించుకొన్నారన్నది ఖాయం (రోమీయులకు 5:9; 1 థెస్సలొనీకయులకు 1:10; 1 థెస్సలొనీకయులకు 5:9). విశ్వాసులు ఆ ఉగ్రతకు, ఆ శిక్షకు ఎప్పుడూ గురి కారు. అయితే విశ్వాసులు పాపాలు చేస్తే ఆ పాపాల మీద ఆయన కోపం తప్పకుండా ఉంటుంది. కొన్ని సార్లు ఈ కోపం బహు స్పష్టమైన రీతుల్లో బయట పడుతుంది (ఎఫెసీయులకు 5:6-7; 1 కోరింథీయులకు 11:27-30). అవినీతి, స్వార్థం, మోసం, అబద్ధాలు, పేరాశ ఇలాంటి పాపాలు విశ్వాసుల్లో ఉన్నా అవిశ్వాసుల్లో ఉన్నా దేవునికి అసహ్యమే. తేడా లేదు. దేవుడెప్పుడూ పాపాన్ని ద్వేషిస్తాడు. అది ఎక్కడ కనిపించినా సరే దానితో పోరాడుతాడు. మనుషులు గడ్డిలాగా వాడి ఎండిపోయి చనిపోవడానికి కారణం దేవుని కోపమే గాని కేవలం సహజసిద్ధంగా అనివార్యమైన ప్రకృతి ధర్మం వల్ల కాదని గమనించండి.

8. మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.

దేవుని కోపానికి కారణం ఇక్కడ చెప్తున్నాడు. మనుషుల పాపాలన్నిటినీ, వారి అంతరంగాల్లోని రహస్య పాపాలనూ బహిరంగంగా అందరికీ కనిపించే అపరాధాలనూ దేవుడు తన పవిత్రమైన దృష్టితో గుచ్చి గుచ్చి చూస్తున్నాడు.

9. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.

“జీవిత కాలమంతా”– మోషే వాడిన ఈ కఠినమైన మాట చూడండి. “మా” అనే మాట కూడా గమనించండి. అయితే దేవుని ప్రజలు ఆయనలో నివసిస్తూ కూడా అదే సమయంలో ఆయన కోపం వారిని ఆవరించి ఉండడం సాధ్యమేనా? అవును, తప్పకుండా. దేవునిలో నివసించడమంటే దేవుని పవిత్ర స్వభావం కౌగిట ఉండడం. ఈ పవిత్ర స్వభావం పాపానికంతటికీ, చెడుతనానికంతటికీ వ్యతిరేకంగా అగ్ని లాగా మండుతూ ఉంది.

10. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.

పురాతన కాలంలోని వారు దాదాపు వెయ్యేళ్ళదాకా జీవించారు (ఆది 5 అధ్యాయం). దానితో పోల్చుకుంటే డెబ్భై, ఎనభై చాలా తక్కువ. అయినా బాధలు అనుభవించే విశ్వాసులకు ఇది సరిపోతుంది. పశ్చాత్తాపపడని పాపులకు ఇది చాలా ఎక్కువ. వారు ఎంత దీర్ఘకాలం జీవిస్తే తమకోసం ఉగ్రతను, శిక్షను అంత ఎక్కువగా పోగు చేసుకుంటూ ఉంటారు (రోమీయులకు 2:4-5).

11. నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?

పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం ఎంత గొప్పదంటే, ఎంత తీవ్రమంటే ఏ మనిషీ దాన్ని తెలుసుకోలేడు, అర్థం చేసుకోలేడు. బైబిల్లో కొన్ని భాగాల్లో బీకరమైన మాటల ద్వారా ఆ కోపం వెల్లడి అయింది. (ఉదా।। లేవీయకాండము 26:14-39; ద్వితీయోపదేశకాండము 4:25; ద్వితీయోపదేశకాండము 28:15-68; యెషయా 24:1-6; యెషయా 30:33; మార్కు 9:42-49; లూకా 16:19-31; 2 థెస్సలొనీకయులకు 1:6-10; ప్రకటన గ్రంథం 14:9-11; ప్రకటన గ్రంథం 16:1-21; ప్రకటన గ్రంథం 20:11-15; ప్రకటన గ్రంథం 21:8.) అయితే బైబిలులో దేవుని కోపంలోని శక్తి అతిశయోక్తిగా చెప్పబడలేదు. అసలు దాన్ని ఎక్కువగా నొక్కి చెప్పడం అసాధ్యం. అది ఎంత భయంకరమైనదో, ఎంత బీకరమో, ఎంత హడలు పుట్టించేదో మాటల్లో చెప్ప నలవి కాదు. దానికి భయపడక, దాన్ని తేలిక విషయంగా కొట్టిపారేసే వాళ్ళూ, అసలు మొత్తంగా దాన్ని నమ్మనివాళ్ళూ ఎంత అవివేకులో, ఎంత దుర్మార్గులో!

12. మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.

ఇక్కడ మోషే ప్రార్థన ఆరంభం. ఇంతకు ముందున్నదంతా ఈ ప్రార్థనకు పీఠిక. పైన చదివినదాన్ని బట్టి మనం ఆసక్తి వహించవలసిన విషయాలు ఇవి – జ్ఞానం కలిగి మన జీవితం ఎంత చిన్నదో అర్థం చేసుకోవాలి, దేవుడే మన శాశ్వత నివాసమయ్యేలా చూచుకోవాలి.

13. యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.

కీర్తనల గ్రంథము 6:3; కీర్తనల గ్రంథము 74:10.

14. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.

7-11 వచనాల్లోని సత్యాన్ని గుర్తించిన తరువాత తృప్తి, ఆనందం, ఉల్లాస గానం సాధ్యమేనా? సాధ్యమేనని మోషే భావించినట్టున్నాడు. పాపం మీద దేవుని కోపమనే కారు మేఘాలు ఆవరించినప్పటికీ దేవుని ప్రేమ, జాలి, దయ, కృప అనే ప్రకాశమానమైన కాంతి రేఖలు వాటిలో గుండా ప్రసరిస్తున్నాయని అతనికి బాగా తెలుసు. విశ్వాసులంతా ఎరిగినట్టుగానే పాపాలకు క్షమాపణ ఉందనీ, అంతర్వాణి నిర్మలంగా ఉంటే, దేవుని ముఖకాంతి వారిపై ప్రసరిస్తే ఆనందం ఉంటుందనీ మోషేకు కూడా తెలుసు (కీర్తనల గ్రంథము 5:11; కీర్తనల గ్రంథము 16:11; కీర్తనల గ్రంథము 30:5; కీర్తనల గ్రంథము 32:11; కీర్తనల గ్రంథము 35:27; కీర్తనల గ్రంథము 42:4; కీర్తనల గ్రంథము 51:8; కీర్తనల గ్రంథము 132:9 కీర్తనల గ్రంథము 132:16). పాపానికి వ్యతిరేకంగా ఉన్న దేవుని పవిత్ర కోపం మధ్యలో విశ్వాసులు జీవిస్తున్నప్పటికీ ఆయన పవిత్ర ఆనంద హృదయంలో వారు నివసిస్తున్నారు. ఇస్రాయేల్ బాధలు పడినప్పుడు, వారిని బాధలు పెట్టినది దేవుడేననీ, వారు ఆనందించినప్పుడు అలా ఆనందించేలా చేసినది దేవుడొక్కడేననీ మోషేకు తెలుసన్న విషయం గుర్తించండి.

15. నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము.

16. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.

“పని”– కీర్తనల గ్రంథము 44:1; కీర్తనల గ్రంథము 77:12; కీర్తనల గ్రంథము 92:4; ద్వితీయోపదేశకాండము 32:4. వాగ్దాన దేశాన్ని స్వంతం చేసుకోగలవారు ఎడారిలో తిరుగులాడినవారి సంతానం. వారి తండ్రులు ఒకప్పుడు చూచినరీతిగా వారూ దేవుని మహిమను తేరి చూడాలని మోషే ప్రార్థిస్తున్నాడు.

17. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.

దేవుని సేవకుడుగా స్థిరంగా నిలిచి ఉండే పనిని, దేవుని ఆశీర్వాదాల ముద్రను కలిగి ఉండే పనిని సాధించాలని మోషే ఆశయం. మనకూ ఈ ఆశయం ఉండకూడదా (యోహాను 15:16; 1 కోరింథీయులకు 3:13-15; ప్రకటన గ్రంథం 22:12).



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Psalms - కీర్తనల గ్రంథము 90 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవుని శాశ్వతత్వం, మనిషి యొక్క బలహీనత. (1-6)
ఈ కీర్తన సంఖ్యలు 14లో నమోదు చేయబడినట్లుగా, అరణ్యంలో ఇజ్రాయెల్‌పై ఉచ్ఛరించిన తీర్పును సూచిస్తుందని భావించబడింది. ఈ పడిపోయిన ప్రపంచంలో ఆత్మకు ఏకైక ఆశ్రయం మరియు ఓదార్పు దేవుని దయ మరియు రక్షణలో ఉంది. మనం ఆశ్రయం పొందగల పవిత్ర స్థలం మరియు నివాస స్థలంగా క్రీస్తు యేసు నిలుస్తాడు. మేము మర్త్యులము; మన ప్రాపంచిక సుఖాలన్నీ అశాశ్వతమైనవి, కానీ దేవుడు శాశ్వతమైనవాడు, విశ్వాసులు అనుభవించే నిరంతర ఉనికి. దేవుడు, అనారోగ్యం లేదా ఇతర కష్టాల ద్వారా ప్రజలను విధ్వంసం వైపు మళ్లించినప్పుడు, వారు ఆయన వద్దకు తిరిగి రావాలని, వారి అతిక్రమణల గురించి పశ్చాత్తాపపడాలని మరియు కొత్త జీవితాన్ని స్వీకరించాలని వారికి ఆహ్వానం.
దేవుని శాశ్వతత్వం యొక్క పరిధిలో వెయ్యి సంవత్సరాలు అంటే ఏమీ లేదు. ఒక నిమిషం మరియు మిలియన్ సంవత్సరాల మధ్య కొంత నిష్పత్తి ఉంది, కానీ కాలాన్ని శాశ్వతత్వంతో పోల్చినప్పుడు ఏదీ లేదు. గత లేదా భవిష్యత్తులో జరిగిన అన్ని వేల సంవత్సరాల సంఘటనలు మనకు చివరి గంటలో సంభవించిన దాని కంటే శాశ్వతమైన మనస్సుకు తక్షణమే. పునరుత్థానంలో, శరీరం మరియు ఆత్మ రెండూ తిరిగి కలుస్తాయి. నిద్రపోతున్న మనుష్యుల వలె సమయం గుర్తించబడకుండా గడిచిపోతుంది; ఒక్కసారి పోయిన తర్వాత, అది ఏమీ లేనంత చిన్నదిగా మారుతుంది. జీవితం క్షణికావేశం, వరద నీరులా పారుతోంది. మానవత్వం గడ్డిలా క్లుప్తంగా వర్ధిల్లుతుంది, ఇది వృద్ధాప్య శీతాకాలం రాగానే వాడిపోతుంది, లేదా అనారోగ్యం లేదా దురదృష్టం వల్ల అది కరిగిపోతుంది.

 దైవిక శిక్షలకు సమర్పించడం. (7-11) 
నీతిమంతులు భరించే పరీక్షలు తరచుగా దేవుని ప్రేమ నుండి ఉత్పన్నమవుతాయి, అయితే వారి అతిక్రమణల కోసం విశ్వాసులతో సహా పాపులకు సూచించిన ఉపదేశాలు దేవుని అసమ్మతి యొక్క వ్యక్తీకరణలుగా గుర్తించబడాలి. దాచిపెట్టబడిన పాపాలు కూడా దేవునికి తెలుసు మరియు వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అలాంటి ప్రయత్నాలు ఫలించవు కాబట్టి, తమ పాపాలను దాచడానికి ప్రయత్నించే వారి మూర్ఖత్వాన్ని పరిగణించండి. మా సంవత్సరాలు, ఒకసారి పోయిన, మాట్లాడే మాటల వలె తిరిగి పొందలేనివి. జీవితం మొత్తం శ్రమతో కూడుకున్నది మరియు సమస్యాత్మకమైనది, మరియు మనం ఊహించిన సంవత్సరాల మధ్య కూడా అది అకస్మాత్తుగా తగ్గించబడవచ్చు. ఇవన్నీ మనం జీవితాన్ని గౌరవప్రదంగా సంప్రదించాలని బోధిస్తాయి.
పడిపోయిన దేవదూతలు దేవుని కోపం యొక్క శక్తిని అర్థం చేసుకుంటారు; నరకం యొక్క లోతులలో ఉన్నవారికి దానితో పరిచయం ఉంది. అయితే, మనలో ఎవరు దానిని తగినంతగా వర్ణించగలరు? దురదృష్టవశాత్తూ, కొంతమంది మాత్రమే దానిని అర్హమైన గురుత్వాకర్షణతో ఆలోచిస్తారు. పాపాన్ని అపహాస్యం చేసి, క్రీస్తు ప్రాముఖ్యతను చిన్నచూపు చూసే వారు దేవుని కోపం యొక్క శక్తిని నిజంగా గ్రహించలేరు. కాబట్టి, ఆ దహించే అగ్ని సమక్షంలో మనలో ఎవరు ఉండగలరు?

దయ మరియు దయ కోసం ప్రార్థన. (12-17)
నిజమైన జ్ఞానాన్ని పొందాలనుకునే వారు దైవిక మార్గదర్శకత్వాన్ని శ్రద్ధగా వెతకాలి. వారు ఉపదేశము కొరకు పరిశుద్ధాత్మను వేడుకోవాలి మరియు దేవుని అనుగ్రహం తిరిగి వచ్చినప్పుడు ఓదార్పు మరియు సంతోషం కొరకు ఆరాటపడాలి. వారి ప్రార్థనలలో, వారు దేవుని దయను కోరుకుంటారు, వారి స్వంత యోగ్యత ఆధారంగా తమకు ఎటువంటి హక్కు లేదని పూర్తిగా తెలుసుకుంటారు. దేవుని అనుగ్రహం భవిష్యత్తులో ఆనందానికి అనంతమైన మూలం మరియు గత దుఃఖాలకు తగినంత ప్రతిఘటనగా ఉంటుంది.
మనలోని దేవుని అనుగ్రహం సత్కార్యాల ప్రకాశాన్ని ప్రసాదించుగాక. మరియు దైవిక ఓదార్పులు మన హృదయాలను ఆనందంతో నింపుతాయి మరియు మన ముఖాలను ప్రకాశవంతం చేస్తాయి. ప్రభూ, మా చేతుల పనిని స్థిరపరచండి మరియు దానిలో మమ్మల్ని స్థిరపరచండి. మనల్ని శాశ్వతంగా పేదరికంలోకి నెట్టివేసే నశ్వరమైన కోరికలను వెంటాడుతూ మన విలువైన, నశ్వరమైన రోజులను వృధా చేసుకునే బదులు, మన పాపాలకు క్షమాపణ మరియు పరలోకంలో వారసత్వాన్ని కోరుకుందాం. పరిశుద్ధాత్మ పరివర్తన కలిగించే పని మన హృదయాలలో స్పష్టంగా కనిపించాలని మరియు మన చర్యల ద్వారా పవిత్రత యొక్క అందం ప్రకాశింపజేయాలని ప్రార్థిద్దాం.



Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |