Exodus - నిర్గమకాండము 10 | View All

1. కాగా యెహోవా మోషేతో ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేను చేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను

1. kaagaa yehōvaa mōshēthoo pharōyoddhaku veḷlumu. Nēnē yehōvaanani meeru telisikonunaṭlunu, nēnu cheyu soochakakriyalanu aiguptheeyula yeduṭa kanuparachuṭaku, nēnu vaariyeḍala jarigin̄china vaaṭini vaari yeduṭa kalugajēsina soochakakriyalanu

2. నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిననెను.

2. neevu nee kumaaruniki nee kumaaruni kumaaruniki prachuramu cheyunaṭlunu, nēnu athani hrudayamunu athani sēvakula hrudayamulanu kaṭhina parachithinanenu.

3. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి-హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా- నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.

3. kaabaṭṭi mōshē aharōnulu pharō yoddhaku veḷli, athanini chuchi yeelaagu cheppiri-hebreeyula dhevuḍagu yehōvaa selavichinadhemanagaa- neevu ennaaḷlavaraku naaku loṅganollaka yunduvu? Nannu sēvin̄chuṭaku naa janulanu pōnimmu.

4. నీవు నా జనులను పోనియ్య నొల్లనియెడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను.

4. neevu naa janulanu pōniyya nollaniyeḍala idigō rēpu nēnu miḍathalanu nee praanthamulalōniki rappin̄chedanu.

5. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్లదెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును.

5. evaḍunu nēlanu chooḍalēnanthagaa avi daani kappunu, thappin̄chukonina shēshamunu, anagaa vaḍagaṇḍladebbanu thappin̄chukoni migilina daanini avi thinivēyunu, polamulō molichina prathi cheṭṭunu thinunu.

6. మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుట నుండి బయలు వెళ్లెను.

6. mariyu avi nee yiṇḍlalōnu nee sēvakulandari yiṇḍlalōnu aiguptheeyulandari yiṇḍlalōnu niṇḍipōvunu. nee pitharulugaani nee pithaamahulugaani yee dheshamulō nuṇḍina naaṭanuṇḍi nēṭivaraku aṭṭi vaaṭini chooḍalēdani cheppi pharō yeduṭa nuṇḍi bayalu veḷlenu.

7. అప్పుడు ఫరో సేవకులు అతని చూచి-ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకా తెలియదా అనిరి.

7. appuḍu pharō sēvakulu athani chuchi-ennaaḷlavaraku veeḍu manaku urigaa nuṇḍunu? thama dhevuḍaina yehōvaanu sēvin̄chuṭaku ee manushyulanu pōnimmu; aigupthudheshamu nashin̄chinadani neekiṅkaa teliyadaa aniri.

8. మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడుమీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారి నడిగెను.

8. mōshē aharōnulu pharōyoddhaku marala rappimpabaḍagaa athaḍumeeru veḷli mee dhevuḍaina yehōvaanu sēvin̄chuḍi; anduku evarevaru veḷludurani vaari naḍigenu.

9. అందుకు మోషే-మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెద మనెను.

9. anduku mōshē-mēmu yehōvaaku paṇḍuga aacharimpavalenu ganuka maa kumaarulanu maa kumaarthelanu maa mandalanu maa pashuvulanu veṇṭabeṭṭukoni maa pinna peddalathookooḍa veḷleda manenu.

10. అందు కతడు-యెహోవా మీకు తోడై యుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు.

10. andu kathaḍu-yehōvaa meeku thooḍai yuṇḍunaa? Nēnu mimmunu mee pillalanu pōnicchedhanaa? Idigō meeru duraalōchana galavaaru.

11. పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.

11. purushulaina meeru maatramu veḷli yehōvaanu sēvin̄chuḍi; meeru kōrinadhi adhe gadaa ani vaarithoo anagaa pharō samukhamunuṇḍi vaaru veḷlagoṭṭabaḍiri.

12. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చునట్లు ఐగుప్తుదేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తుదేశము మీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటని తినివేయునని చెప్పెను.
ప్రకటన గ్రంథం 9:3

12. appuḍu yehōvaa mōshēthoo miḍathalu vachunaṭlu aigupthudheshamumeeda nee cheyyi chaapumu; avi aigupthudheshamu meedaki vachi yee dheshapu pairulanniṭini, anagaa vaḍagaṇḍlu paaḍucheyani vaaṭinanniṭani thinivēyunani cheppenu.

13. మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.

13. mōshē aigupthudheshamumeeda thana karranu chaapagaa yehōvaa aa pagalanthayu aa raatri anthayu aa dheshamumeeda thoorpugaalini visara jēsenu; udayamandu aa thoorpu gaaliki miḍathalu vacchenu.

14. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకర మైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను.

14. aa miḍathalu aigupthu dheshamanthaṭi meediki vachi aigupthu samastha praanthamulalō nilichenu. Avi mikkili baadhakara mainavi, anthaku munupu aṭṭi miḍathalu eppuḍunu uṇḍalēdu. tharuvaatha aṭṭivi uṇḍabōvu. Avi nēlanthayu kappenu.

15. ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు.
ప్రకటన గ్రంథం 9:3

15. aa dheshamuna chikaṭikammenu, aa dheshapu kooragaayalanniṭini aa vaḍagaṇḍlu paaḍucheyani vrukshaphalamulanniṭini avi thinivēsenu. Aigupthu dheshamanthaṭa cheṭlēgaani polamula koorayē gaani pacchani dhediyu migiliyuṇḍalēdu.

16. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని.

16. kaabaṭṭi pharō mōshē aharōnulanu tvaragaa pilipin̄chi nēnu mee dhevuḍaina yehōvaayeḍalanu mee yeḍalanu paapamuchesithini.

17. మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా

17. meeru dayachesi, yeesaari maatramē naa paapamu kshamin̄chi, naa meedanuṇḍi yee chaavu maatramu tolagin̄chumani mee dhevuḍaina yehōvaanu vēḍukonuḍanagaa

18. అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.

18. athaḍu pharō yoddhanuṇḍi bayaluveḷli yehōvaanu vēḍukonenu.

19. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలవలేదు.

19. appuḍu yehōvaa gaalini trippi mahaabalamaina paḍamaṭigaalini visarajēyagaa adhi aa miḍathalanu kon̄chupōyi errasamudramulō paḍavēsenu. Aigupthu samastha praanthamulalō okka miḍathayainanu nilavalēdu.

20. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.

20. ayinanu yehōvaa pharō hrudayamunu kaṭhinaparachenu; athaḍu ishraayēleeyulanu pōniyyaḍaayenu.

21. అందుకు యెహోవా మోషేతో-ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను.

21. anduku yehōvaa mōshēthoo-aakaashamuvaipu nee cheyyi chaapumu. Aigupthudheshamumeeda chikaṭi chethiki teliyunantha chikkani chikaṭi kammunanenu.

22. మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడు దినములు గాఢాంధకార మాయెను.
ప్రకటన గ్రంథం 16:10

22. mōshē aakaashamuvaipu thana cheyyi yetthinappuḍu aigupthudhesha manthayu mooḍu dinamulu gaaḍhaandhakaara maayenu.

23. మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.

23. mooḍu dinamulu okani nokaḍu kanugonalēdu, evaḍunu thaanunna chooṭanuṇḍi lēvalēka pōyenu; ayinanu ishraayēleeyulakandariki vaari nivaasamulalō veluguṇḍenu.

24. ఫరో మోషేను పిలిపించి-మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చుననగా

24. pharō mōshēnu pilipin̄chi-meeru veḷli yehōvaanu sēvin̄chuḍi. mee mandalu mee pashuvulu maatramē ikkaḍa uṇḍavalenu, mee biḍḍalu meethoo veḷlavachunanagaa

25. మోషే-మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణలనిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను.

25. mōshē-mēmu maa dhevuḍaina yehōvaaku arpimpavalasina balula nimitthamunu hōmaarpaṇalanimitthamunu neevu maaku pashuvulaniyyavalenu.

26. మా పశువులును మాతోకూడ రావలెను. ఒక డెక్కయైనను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోనుండి తీసికొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను.

26. maa pashuvulunu maathookooḍa raavalenu. Oka ḍekkayainanu viḍuvabaḍadu, maa dhevuḍaina yehōvaanu sēvin̄chuṭaku vaaṭilōnuṇḍi theesikonavalenu. Mēmu dhenithoo yehōvaanu sēvimpavalenō akkaḍa cherakamunupu maaku teliyadanenu.

27. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.

27. ayithē yehōvaa pharō hrudayamunu kaṭhinaparapagaa athaḍu vaarini pōniyya nollaka yuṇḍenu.

28. గనుక ఫరోనా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.
హెబ్రీయులకు 11:27

28. ganuka pharōnaa yeduṭanuṇḍi pommu bhadramu sumee; naa mukhamu ikanu chooḍavaddu, neevu naa mukhamunu choochu dinamuna maraṇamavuduvani athanithoo cheppenu.

29. అందుకు మోషే-నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.
హెబ్రీయులకు 11:27

29. anduku mōshē-neevannadhi sari, nēnikanu nee mukhamu chooḍananenu.Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |