Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.
1. Here are some proverbs of Solomon: Children with good sense make their parents happy, but foolish children make them sad.
2. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును.
2. What you gain by doing evil won't help you at all, but being good can save you from death.
3. యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు భక్తిహీనుని ఆశను భంగముచేయును.
3. If you obey the LORD, you won't go hungry; if you are wicked, God won't let you have what you want.
4. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
4. Laziness leads to poverty; hard work makes you rich.
5. వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు.
5. At harvest season it's smart to work hard, but stupid to sleep.
6. నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.
6. Everyone praises good people, but evil hides behind the words of the wicked.
7. నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును
7. Good people are remembered long after they are gone, but the wicked are soon forgotten.
8. జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును పనికిమాలిన వదరుబోతు నశించును.
8. If you have good sense, you will listen and obey; if all you do is talk, you will destroy yourself.
9. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడును.అపో. కార్యములు 13:10
9. You will be safe, if you always do right, but you will get caught, if you are dishonest.
10. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికిమాలిన వదరుబోతు నశించును.
10. Deceit causes trouble, and foolish talk will bring you to ruin.
11. నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.
11. The words of good people are a source of life, but evil hides behind the words of the wicked.
12. పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.1 కోరింథీయులకు 13:7, యాకోబు 5:20, 1 పేతురు 4:8
12. Hatred stirs up trouble; love overlooks the wrongs that others do.
13. వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.
13. If you have good sense, it will show when you speak. But if you are stupid, you will be beaten with a stick.
14. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూఢుల నోరు అప్పుడే నాశనముచేయును.
14. If you have good sense, you will learn all you can, but foolish talk will soon destroy you.
15. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము.
15. Great wealth can be a fortress, but poverty is no protection at all.
16. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును.
16. If you live right, the reward is a good life; if you are evil, all you have is sin.
17. ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.
17. Accept correction, and you will find life; reject correction, and you will miss the road.
18. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.
18. You can hide your hatred by telling lies, but you are a fool to spread lies.
19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
19. You will say the wrong thing if you talk too much-- so be sensible and watch what you say.
20. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.
20. The words of a good person are like pure silver, but the thoughts of an evil person are almost worthless.
21. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు.
21. Many are helped by useful instruction, but fools are killed by their own stupidity.
22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.
22. When the LORD blesses you with riches, you have nothing to regret.
23. చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.
23. Fools enjoy doing wrong, but anyone with good sense enjoys acting wisely.
24. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.
24. What evil people dread most will happen to them, but good people will get what they want most.
25. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.
25. Those crooks will disappear when a storm strikes, but God will keep safe all who obey him.
26. సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.
26. Having a lazy person on the job is like a mouth full of vinegar or smoke in your eyes.
27. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.
27. If you respect the LORD, you will live longer; if you keep doing wrong, your life will be cut short.
28. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.
28. If you obey the Lord, you will be happy, but there is no future for the wicked.
29. యథార్థవంతునికి యెహోవా యేర్పాటు ఆశ్రయదుర్గము పాపముచేయువారికి అది నాశనకరము.
29. The LORD protects everyone who lives right, but he destroys anyone who does wrong.
30. నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు.
30. Good people will stand firm, but the wicked will lose their land.
31. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.
31. Honest people speak sensibly, but deceitful liars will be silenced.
32. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.
32. If you obey the Lord, you will always know the right thing to say. But no one will trust you if you tell lies.