Exodus - నిర్గమకాండము 4 | View All

1. అందుకు మోషే-చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు-యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా

1. anduku mōshē-chitthagin̄chumu; vaaru nannu nammaru naa maaṭa vinaru-yehōvaa neeku pratyakshamu kaalēdanduru ani uttharamiyyagaa

2. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను.

2. yehōvaa nee chethilōnidi ēmiṭi ani athani naḍigenu. Andukathaḍu karra anenu.

3. అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను.

3. appuḍaayana nēlanu daani paḍavēyumanenu. Athaḍu daani nēla paḍavēyagaanē adhi paamaayenu. Mōshē daaninuṇḍi paaripōyenu.

4. అప్పుడు యెహోవా-నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.

4. appuḍu yehōvaa-nee cheyyi chaapi daani thooka paṭṭukonumanagaa, athaḍu thana cheyyi chaapi daani paṭṭukonagaanē adhi athani chethilō karra aayenu.

5. ఆయన దానిచేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్ష మాయెనని నమ్ముదురనెను.
హెబ్రీయులకు 11:16

5. aayana daanichetha vaaru thama pitharula dhevuḍaina yehōvaa, anagaa abraahaamu dhevuḍu issaaku dhevuḍu yaakōbu dhevuḍu neeku pratyaksha maayenani nammuduranenu.

6. మరియయెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను.

6. mariyu yehōvaa nee cheyyi nee rommuna un̄chukonumanagaa, athaḍu thana cheyyi rommuna un̄chukoni daani velupaliki theesinappuḍu aa cheyyi kushṭhamugaladai himamuvale tellagaa aayenu.

7. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.

7. tharuvaatha aayana nee cheyyi marala nee rommuna un̄chukonumanagaa, athaḍu thana cheyyi marala thana rommuna un̄chukoni thana rommunuṇḍi velupaliki theesinappuḍu adhi athani migilina shareeramuvale aayenu.

8. మరియు ఆయన వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు.

8. mariyu aayana vaaru ninnu nammaka, modaṭi soochananubaṭṭi vinakapōyina yeḍala reṇḍava daanibaṭṭi vinduru.

9. వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.

9. vaaru ee reṇḍu soochanalanubaṭṭi nammaka neemaaṭa vinakapōyina yeḍala neevu kon̄chemu ēṭi neeḷlu theesi yeṇḍina nēlameeda pōyavalenu. Appuḍu neevu ēṭilōnuṇḍi theesina neeḷlu poḍinēlameeda rakthamagunanenu.

10. అప్పుడు మోషేప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా

10. appuḍu mōshēprabhuvaa, inthaku munupainanu, neevu nee daasunithoo maaṭalaaḍi nappaṭinuṇḍi yainanu, nēnu maaṭa nērparini kaanu, nēnu nōṭi maandyamu naaluka maandyamu galavaaḍanani yehovaathoo cheppagaa

11. యెహోవామానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.

11. yehōvaa maanavunaku nōrichinavaaḍu evaḍu? Mooga vaaninēgaani cheviṭivaaninēgaani drushṭigalavaaninēgaani gruḍḍi vaaninēgaani puṭṭin̄chinavaaḍevaḍu? Yehōvaanaina nēnē gadaa.

12. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.

12. kaabaṭṭi veḷlumu, nēnu nee nōṭiki thooḍaiyuṇḍi, neevu ēmi palukavalasinadhi neeku bōdhin̄chedhanani athanithoo cheppenu.

13. అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా

13. andukathaḍu ayyō prabhuvaa, neevu pampa thalan̄china vaaninē pampumanagaa

14. ఆయన మోషేమీద కోపపడిలేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;

14. aayana mōshēmeeda kōpapaḍilēveeyuḍagu nee annayaina aharōnu lēḍaa? Athaḍu baagugaa maaṭalaaḍagalaḍani nēnerugudunu, idigō athaḍu ninnu edurkonavachuchunnaaḍu, athaḍu ninnu chuchi thana hrudayamandu santhooshin̄chunu;

15. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను.

15. neevu athanithoo maaṭalaaḍi athani nōṭiki maaṭalu andin̄chavalenu, nēnu nee nōṭiki athani nōṭiki thooḍai yuṇḍi, meeru cheyavalasinadaanini meeku bōdhin̄chedanu.

16. అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.

16. athaḍē neeku badulu janulathoo maaṭalaaḍunu, athaḍē neeku nōrugaanuṇḍunu, neevu athaniki dhevuḍavugaa unduvu.

17. ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.

17. ee karranu chethapaṭṭu konidaanithoo aa soochaka kriyalu cheyavalenanicheppenu.

18. అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రోయొద్దకు తిరిగి వెళ్లిసెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో- క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.

18. aṭutharuvaatha mōshē bayaludheri thana maamayaina yitrōyoddhaku thirigi veḷliselavainayeḍala nēnu aigupthulōnunna naa bandhuvulayoddhaku marala pōyi vaariṅka sajeevulai yunnaarēmō chuchedhanani athanithoo cheppagaa yitrō- kshēmamugaa veḷlumani mōshēthoo anenu.

19. అంతట యెహోవానీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లు మని మిద్యానులో మోషేతో చెప్పగా,
మత్తయి 2:20

19. anthaṭa yehōvaanee praaṇamunu vedakina manushyulandaru chanipōyiri ganuka aigupthuku thirigi veḷlu mani midyaanulō mōshēthoo cheppagaa,

20. మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.

20. mōshē thana bhaaryanu thana kumaarulanu theesikoni gaaḍidameeda nekkin̄chukoni aigupthuku thirigi veḷlenu. Mōshē dhevuni karranu thana chetha paṭṭukoni pōyenu.

21. అప్పుడు యెహోవామోషేతో ఇట్లనెను-నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. అతడు ఈ జనులను పోనియ్యడు.
రోమీయులకు 9:18

21. appuḍu yehōvaamōshēthoo iṭlanenu-neevu aigupthunandu thirigi cherina tharuvaatha, cheyuṭaku nēnu neekichina mahatkaaryamulanniyu pharō yeduṭa cheyavalenu sumee ayithē nēnu athani hrudayamunu kaṭhinaparachedanu. Athaḍu ee janulanu pōniyyaḍu.

22. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;
రోమీయులకు 9:4

22. appuḍu neevu pharōthoo ishraayēlu naa kumaaruḍu, naa jyēshṭhaputruḍu;

23. నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంప నొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెల విచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.

23. nannu sēvin̄chunaṭlu naa kumaaruni pōnimmani neeku aagnaapin̄chuchunnaanu; vaani pampa nollaniyeḍala idigō nēnu nee kumaaruni, nee jyēshṭha putruni champedhanani yehōvaa sela vichuchunnaaḍani athanithoo cheppumanenu.

24. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా

24. athaḍu pōvu maargamuna satramulō yehōvaa athanini edurkoni athani champachooḍagaa

25. సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను.

25. sippōraa vaaḍigala raayi theesikoni thana kumaaruniki sunnathichesi athani paadamulayoddha adhi paḍavēsi nijamugaa neevu naaku rakthasambandhamaina penimiṭivaithivanenu; anthaṭa aayana athanini viḍichenu.

26. అప్పుడు ఆమె ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.

26. appuḍu aame ee sunnathinibaṭṭi neevu naaku rakthasambandhamaina penimiṭivaithivanenu.

27. మరియయెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను.

27. mariyu yehōvaa mōshēnu edurkonuṭaku araṇyamulōniki veḷlumani aharōnuthoo cheppagaa athaḍu veḷli dhevuni parvathamandu athani kalisikoni athani muddu peṭṭukonenu.

28. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.

28. appuḍu mōshē thannu pampina yehōvaa palukumanna maaṭalanniṭini, aayana cheyanaagnaapin̄china soochaka kriyalanniṭini aharōnuku telipenu.

29. తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి,

29. tharuvaatha mōshē aharōnulu veḷli ishraayēleeyula peddalanandarini pōguchesi,

30. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి.

30. yehōvaa mōshēthoo cheppina maaṭalanniyu aharōnu vivarin̄chi, janulayeduṭa aa soochaka kriyalanu cheyagaa janulu nammiri.

31. మరియయెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.

31. mariyu yehōvaa ishraayēleeyulanu chooḍavachi thama baadhanu kanipeṭṭenanu maaṭa janulu vini thalavan̄chukoni namaskaaramu chesiri.


Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.