Psalms - కీర్తనల గ్రంథము 94 | View All

1. యెహోవా, ప్రతికారముచేయు దేవా, ప్రతికారముచేయు దేవా, ప్రకాశింపుము
1 థెస్సలొనీకయులకు 4:6

దీని రచయిత ఎవరో మనకు తెలియదు. ఇతడు అధికారంలో ఉన్న దుర్మార్గులు పెట్టే పీడనకు గురై బాధపడు తున్నాడు. దేశంలో న్యాయం వక్రమార్గం పడుతున్నందుకు అతడు కంగారు పడుతున్నాడు. ప్రజల పై పరిపాలన చేసే అధికారం దుర్మార్గుల చేతుల్లో ఉంది (వ 20). వారు దేవుని ప్రజలను నలగ్గొట్టారు (వ 5), బలహీనులను నిస్సహాయులను హత్య చేశారు (వ 6). అందువల్ల దేవుడు వారికి ప్రతీకారం చెయ్యాలని రచయిత ప్రార్థిస్తున్నాడు. వ్యక్తిగతమైన పగను బట్టి చేసిన ప్రార్థన కాదిది. న్యాయం గెలవాలనీ, హింసలకు గురైన వారికి సంరక్షణ కలగాలనీ కోరిక ఉన్నందువల్ల ఇలా ప్రార్థిస్తున్నాడు. మనం ప్రతీకారం దేవునికే వదిలెయ్యాలి. తన సమయంలో, తన పద్ధతిలో ఆయన దాన్ని జరిగిస్తాడు (నిర్గమకాండము 21:23-25; సంఖ్యాకాండము 31:2; నహూము 1:2 నహూము 1:7; రోమీయులకు 12:19; 2 థెస్సలొనీకయులకు 1:6-7; హెబ్రీయులకు 10:30-31).

2. భూలోక న్యాయాధిపతీ లెమ్ము గర్విష్టులకు ప్రతిఫలమిమ్ము

ఇక్కడ దేవుని పేరు ఒకటి ఉంది. ఆయన లోకానికి తీర్పు తీరుస్తాడు (కీర్తనల గ్రంథము 58:11; ఆదికాండము 18:25; అపో. కార్యములు 17:31).

3. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?

కీర్తనల గ్రంథము 6:3; కీర్తనల గ్రంథము 74:10; కీర్తనల గ్రంథము 90:13.

4. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడు చున్నారు.

చెడు మార్గాలకూ డంబాలు చెప్పుకోవడానికీ ఉన్న సంబంధాన్ని గమనించండి (కీర్తనల గ్రంథము 10:3; కీర్తనల గ్రంథము 52:1).

5. యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని

విశ్వాసులు దేవుని ప్రజలు, దేవుని సొత్తు. వారిని ఆయన మరెప్పటికీ అలానే నలిగిపోనిస్తాడా? ఎంతమాత్రం కాదు.

6. యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు

దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఇస్రాయేల్ ప్రజలు విధవరాళ్ళపట్ల, పరదేశుల పట్ల, అనాథల పట్ల ప్రత్యేకమైన దయ చూపించాలి – నిర్గమకాండము 22:21-22; ద్వితీయోపదేశకాండము 10:18-19; ద్వితీయోపదేశకాండము 14:28-29; ద్వితీయోపదేశకాండము 24:19-20; ద్వితీయోపదేశకాండము 27:19. దానికి బదులు ఈ దుష్ట పాలకులు వారిని హత్య చేశారు.

7. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు.

కీర్తనల గ్రంథము 10:11; కీర్తనల గ్రంథము 14:1. దుర్మార్గులు బయటికి ఎంత భక్తిగా, మత సంబంధంగా కనిపించాలని ప్రయత్నించినా మనసులో మాత్రం నాస్తికులే. ఏకైక నిజ పవిత్ర దేవుని గురించిన సత్యాన్ని వారు అణచివేస్తారు.

8. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?

దేవుణ్ణి లెక్కచెయ్యని అవిశ్వాసుల కటిక మూర్ఖత్వాన్ని రచయిత చూపిస్తున్నాడు. వారు గొప్ప విద్యావంతులై ఉండి సామాన్యులైన విశ్వాసులను చిన్నచూపు చూడవచ్చు. అయితే వారు మూర్ఖులు, జ్ఞానాన్ని విడిచిపెట్టినవారు. విశ్వాసులే వారిని చిన్నచూపు చూడవలసిన కారణం ఉంది (కాని వారలా చెయ్యకూడదు). ఈ అవిశ్వాసులు మనిషి చెవిని, శబ్దాలను వినే ఆ అద్భుత పరికరాన్ని చూచి దాన్ని సృష్టించిన వాడెవరూ లేరనుకోగలరా, లేక ఆయనకు చెవుడు అనుకోగలరా? దృష్టి కారకమైన ఆ అద్భుత అవయవం కన్నును తీసుకోండి. దానికి సృష్టికర్త ఎవరూ లేరని లేక ఆ సృష్టికర్త చూడలేడని జ్ఞానాన్ని విడిచిపెట్టిన మూర్ఖులు మాత్రమే అనుకోగలరు. మనిషి తనకున్న కొద్దిపాటి స్వల్ప జ్ఞానాన్ని గురించి మిడిసిపడుతూ దేవునికేమీ జ్ఞానం లేదని అనుకోగలడా ఏమిటి! దేవుడు మొత్తం జాతులనే శిక్షిస్తాడు. అలాంటివాడు కేవలం కొందరు దుర్మార్గుల సంగతి చూడలేడా? మనిషి ఆలోచనలు ఎంత వ్యర్థం, ఎంత దుర్మార్గం! దేవుడు వట్టివాడని ఒక మనిషి అనుకుంటే అతడే వట్టివాడైపోతాడు.

9. చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?

10. అన్యుజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?

11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
1 కోరింథీయులకు 3:20

12. యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.

ఇక్కడనుంచి ఈ కీర్తన శ్రుతి మారుతుంది. దేవునిలో తనకున్న దృఢమైన నిబ్బరాన్ని, నమ్మకాన్ని రచయిత బయట పెడుతున్నాడు. దుర్మార్గుల మూలంగా కలిగిన కష్టాల వెనుక దేవుని ప్రేమతో కూడిన ఉద్దేశం ఉందని అతని గట్టి నమ్మకం. తనకు బుద్ధి చెప్పేందుకు, సరిదిద్దేందుకు దేవుడు ఆ కష్టాలకు వాడుకుంటాడు (12 వ). అవన్నీ ఉన్నప్పటికీ హృదయానికి నెమ్మది ఇస్తాడు (13 వ). ప్రజలలో న్యాయమైన తీర్పును తిరిగి స్థాపిస్తాడు. ఇక్కడొక అద్భుత సత్యాన్ని చూస్తున్నాం (ద్వితీయోపదేశకాండము 8:5; యోబు 5:17; కీర్తనల గ్రంథము 119:71 కీర్తనల గ్రంథము 119:171; సామెతలు 3:11-12; హెబ్రీయులకు 12:5-6). దేవుని క్రమశిక్షణ బాధకరమే గాని అది మనకు చేసే గొప్ప మేలుకోసం దాన్ని ఆహ్వానించాలి.

13. భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు.

అడవి మృగాలను పట్టుకునేందుకు మనుషులు గుంటలు తవ్వుతారు. దుర్మార్గులు క్రూర మృగాల్లాగానే దేవుని గొర్రెలను చీల్చి వేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వారు పడాలని దుర్మార్గుల కోసం గుంటలు తవ్వడం జరుగుతుంది.

14. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.
రోమీయులకు 11:1-2

కీర్తనల గ్రంథము 37:28; 1 సమూయేలు 12:22; విలాపవాక్యములు 3:31; రోమీయులకు 11:2; హెబ్రీయులకు 13:5.

15. నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు.

కీర్తనల గ్రంథము 97:2; యెషయా 42:3; మీకా 7:9.

16. దుష్టులమీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును?

నిర్గమకాండము 32:26.

17. యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును.

దేవుడు అతనికి సహాయం చెయ్యకపోతే మరణించి ఉండేవాడని అతని భావం.

18. నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

కీర్తనల గ్రంథము 38:16; కీర్తనల గ్రంథము 73:2.

19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.
2 కోరింథీయులకు 1:5

బాధలు, అన్యాయం ఉంటున్న సమయంలో ఆందోళనతో కూడిన తలంపులు సహజంగానే మనకు కలుగుతాయి. అయితే వారి వల్ల మనం ఉక్కిరిబిక్కిరి అయిపోనవసరం లేదు. పరీక్షల్లో, బాధల్లో మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యాకోబు 1:2 చూడండి.

20. కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా?

పరిపాలకులు ప్రజలను అణగద్రొక్కేలా, తాము దుర్మార్గం చేసేలా కొన్ని సార్లు శాసనాలు చేస్తారు. ఇలాంటి పరిపాలనల్లో దేవునికేమి భాగం లేదు.

21. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు.

22. యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము.

“కోట”– కీర్తనల గ్రంథము 18:2; కీర్తనల గ్రంథము 31:3; కీర్తనల గ్రంథము 71:3 “ఆధారశిల”– ద్వితీయోపదేశకాండము 32:4.

23. ఆయన వారిదోషము వారిమీదికి రప్పించును వారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును.

“వాళ్ళ నెత్తిమీదకే”– కీర్తనల గ్రంథము 7:16; కీర్తనల గ్రంథము 140:9 కీర్తనల గ్రంథము 140:11; ద్వితీయోపదేశకాండము 32:35. “నాశనం”– కీర్తనల గ్రంథము 5:6; కీర్తనల గ్రంథము 52:5; కీర్తనల గ్రంథము 145:20.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Psalms - కీర్తనల గ్రంథము 94 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

వేధించేవారి ప్రమాదం మరియు మూర్ఖత్వం. (1-11) 
మనం నమ్మకంగా దేవుని వైపు తిరగవచ్చు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన న్యాయాధిపతి, అతని ముందు ప్రతి వ్యక్తి తీర్పు కోసం నిలబడతాడు. అన్యాయాలను సహించేవారికి ఇది ప్రోత్సాహకరంగా ఉండనివ్వండి, నిశ్శబ్దంగా సహించమని వారిని ప్రోత్సహిస్తుంది, పరిపూర్ణ న్యాయంతో తీర్పు చెప్పే వ్యక్తికి తమను తాము అప్పగించండి. ఈ ప్రార్థనలు ప్రవచనాలవంటివి, హింసకు పాల్పడేవారిలో భయాన్ని కలిగిస్తాయి. దేవునికి, ఆయన సత్యాలకు, ఆయన మార్గాలకు మరియు ఆయన ప్రజలకు వ్యతిరేకంగా భక్తిహీనులైన పాపులు చెప్పే కఠినమైన పదాలన్నిటికి లెక్కింపు అనివార్యంగా ఒక రోజు వస్తుంది. ఇది దాదాపు నమ్మశక్యం కానిది, మనం దానికి సాక్ష్యమివ్వడం వల్ల కాదు, లక్షలాది మంది హేతుబద్ధమైన జీవులు జీవించగలరు, కదలగలరు, మాట్లాడగలరు, వినగలరు, అర్థం చేసుకోగలరు మరియు ప్రవర్తించగలరు, దేవుడు తన ఆశీర్వాదాలను దుర్వినియోగం చేసినందుకు దేవుడు తమను బాధ్యులను చేయడని నమ్ముతారు. . జ్ఞానమంతా దేవుని నుండి వచ్చినందున, మానవుల మనస్సులలోకి వచ్చే ప్రతి ఆలోచనను ఆయన గ్రహిస్తాడనడంలో సందేహం లేదు, వారి హృదయాల ఆలోచనలు మరియు ఉద్దేశాలు నిరంతరం దుర్మార్గం వైపు మొగ్గు చూపుతాయని గుర్తించాడు. ఉదాత్తమైన ఆలోచనలలో కూడా స్థిరత్వం లోపిస్తుంది, దీనిని వ్యర్థం అని పిలుస్తారు. మన ఆలోచనలను శ్రద్ధగా పర్యవేక్షించడం మనకు చాలా అవసరం, ఎందుకంటే దేవుడు వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు; అతనికి, ఆలోచనలు మాట్లాడే పదాల వలె ముఖ్యమైనవి.

హింసించబడిన వారికి ఓదార్పు మరియు శాంతి. (12-23)
ప్రభువు యొక్క క్రమశిక్షణ క్రింద, అతని పవిత్ర వాక్యం నుండి మరియు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం ద్వారా ఆయన చిత్తం మరియు ఆయన సత్యాలలో ఉపదేశాన్ని పొందే వ్యక్తి ధన్యుడు. అతని పరీక్షల మధ్య, అతను దేవుని దయను కనుగొంటాడు. దేవుని ప్రజలకు వారి కష్టాల రోజులకు మించిన శాశ్వత ఉపశమనం ఉంది, ఎందుకంటే బాధను పంపేవాడు ఓదార్పుని కూడా పంపుతాడు. భూసంబంధమైన సహచరులందరూ విఫలమైనప్పుడు, కీర్తనకర్త తన ఓదార్పును మరియు ఉపశమనాన్ని ప్రభువులో మాత్రమే కనుగొన్నాడు. మన ఆధ్యాత్మిక జీవనోపాధి దేవుని శక్తికి మాత్రమే కాకుండా ఆయన కరుణకు కూడా రుణపడి ఉంటుంది, మరియు మనం పాపంలో పడకుండా లేదా మన బాధ్యతలను తప్పించుకోకుండా కాపాడబడితే, మనం ఆయనకు మహిమను ఇవ్వాలి మరియు మన సహోదరులను ఉద్ధరించాలి.
కీర్తనకర్త తన పరిస్థితులు, తాను నడపవలసిన మార్గం మరియు దాని ఫలితం ఎలా ఉండవచ్చనే దాని గురించి అనేక చింతించే ఆలోచనలతో పోరాడాడు. అలాంటి పథకాలు మరియు భయాలను అలరించడం మన ఆందోళన మరియు అపనమ్మకాన్ని మాత్రమే పెంచుతుంది, చీకటి మరియు గందరగోళంతో మన దృక్పథాన్ని అస్పష్టం చేస్తుంది. భక్తిపరులైన వ్యక్తులు కూడా కొన్నిసార్లు దేవుని గురించి కలవరపరిచే మరియు బాధాకరమైన ఆలోచనలతో పోరాడుతారు. అయినప్పటికీ, వారు తమ దృష్టిని సువార్త యొక్క అమూల్యమైన వాగ్దానాల వైపు మళ్లించాలి. మెలాంచోలిక్ ఆలోచనలచే సేవించబడినప్పుడు ప్రపంచంలోని సుఖాలు ఆత్మకు కొద్దిగా ఓదార్పునిస్తాయి. దీనికి విరుద్ధంగా, దేవుని ఓదార్పులు ప్రపంచంలోని చిరునవ్వులు అందించలేని శాంతి మరియు ఆనందాన్ని తెస్తాయి మరియు ప్రపంచంలోని కోపాలను తీసివేయలేవు. దేవుడు తన ప్రజలకు ఆశ్రయం, వారు పారిపోయే అభయారణ్యం, అందులో వారికి భద్రత మరియు భద్రత లభిస్తాయి. మరియు అతను చెడ్డవారిని జవాబుదారీగా ఉంచుతాడు. ఒక వ్యక్తి వారి స్వంత దుష్టత్వపు పర్యవసానాల కంటే ఎక్కువ దౌర్భాగ్యం పొందలేడు, ప్రభువు దానిని వారిపై సందర్శించడానికి ఎంచుకుంటే.



Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |