Exodus - నిర్గమకాండము 31 | View All

1. మరియయెహోవా మోషేతో ఇట్లనెను

1. And the Lord spak to Moyses, `and seide, Lo!

2. చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.

2. Y haue clepid Beseleel bi name, the sone of Hury, sone of Hur, of the lynage of Juda;

3. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై

3. and Y haue fillid hym with the spirit of God, with wisdom, and vndirstondyng, and kunnyng in al werk,

4. రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును

4. to fynde out what euer thing may be maad suteli, of gold, and siluer, and bras, and marbil,

5. సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసియున్నాను.

5. and gemmes, and dyuersite of trees.

6. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసి తిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి యున్నాను.

6. And Y haue youe to hym a felowe, Ooliab, the sone of Achisameth, of the kynrede of Dan; and Y haue put in `the herte of hem the wisdom of ech lerned man, that thei make alle thingis, whiche Y comaundide to thee;

7. ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటిని

7. the tabernacle of boond of pees, and the arke of witnessyng, and the propiciatorie, ether table, which is theronne, and alle the vessels of the tabernacle;

8. బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటిని ధూపవేదికను

8. also the bord, and vessels therof, the clenneste candilstike with hise vessels, and the auteris of encence,

9. దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను

9. and of brent sacrifice, and alle the vessels of hem; the greet `waischyng vessel with his foundement;

10. యాజకసేవచేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోనుయొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను

10. hooli clothis in seruyce to Aaron prest, and to hise sones, that thei be set in her office in hooli thingis;

11. అభిషేక తైలమును పరిశుద్ధ స్థలముకొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను.

11. the oile of anoyntyng, and encence of swete smellynge spiceryes in the seyntuarie; thei schulen make alle thingis whiche Y comaundide to thee.

12. మరియయెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను;

12. And the Lord spak to Moises, `and seide, Speke thou to the sones of Israel,

13. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును.

13. and thou schalt seie to hem, Se ye that ye kepe my sabat, for it is a signe bytwixe me and you in youre generaciouns; that ye wite, that Y am the Lord, which halewe you.

14. కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును.

14. Kepe ye my sabat, for it is hooli to you; he that defoulith it, schal die bi deeth, the soule of hym, that doith werk in the sabat, schal perische fro the myddis of his puple.

15. ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును.

15. Sixe daies ye schulen do werk; in the seuenthe dai is sabat, hooli reste to the Lord; ech man that doith werk in this dai schal die.

16. ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన.

16. The sones of Israel kepe sabat, and halewe it in her generaciouns;

17. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పనిమాని విశ్రమించెనని చెప్పుము.

17. it is a couenaunt euerlastinge bitwixe me and the sones of Israel, and it is `a signe euerlastynge; for in sixe daies God made heuene and erthe, and in the seuenthe day he ceessid of werk.

18. మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.
యోహాను 1:17, 2 కోరింథీయులకు 3:3

18. And whanne siche wordis weren fillid, the Lord yaf to Moises, in the hil of Synay, twei stonun tablis of witnessyng, writun with the fyngur of God.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 31 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
బెసలేలు మరియు అహోలియాబు గుడారపు పనికి నియమించబడ్డారు మరియు అర్హులు. (1-11) 
ఇటుకలతో వస్తువులను నిర్మించే ఇశ్రాయేలీయులకు ఫ్యాన్సీ వస్తువులను తయారు చేసే నైపుణ్యం లేదు. కానీ దేవుని నుండి వచ్చిన ప్రత్యేక శక్తి బెజలేలు మరియు అహోలియాబు అనే ఇద్దరు వ్యక్తులకు అవసరమైన వాటిని తయారు చేయగల సామర్థ్యాన్ని ఇచ్చింది. దేవుడు ఎవరికైనా ముఖ్యమైన పనిని ఇస్తే, వారు దానికి సిద్ధంగా ఉంటారు. దేవుడు వేర్వేరు వ్యక్తులకు విభిన్న ప్రతిభను ఇస్తాడు, కాబట్టి ప్రతి ఒక్కరూ వారి స్వంత పనిని చేయాలి మరియు వారికి ఏదైనా జ్ఞానం దేవుని నుండి వచ్చినదని గుర్తుంచుకోవాలి. 

విశ్రాంతి దినాన్ని పాటించడం. (12-17) 
ఆరాధన కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని నిర్మించమని దేవుడు ప్రజలకు చెప్పాడు, కాని వారు విశ్రాంతి రోజున పని చేయడానికి అనుమతించబడలేదు, దీనిని సబ్బాత్ అని పిలుస్తారు. సబ్బాత్ అంటే పని చేయడం మానేసి విశ్రాంతి తీసుకోవడం. దేవుడు మనకు వాగ్దానం చేసిన పరలోకంలో విశ్రాంతిని ఇది గుర్తుచేస్తుంది. కాబట్టి, సమయం ముగిసే వరకు మనం విశ్రాంతి రోజున విశ్రాంతి తీసుకోవాలి. 

మోషే ధర్మశాస్త్ర పట్టికలను అందుకుంటాడు. (18)
దేవుడు తన చట్టాన్ని రాతి పలకలపై వ్రాసాడు, అది ఎంత ముఖ్యమైనది మరియు ఎప్పటికీ ఉంటుంది. మన హృదయాలు మొండిగా ఉంటాయని, మార్చడం కష్టమని చూపించడానికి కూడా అతను ఇలా చేశాడు. మన హృదయాలను మెరుగుపరచుకోవడం కంటే రాతిపై రాయడం సులభం. దేవుడు ఈ చట్టాన్ని తన వేలితో వ్రాసాడు, మన హృదయాలను మార్చగల మరియు వారిని మంచిగా మార్చగల శక్తి తనకు మాత్రమే ఉందని చూపిస్తుంది. దేవుడు మన హృదయాలను మార్చడానికి అనుమతించినప్పుడు, అతను తన వేలిలాంటి తన ఆత్మతో తన చట్టాలను వాటిలో వ్రాస్తాడు. 2Cor 3:3 



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |