Exodus - నిర్గమకాండము 21 | View All

1. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా

ఒక జాతిగా లేక ఒక సమాజంగా ఇస్రాయేల్‌వారు అనుసరించవలసిన విధులు ఈ అధ్యాయంలో కనిపిస్తున్నాయి.

2. నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.
యోహాను 8:35

లేవీయకాండము 25:39-43 ద్వితీయోపదేశకాండము 15:12-18 యిర్మియా 34:14. పురాతన ప్రపంచంలో బానిసత్వం మామూలుగా అంగీకారమైన విషయం. ధర్మశాస్త్రం చొప్పున దేవుడు తన ప్రజల విషయంలో దీన్ని ఉండనిచ్చాడు. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను సూచించడం కోసం ఇలా చేసి ఉండవచ్చు. ఒకటి ఏమంటే, మనిషి సహజంగా పాపానికి బానిస. మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం అతన్ని విడుదల చెయ్యడం అసాధ్యం. మరొకటి, దేవుని ప్రజలు ఆయన సొత్తు. వారు ఆయనకు దాసులు, ఆయన వారికి యజమాని. బానిసత్వం అనేది కొనసాగడానికి దేవుడు అంగీకరించిన కారణం మరొకటి ఉండవచ్చు – మనుషులు పాపం చేసినందువల్ల దేవుని ఎదుట వారికి ఎలాంటి హక్కులూ లేవు అని తెలియజేయడం. ఎవరన్నా స్వేచ్ఛా స్వతంత్రతలూ సంతోషానందాలు అనుభవిస్తూ ఉంటే అది కేవలం వారిపట్ల దేవుడు చూపే అనుగ్రహమే. ఏది ఏమైనా ఇస్రాయేల్ వారు తమ బానిసలను న్యాయంతో దయతో చూడాలని దేవుడు ఆదేశించాడు. బానిసలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలన్నది కట్టుబాటు. వారు విశ్రాంతి దినాన పని చేయకూడదు. అర్పణల మాంసాన్ని వారు తినాలి (ద్వితీయోపదేశకాండము 5:14 ద్వితీయోపదేశకాండము 12:12 ద్వితీయోపదేశకాండము 16:11), యాజులు తినే పవిత్ర భక్ష్యాలను కూడా తినవచ్చు (లేవీయకాండము 22:11). వారు కోరితే సున్నతి కూడా పొందవచ్చు. అటు తరువాత వారు ఒడంబడికలో భాగస్వాములయ్యారు (నిర్గమకాండము 12:44). బానిసకు స్వతంత్రత ఇచ్చి పంపేసేటప్పుడు వట్టి చేతులతో పంపకూడదు (ద్వితీయోపదేశకాండము 15:14). పురాతన ప్రపంచంలో ఏ జాతి ప్రజలలోనూ బానిసల విషయంలో ఇంత మంచి ఏర్పాట్లు కనిపించవు. మరో విషయం – చివరికి బానిసత్వ నిర్మూలన జరగడానికి అంకురం ధర్మశాస్త్రంలో లేవీయకాండము 19:18 లో రాసి ఉంది. మత్తయి 7:12 కూడా చూడండి. ఎఫెసీయులకు 6:5 నోట్స్ చూడండి.

3. వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.

4. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను.

5. అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల

ద్వితీయోపదేశకాండము 15:16-17.

6. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసికొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.

కొందరు యజమానులు తమ బానిసలను ఎంత బాగా చూచుకునేవారంటే, ఆ బానిసలు జీవితాంతం అక్కడే నిలిచి సేవ చేయడానికి ఇష్టపడ్డారు. దేవునిపట్ల నిజ విశ్వాసికి పరిస్థితి ఇదే. ఇలాంటి స్థితిలోనే అతడు సంతోషిస్తాడు. అన్ని విషయాల్లో లాగానే ఈ విషయంలో కూడా క్రీస్తే విశ్వాసులకు ఉత్తమ ఆదర్శం (హెబ్రీయులకు 10:7 కీర్తనల గ్రంథము 40:6-8 యోహాను 8:29 రోమీయులకు 15:8). క్రొత్త ఒడంబడికలో విశ్వాసులకు దాసులు, సేవకులు అని పేరు (రోమీయులకు 6:17-22).

7. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసులైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపోకూడదు.

నెహెమ్యా 5:5.

8. దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలుకానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.

9. తన కుమారునికి దాని ప్రధానము చేసినయెడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దానియెడల జరిగింపవలెను.

10. ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసారధర్మమును తక్కువ చేయకూడదు.

11. ఈ మూడును దానికి కలుగజేయని యెడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును.

12. నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.
మత్తయి 5:21

ఆదికాండము 9:6 లేవీయకాండము 24:17 సంఖ్యాకాండము 35:30 మత్తయి 26:52.

13. అయితే వాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.

సంఖ్యాకాండము 35:10 ద్వితీయోపదేశకాండము 19:1-13 యెహోషువ 20:1-9.

14. అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.

ద్వితీయోపదేశకాండము 19:11-12 1 రాజులు 2:28-34.

15. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును.

నిర్గమకాండము 20:12.

16. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తనయొద్దనుంచుకొనినను, వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.

ద్వితీయోపదేశకాండము 24:7.

17. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
మత్తయి 15:4, మార్కు 7:10

నిర్గమకాండము 20:12 Leci 20:9 సామెతలు 20:20 మత్తయి 15:4.

18. మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుటవలన వాడు చావక మంచముమీద పడియుండి

19. తరువాత లేచి తన చేతికఱ్ఱతో బయటికి వెళ్లి తిరుగుచుండిన యెడల, వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెను.

20. ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును.

21. అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మేగదా.

లేవీయకాండము 25:44-46. దేవుని ప్రజలు దేవుని సొత్తు – ద్వితీయోపదేశకాండము 4:20 ద్వితీయోపదేశకాండము 7:6 ద్వితీయోపదేశకాండము 14:2 కీర్తనల గ్రంథము 135:4 రోమీయులకు 14:8 1 కోరింథీయులకు 6:19-20 తీతుకు 2:14.

22. నరులు పోట్లాడుచుండగా గర్భవతియైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను.

ద్వితీయోపదేశకాండము 2218-19:1.

23. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము,

ధర్మశాస్త్రం సారాంశం ఇదే – చేసినదానికి ఖచ్చితంగా సరిపోయిన ప్రతిక్రియ (లేవీయకాండము 24:19-20 ద్వితీయోపదేశకాండము 19:21). సాంఘికంగా ఇస్రాయేల్‌వారి సంబంధ బాంధవ్యాలను శాసించే ఆదేశ సూత్రం ఇదే. చేసిన తప్పుకు ప్రతిక్రియను నాయకులు నిర్ణయించాలి. అయితే మత్తయి 5:38-41 లో యేసు విశ్వాసుల వ్యక్తిగతమైన సంబంధాలను శాసించే మరింత ఉదాత్తమైన చట్టాన్ని ఇచ్చాడు. రోమీయులకు 12:19-21 కూడా చూడండి. న్యాయస్థానాల ద్వారా న్యాయం చేకూరకపోతే విశ్వాసులైనవారు తామే పగ సాధించబూనుకోరాదు. ఆ విషయాన్ని దేవునికి అప్పచెప్పి ఊరుకోవాలి. సంఖ్యాకాండము 31:2 నోట్ చూడండి.

24. కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,
మత్తయి 5:38

25. వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.

26. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల ఆ కంటి హానినిబట్టి వారిని స్వతంత్రునిగా పోనియ్యవలెను.

27. వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్య వలెను.

28. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజమానుడు నిర్దోషియగును.

29. ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను, వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొంద వలెను.

30. వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.

31. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను.

32. ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్ట వలెను.
మత్తయి 26:15

బానిస ఖరీదు 30 తులాల వెండి. జెకర్యా 11:12 మత్తయి 26:15 మత్తయి 27:3 మత్తయి 27:9 చూడండి.

33. ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుటవలన, దానిలో ఎద్దయినను గాడిదయైనను పడిన యెడల

34. ఆ గోతి ఖామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను; వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను; చచ్చినది వానిదగును.

35. ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన యెద్దును పంచుకొనవలెను.

36. అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను; చచ్చినది వానిదగును.

హత్య చేసినా, తల్లిదండ్రులను కొట్టినా, దూషించినా, ఒక వ్యక్తిని మాయోపాయంతో దొంగిలించినా నిర్లక్ష్యం మూలంగా మరో వ్యక్తి మరణానికి కారణం అయినా ధర్మశాస్త్రం మరణశిక్ష విధించిందని ఈ అధ్యాయంలో తెలుస్తున్నది. ధర్మశాస్త్రంలో మరణశిక్షకు పాత్రమైన ఇతర నేరాలేవంటే, విశ్రాంతి దినం ఆచారాన్ని మీరడం (నిర్గమకాండము 31:14 నిర్గమకాండము 35:2), అబద్ధ దేవుడికి గానీ దేవికి గానీ పిల్లలను బలివ్వడం (లేవీయకాండము 20:2), వ్యభిచారం తదితర లైంగిక దోషాలు (లేవీయకాండము 20:10-16), పూనకం వచ్చేవారినీ సోదె చెప్పేవారినీ సంప్రదించడం (లేవీయకాండము 20:6), దేవదూషణ (లేవీయకాండము 24:15), విగ్రహ పూజా అబద్ధ ఆరాధనా చేయడం గానీ దాన్ని ప్రోత్సహించడం గానీ (ద్వితీయోపదేశకాండము 13:1-8), కపట ప్రవక్తగా పలకడం (ద్వితీయోపదేశకాండము 18:20), అవిధేయత తిరుగుబాటు (ద్వితీయోపదేశకాండము 21:18-21), మంత్ర విద్య అభ్యసించడం (నిర్గమకాండము 22:18), పరాయి దేవుళ్లను పూజించడం (నిర్గమకాండము 22:20). ఇప్పుడూ దేవుని దృష్టిలో ఇవి ఘోర నేరాలే.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 21 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
సేవకులను గౌరవించే చట్టాలు. (1-11) 
ఈ అధ్యాయం ఇతరులతో దయగా ఉండేందుకు మరియు వారిని బాధపెట్టకుండా ఉండటానికి సంబంధించిన నియమాల గురించి మాట్లాడుతుంది. ఈ నియమాలు చాలా కాలం క్రితం వ్రాయబడ్డాయి మరియు మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నామో దానికి వర్తించకపోవచ్చు, కానీ ఏది సరైనది మరియు న్యాయమైనదో అర్థం చేసుకోవడానికి అవి మాకు సహాయపడతాయి. గతంలో సేవకులుగా ఉన్న వ్యక్తులు చెడు పనులు చేయడం ద్వారా మనం ఎలా చిక్కుకుపోతామో మరియు దాని నుండి విముక్తి పొందేందుకు యేసు మనకు ఎలా సహాయం చేస్తాడు అనే దాని గురించి ఇది మాట్లాడుతుంది. ఈ స్వాతంత్ర్యం మనం చెల్లించాల్సిన అవసరం లేని బహుమతి. 

న్యాయపరమైన చట్టాలు. (12-21) 
దేవుడు జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు మరియు దానిని సురక్షితంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా మరొకరిని చంపితే శిక్షార్హులనే నిబంధన పెట్టాడు. అయినప్పటికీ, ఎవరైనా చట్టబద్ధమైన పనిని చేస్తున్నప్పుడు మరియు ఎవరినీ బాధపెట్టకుండా ఎవరైనా ప్రమాదవశాత్తూ ఒకరి మరణానికి కారణమైతే, వారిని రక్షించడానికి దేవుడు "ఆశ్రయ నగరాలు" అనే ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు కృతజ్ఞతతో ఉండడం మరియు విధేయత చూపడం గురించి దేవుని బోధల నుండి నేర్చుకోవాలి. వారు ఎప్పుడైనా నీచమైన మాటలు మాట్లాడినా లేదా వారి తల్లిదండ్రులను బాధపెట్టినా, క్షమించండి మరియు యేసు నుండి క్షమాపణ అడగాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు వారి స్వంత భావోద్వేగాలను నియంత్రించడం ద్వారా మరియు వారి పిల్లల కోసం ప్రార్థన చేయడం ద్వారా మంచి ఉదాహరణగా ఉండాలి. అలాగే తమ పిల్లలకు కోపం రాకుండా జాగ్రత్త పడాలి. గతంలో, ప్రజలు కొన్నిసార్లు తమను లేదా తమ పిల్లలను తాము పేదలుగా ఉన్నందున విక్రయించేవారు లేదా వారి నేరాలకు శిక్షగా విక్రయించబడ్డారు. ఎవరైనా డబ్బు బాకీ ఉండి తిరిగి చెల్లించలేకపోతే, వాటిని కూడా అమ్మవచ్చు. అయితే, ఒకరిని కిడ్నాప్ చేసి వారిని బలవంతంగా బానిసలుగా మార్చడం చాలా తప్పు, మరియు ఇది బైబిల్లో చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఎవరైనా మరొక వ్యక్తిని బాధపెడితే, వారు ఆ వ్యక్తి మరణానికి కారణం కానప్పటికీ, వారు విషయాలను సరిదిద్దాలి. ఇతరులకు బాధ్యత వహించే వ్యక్తులు ఓపికగా ఉండాలని మరియు బెదిరింపులను ఉపయోగించకూడదని బైబిల్ బోధిస్తుంది. యోబు 31:13-14 

న్యాయపరమైన చట్టాలు. (22-36)
ఈ కథలు మనకు న్యాయంగా ఎలా ఉండాలో మరియు మంచి ఎంపికలను ఎలా ఎంచుకోవాలో నేర్పుతాయి. మనం ఏ తప్పూ చేయకుండ చూసుకోవాలి, అలా చేస్తే మన వల్ల మరెవరికీ నష్టం కలగకుండా చూసుకోవాలి. ఈ నియమాలు నేటికీ ముఖ్యమైనవి.



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |