Exodus - నిర్గమకాండము 4 | View All

1. అందుకు మోషే-చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు-యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా

మోషే మాట వింటారు అని దేవుడు చెప్పాడు (నిర్గమకాండము 3:18). కాబట్టి మోషే ఈ సాకు చెప్పి తప్పించుకోవాలని చూడడం తగని పని.

2. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను.

3. అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను.

పాత ఒడంబడిక గ్రంథంలో ఇక్కడ మొదటి సారిగా ఒక మనిషికి అద్భుతాలు చేసే శక్తి ఇవ్వడం కనిపిస్తున్నది. పాము ఈజిప్ట్‌రాజుల రాజ చిహ్నం. పాము బొమ్మను వారు తమ కిరీటంలో ధరించారు. ఆ రాజులందరూ దేవుళ్ళే అని ఈజిప్ట్‌వారు భావించారు. ఇప్పుడు ఫరోను లొంగదీసే శక్తి మోషేకు దేవుడు ఇచ్చాడు.

4. అప్పుడు యెహోవా-నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.

5. ఆయన దానిచేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్ష మాయెనని నమ్ముదురనెను.
హెబ్రీయులకు 11:16

ఈ అద్భుతాలను చేయడంలో ఉన్న ఉద్దేశం ఇదే. దేవుడు ఇస్రాయేల్‌ప్రజల విమోచనకోసం పంపిస్తున్న మోషేను వారు నమ్మడం చాలా ముఖ్యం. అలా నమ్మని పక్షంలో వారికి దాస్య విముక్తి కలగదు (యెహోషువ 3:7 యోహాను 4:48 యోహాను 5:36 యోహాను 6:29 యోహాను 8:24 యోహాను 10:37-38 పోల్చి చూడండి).

6. మరియయెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను.

తెగుళ్ళను, వ్యాధులను కలిగించే శక్తిని కూడా ఇప్పుడు మోషేకు దేవుడిస్తున్నాడు (కుష్ఠు వ్యాధి గురించి లేవీయకాండము 13:1 నోట్ చూడండి).

7. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.

8. మరియు ఆయన వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు.

9. వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.

ఈ నది పేరు నైలు. అది ఈజిప్ట్‌దేశం గొప్ప నది. ఈజిప్ట్ ప్రాంతంలో వ్యవసాయం, నాగరికత ఈ నదీ తీరంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది. అక్కడి ప్రజలు ఈ నది దైవికమైనదని దానిని పూజించారు.

10. అప్పుడు మోషేప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా

ఇది మరో సాకు. దేవునికి కావలసినది మన వాగ్దాటి కాదు గాని మన విధేయత.

11. యెహోవామానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.

కీర్తనల గ్రంథము 94:9 కీర్తనల గ్రంథము 146:8 మత్తయి 11:5.

12. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.

ద్వితీయోపదేశకాండము 18:18 యెషయా 50:4 యిర్మియా 1:9 మత్తయి 10:19-20 మార్కు 13:11 లూకా 12:11-12 లూకా 21:14-15 యోహాను 14:26 యోహాను 16:13. బైబిలు గ్రంథమంతా దేవుని మూలంగా రాయబడింది. ఈ విధంగానే తన ప్రవక్తలు ఏమి మాట్లాడాలో దేవుడు వారికి చెప్పాడు. వారి మనసులో తన ఆలోచనలను ఊదాడు. పవిత్రాత్మ ప్రేరేపణ ప్రసాదించి వారిచేత రాయించాడు (2 తిమోతికి 3:16 2 పేతురు 1:21).

13. అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా

ఈజిప్ట్ వెళ్ళేందుకు దాదాపు నిష్కర్షగా నిరాకరిస్తున్నాడు. ఇందువల్ల దేవునికి అతనిపై కోపం వచ్చింది (కీర్తనల గ్రంథము 90:7-11 పోల్చిచూడండి). మోషే గొప్ప వాడైనప్పటికీ మనుషులందరిలాగే అతనికి పాపంతో కూడిన స్వభావం ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి (రోమీయులకు 3:23). దాన్ని అధిగమించాలంటే దేవుని కృప అతనికి కావాలి. మనం తన సంకల్పాన్ని నెరవేర్చాలని దేవుడు పదే పదే ప్రోత్సహిస్తూ, ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పటికీ మనం ఆ విధంగా చెయ్యకపోతే మనం కూడా దేవుని కోపానికి గురౌతాం.

14. ఆయన మోషేమీద కోపపడిలేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;

15. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను.

నిర్గమకాండము 7:1-2 చూడండి.

16. అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.

17. ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.

నిర్గమకాండము 4:2 చూడండి.

18. అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రోయొద్దకు తిరిగి వెళ్లిసెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో- క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.

నిర్గమకాండము 3:1 చూడండి.

19. అంతట యెహోవానీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లు మని మిద్యానులో మోషేతో చెప్పగా,
మత్తయి 2:20

నిర్గమకాండము 2:15 నిర్గమకాండము 2:23 చూడండి.

20. మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.

నిర్గమకాండము 18:2-4 చూడండి.

21. అప్పుడు యెహోవామోషేతో ఇట్లనెను-నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. అతడు ఈ జనులను పోనియ్యడు.
రోమీయులకు 9:18

“అద్భుతాలు”– నిర్గమకాండము 3:20 నిర్గమకాండము 11:9-10.

22. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;
రోమీయులకు 9:4

యెషయా 63:16 యెషయా 64:8 యిర్మియా 31:9 హోషేయ 11:1 రోమీయులకు 9:4.

23. నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంప నొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెల విచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.

నిర్గమకాండము 5:1 నిర్గమకాండము 11:5 నిర్గమకాండము 12:29 చూడండి.

24. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా

తన ప్రజలను బానిసత్వంనుండి విడిపించడానికి తాను వాడుకోదలచుకున్న వ్యక్తినే చంపెయ్యాలని దేవుడు ఎందుకు అనుకున్నాడు? దేవుడు అబ్రాహాముతో, అతని సంతానంతో చేసిన ఒడంబడికలో దీనికి జవాబు కనిపిస్తున్నది (ఆదికాండము 17:9-14 చూడండి). ఆ సమయంలో దేవుడు తన ఒడంబడికకు గుర్తుగా సున్నతిని నియమించాడు. ఈ ఒడంబడికకూ ఈ ఆజ్ఞకూ మోషే కట్టుబడలేదు. దీనికి విధేయుడయ్యేవరకూ, లేక తన భార్యను విధేయురాలిని చేసేవరకూ అతనికి ప్రమాదమే. దేవుని ఆజ్ఞకు లోబడే విషయంలో మోషే భార్యే మోషేకు అడ్డుబండగా కనిపిస్తున్నది. దేవుడు నిజంగా మోషేను చంపెయ్య బూనుకుంటే తేలికగా చంపేవాడే. కానీ ఈ ప్రాముఖ్యమైన బాధ్యతను అతడు గుర్తించగలిగేలా మోషేను మేల్కొలపడమే దేవుని ఉద్దేశం. అందుకు దేవుడు ఈ కఠినమైన చర్య తల పెట్టాడు.

25. సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను.

26. అప్పుడు ఆమె ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.

27. మరియయెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను.

నిర్గమకాండము 4:15 నిర్గమకాండము 3:1 చూడండి.

28. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.

29. తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి,

నిర్గమకాండము 3:16 నిర్గమకాండము 4:2-8 చూడండి.

30. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి.

నిర్గమకాండము 4:15-16 చూడండి.

31. మరియయెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.

నిర్గమకాండము 3:18 నిర్గమకాండము 4:8 చూడండి.


Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.