Exodus - నిర్గమకాండము 25 | View All

2. నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను.

3. మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,

4. నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,

5. ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,

6. ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమున కును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,

7. లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.

8. నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.

“నేను వారిమధ్య నివసించేలా”– ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తున్నది – మనుషులతో నివాసం చేయాలన్న దేవుని పరమ అభిలాష. దేవుడు మనుషుల దగ్గరికి రావడం, వారితో కలిసిమెలిసి ఉండడం, మనుషులు దేవుణ్ణి చేరుకుని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఓ మార్గాన్ని తయారు చేయడం – ఈ విషయాలను బైబిలు వెల్లడి చేస్తున్నది. బైబిలులోని సారాంశం ఇదే అనవచ్చు – ఆదికాండము 2:8 ఆదికాండము 2:19 ఆదికాండము 3:8 ఆదికాండము 16:7 ఆదికాండము 18:1 ఆదికాండము 32:24 నిర్గమకాండము 3:8 నిర్గమకాండము 13:21 నిర్గమకాండము 19:20 నిర్గమకాండము 29:45-46 నిర్గమకాండము 33:14 నిర్గమకాండము 40:34-35 లేవీయకాండము 9:3-6 లేవీయకాండము 26:11-12 సంఖ్యాకాండము 5:3 ద్వితీయోపదేశకాండము 12:11 1 రాజులు 6:13 కీర్తనల గ్రంథము 132:13-14 యెషయా 7:14 యెషయా 57:15 యెహోషువ 37:27 యెహోషువ 48:35 జెకర్యా 2:10 మత్తయి 1:21-23 యోహాను 1:1 యోహాను 1:14 యోహాను 14:16-18 యోహాను 14:23 అపో. కార్యములు 2:1-4 2 కోరింథీయులకు 6:16 ఎఫెసీయులకు 2:21-22 ప్రకటన గ్రంథం 21:3. పవిత్రుడైన దేవుడు మనిషితో సహజీవనం చేసేందుకు ఉన్న ఒకే ఆటంకం పాపం (యెషయా 59:1-2. ఆదికాండము 3:24 నోట్‌). ఇక్కడ దేవుడు తన పవిత్ర ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు, మనుషులు దాన్ని మీరుతారని ఆయనకు తెలుసు. తన ప్రేమ చొప్పున వారి పాపాన్ని కప్పివేయడానికి ప్రాయశ్చిత్తం చేయడానికి మార్గాన్ని ఏర్పరచాడు. తద్వారా తాను వారి మధ్య నివసించడానికి వీలు కలగాలని దేవుని ఉద్దేశం. అది పవిత్రత, బలి అర్పణల మార్గం.

9. నేను నీకు కను పరచువిధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.

“ఆ నివాసం”– సన్నిధి గుడారాన్ని వర్ణించేందుకు రెండు హీబ్రూ పదాలు వాడడం జరిగింది. ఒకటి “గుడారం” అని అర్థం ఇచ్చే సామాన్య పదం, రెండోది “నివాసం” అనే అర్థాన్నిచ్చేది. దీన్ని సన్నిధి గుడారం అని కొన్ని సార్లు అన్నారు. ఎందుకంటే, మనుషులు సమీపించేందుకు వీలుగా అక్కడ దేవుని సన్నిధి నెలకొని ఉంది (నిర్గమకాండము 25:22; నిర్గమకాండము 29:42; నిర్గమకాండము 30:36). మరి కొన్ని సార్లు శాసనాల గుడారం అన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం రాసి ఉన్న రాతి పలకలు ఆ గుడారంలో ఉన్నాయి. ఇది మామూలు గుడారం కాదని సూచించేందుకు ఈ అనువాదంలో మేము “ఆరాధన గుడారం” అనే మాటనూ, ఇది మామూలు నివాసం కాదని సూచించేందుకు “దైవ నివాసం” అనే మాటనూ అక్కడక్కడ ఉపయోగించాం. “నమూనా”– ఆరాధన గుడారం ఖచ్చితమైన నమూనాను దేవుడు మోషేకు చూపించాడు. ఎందుకంటే అది ప్రజలకు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేర్పించే చిహ్నంగా ఉంటుంది (నిర్గమకాండము 25:40 నిర్గమకాండము 26:30 అపో. కార్యములు 7:44 హెబ్రీయులకు 8:2 హెబ్రీయులకు 8:5 హెబ్రీయులకు 9:1-24 ప్రకటన గ్రంథం 11:19). ఆరాధన గుడారం యేసు క్రీస్తుకూ, మానవుల పక్షంగా ఆయన చేసిన విమోచన కార్యానికీ సాదృశ్యం. ఆరాధన గుడారం తన ప్రజలతో కలిసి దేవుడు నివసించేందుకు మార్గం. క్రీస్తు విషయం కూడా అంతే. గ్రీకు భాషలో యోహాను 1:14 లో ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే “దేవుడు మన మధ్య గుడారం వేసుకొన్నాడు” అని అర్థం వస్తుంది. సన్నిధి గుడారంలో దేవుని మహిమాప్రకాశం నిండింది (నిర్గమకాండము 40:34-35). క్రీస్తు సాక్షాత్తూ దేవుని మహిమాప్రకాశమే (హెబ్రీయులకు 1:3 యోహాను 1:14 మత్తయి 17:2). ప్రముఖ యాజి అతి పవిత్ర స్థలంలోకి తీసుకువెళ్ళే బలి రక్తమే మనిషి దేవుని సన్నిధిలోకి వెళ్ళేందుకు మార్గం అని ఈ సన్నిధిగుడారం తెలియజేస్తున్నది (లేవీయకాండము 16:15-17). మనకోసం క్రీస్తు చేసిన కార్యానికి ఇది సూచన (హెబ్రీయులకు 9:11-12 హెబ్రీయులకు 9:24). సన్నిధి గుడారానికి సంబంధించిన ప్రతి చిన్న విషయానికి సరిపోయిన వివరణ క్రొత్త ఒడంబడికలో కనిపించదు. కానీ ముఖ్యాంశాల అంతరార్థం మాత్రం స్పష్టంగా తెలిసిపోతున్నది. దేవుడు ఇచ్చిన ఈ నమూనాను భయభక్తులతో పరిశీలిద్దాం. దీనికి సంబంధించిన ప్రతి స్వల్పమైన మూల విషయం గురించీ ఏవో ఊహలూ సిద్ధాంతాలూ తవ్వితీయడం తగదు. ఇందుమూలంగా దేవుడు నేర్పించదలచుకున్న ప్రధాన సత్యాలను మాత్రం కూలంకషంగా పరిశీలించాలి. దీనిలోని నిగూఢమైన అంశాలను వెలికి తీసి వివరించడంలో మన తెలివితేటలను ప్రదర్శించడమే మన ఉపదేశం కాకూడదు. క్రీస్తును మరింతగా తెలుసుకోవడం, ఆయన్ను ఎక్కువగా ప్రేమించడమే మన గురి అయి ఉండాలి.

10. వారు తుమ్మకఱ్ఱతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు రెండుమూరలునర, దాని వెడల్పు మూరెడు నర, దానియెత్తు మూరెడునర
హెబ్రీయులకు 9:4

“పెట్టె”– నిర్గమకాండము 37:1-9 సంఖ్యాకాండము 3:31 సంఖ్యాకాండము 10:33 ద్వితీయోపదేశకాండము 10:3 యెహోషువ 3:3-17 యెహోషువ 3:6:4 న్యాయాధిపతులు 20:27 1 సమూయేలు 3:3 1 సమూయేలు 4:1-11 1 సమూయేలు 5:1-11 1 సమూయేలు 6:1-21 1 సమూయేలు 7:1-2 2 సమూయేలు 6:2-17 2 సమూయేలు 7:2 2 సమూయేలు 15:24-29 1 రాజులు 8:1-21 హెబ్రీయులకు 9:4 ప్రకటన గ్రంథం 11:19. ఈ పెట్టెకు సేనలప్రభువు యెహోవా అనే పేరు ఉంది (2 సమూయేలు 6:2). దీన్నే ఒడంబడిక పెట్టె లేక మందసం అని కూడా అన్నారు (సంఖ్యాకాండము 10:33). అందువల్ల ఈ పెట్టె దేవునికీ, ఆయన తన ప్రజలైన ఇస్రాయేల్ వారితో చేసుకున్న ఒడంబడికకూ సూచనగా ఉన్నదని భావించడంలో పొరపాటు లేదు. ఈ పెట్టెలో పది ఆజ్ఞలు చెక్కిన రాతి పలకలు ఉన్నాయి. పాత ఒడంబడికకు ఆధారమైన ధర్మశాస్త్రంలో ఈ పది ఆజ్ఞలు ఒక భాగం (ద్వితీయోపదేశకాండము 10:2-5). కాబట్టి ఈ పెట్టె క్రీస్తుకు సూచనగా ఉందని చెప్పడంలో తప్పు లేదని ఈ నోట్స్ రచయిత భావన. ఎందుకంటే తన ప్రజలమధ్య యెహోవాదేవుని సన్నిధి యేసు క్రీస్తే. తన హృదయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని ఉంచుకున్నది కూడా యేసు క్రీస్తే (కీర్తనల గ్రంథము 40:7-8 తో; హెబ్రీయులకు 9:4 కలిపి చదవండి). ఈ పెట్టెలో మరి రెండు వస్తువులున్నాయి. మన్నా గిన్నె, పుష్పించిన అహరోను కర్ర (హీబ్రూ 9:4). తన ప్రజలకు ఆహారమైన క్రీస్తునే ఈ మన్నా సూచిస్తున్నది. అహరోను కర్ర సూచిస్తున్నది ప్రముఖయాజి అయిన క్రీస్తునే (సంఖ్యాకాండము 17:1-11). తుమ్మకర్ర, బంగారం – వీటి అంతరార్థాలు ఏమై ఉండవచ్చు అన్న విషయం గురించి నిర్గమకాండము 26:15-30 నోట్ చూడండి.

11. దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్ట వలెను.

12. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.

13. తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి

14. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.

15. ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు;

16. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను.

17. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయ వలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర.

“మూత”– కొన్ని చోట్ల ప్రాయశ్చిత్త స్థానం అని కూడా దీన్ని అనువదించాం. ఇక్కడ కనిపించే మూత అనే మాట “పైన కప్పేది” అనే అర్థాన్ని ఇచ్చే హీబ్రూ పదానికి అనువాదం. పాపాలకు ప్రాయశ్చిత్తం అనే విషయాన్ని తెలియజేసే సందర్భంలో పాత ఒడంబడిక గ్రంథమంతటిలోనూ ఈ పదం యొక్క రూపాంతరం వాడబడింది. నిర్గమకాండము 29:33 లో ప్రాయశ్చిత్తం గురించి నోట్ చూడండి. ప్రాయశ్చిత్తం ఒడంబడిక పెట్టె మూతమీద చేసేవారు. ఇస్రాయేల్ ప్రజల పాపం అంతా కప్పివేయబడి క్షమాపణ పొందేది ఈ స్థలంలోనే (లేవీయకాండము 16:15-17 లేవీయకాండము 16:30).

18. మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.
హెబ్రీయులకు 9:5

కెరూబులంటే దేవుని విగ్రహాలు కాదు. సన్నిధి గుడారం నమూనాను ఇచ్చే సమయంలో దేవుని విగ్రహాలు వేటినీ తయారు చేయకూడదని దేవుడు గట్టిగా నిషేధించాడు (నిర్గమకాండము 20:4). ఆ ఆజ్ఞకు వ్యతిరేకమైన ఆజ్ఞ దేనినీ దేవుడిక్కడ ఇవ్వలేదు. కెరూబులను అక్కడ ఉంచినది ఇస్రాయేల్‌వారు వాటిని ఆరాధించాలని కాదు. అలా ఎప్పుడూ జరగలేదు కూడా. బైబిల్లో మరికొన్ని చోట్ల కెరూబుల ప్రస్తావన వచ్చింది (ఆదికాండము 3:24 చూడండి). పవిత్ర స్థలాన్నీ అతి పవిత్ర స్థలాన్నీ వేరుచేసే తెరమీద కెరూబుల ఆకారాన్ని నగిషీ పని చేశారు. (నిర్గమకాండము 26:31-33). దృష్టాంత రూపకంగా చూస్తే ఈ కెరూబులు దేవుని పవిత్రత, మహిమకు గుర్తులు. క్రీస్తుకు సాదృశ్యమైన ప్రముఖ యాజిని తప్ప పాపులైన మనుషులందరినీ దేవుని సన్నిధిలోకి రానియ్యకుండా అడ్డుగోడ ఉన్నట్టుగా సూచించేవి ఈ కెరూబులు.

19. ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను

20. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను.

21. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.

22. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.

నిర్గమకాండము 30:6 నిర్గమకాండము 30:36 లేవీయకాండము 16:2 సంఖ్యాకాండము 17:4. ప్రాయశ్చిత్త బలి రక్తం అర్పించిన చోటనే దేవుడు తన ప్రజలకు ప్రతినిధిగా వచ్చిన వ్యక్తిని కలుసుకున్నాడు (లేవీయకాండము 16:15-16). అంటే మనిషీ దేవుడూ కలిసే చోటు యేసుప్రభువే అని ఇందులో భావం. పాపులకోసం ఆయన కార్చిన రక్తమే వారు దేవుణ్ణి కలిసే మార్గం (హెబ్రీయులకు 10:19-23).

23. మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.
హెబ్రీయులకు 9:2

లేవీయకాండము 24:5-7. ఈ బల్ల జీవాహారంతో ఉన్న క్రీస్తుకు సూచన (యోహాను 6:35) నిర్గమకాండము 16:16 నోట్.

24. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయింప వలెను.

25. దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను.

26. దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను

27. బల్ల మోయుటకు మోతకఱ్ఱలు ఉంగరములును బద్దెకు సమీపముగా నుండవలెను.

28. ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్లమోయబడును.

29. మరియు నీవు దాని పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్ర లను దానికి చేయవలెను; మేలిమి బంగారుతో వాటిని చేయవలెను.

30. నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను.

31. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయ వలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమైయుండవలెను.

నిర్గమకాండము 37:17-24. దీప స్తంభం తేజోరూపి అయిన క్రీస్తుకు సూచన (యోహాను 1:4 యోహాను 1:9 యోహాను 8:12 యోహాను 9:5). దేవుని సన్నిధికి మార్గాన్ని వెలిగించేది ఆయనే. దీప స్తంభానికి 7 శాఖలూ, ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క దీపమూ ఉన్నాయి. బైబిల్లో 7 సంఖ్య సంపూర్ణతకూ లోపరాహిత్యానికి గుర్తు (ప్రకటన గ్రంథం 1:4 ప్రకటన గ్రంథం 1:12 ప్రకటన గ్రంథం 1:16 ప్రకటన గ్రంథం 5:6 మొ।। పోల్చి చూడండి). క్రీస్తే ఆ వెలుగు. దేవుని చెంతకు మార్గం చూపించడానికి, ఆరాధనకూ, సేవకూ ఈ వెలుగు తప్ప మరేదీ అవసరం లేదు. సన్నిధి గుడారంలో సూర్యుడూ చంద్రుడూ మరి ఏ ఇతర కాంతి జనకాలకు చెందిన వెలుగూ లేదు. యాజులు సన్నిధి గుడారంలోకి తమ వెంట దీపాలను తెచ్చుకునే అవసరం లేదు. ఈ సప్తదీప స్తంభం సరిపోయింది. దీని దీపాలనూ ఎప్పుడూ ఆర్పకూడదు. ముందుకాలంలో రాబోయే దేవుని పట్టణంలో ఇలాంటిదే మరొక దాన్ని చూస్తాం (ప్రకటన గ్రంథం 21:23).

32. దీప వృక్షముయొక్క ఒక ప్రక్కనుండి మూడుకొమ్మలు, దీపవృక్షముయొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరుకొమ్మలు నిగుడవలెను.

33. ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను.

34. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను,

35. దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను.

36. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయ బడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను.

37. నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.

38. దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.

39. ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను.

40. కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.
అపో. కార్యములు 7:44, హెబ్రీయులకు 8:5

9వ వచనంలో ఇచ్చిన ఆదేశాన్ని మరోసారి ఇస్తున్నాడు దేవుడు. తనను సమీపించేందుకు మార్గాన్ని దేవుడు దృష్టాంత రీతిలో చూపిస్తున్నాడు. క్రీస్తు వ్యక్తిత్వాన్నీ, ఆయన చేసే పనినీ ఇక్కడ ముందుగానే సూచనప్రాయంగా కనపరుస్తున్నాడు. అందువల్ల తాను చెప్పిన ప్రకారం ఖచ్చితంగా అక్షరాలా జరగాలి.Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |