Proverbs - సామెతలు 11 | View All

1. దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.

లేవీయకాండము 19:35-36; ద్వితీయోపదేశకాండము 25:13-16; ఆమోసు 8:5; మీకా 6:11. అన్ని రకాలైన వంచనలూ దేవునికి అసహ్యం.

2. అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.

3. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.

5వ వచనం. కపటం లేని ఉద్దేశాలు, యథార్థత కలిగి, సూటి మార్గంలో నడవదలుచుకొన్నవారికి అలాంటి మార్గం ఏదో తెలియక మానదు. దుర్మార్గులు ఇతరుల కోసం పన్నిన వలలలో వారే చిక్కుపడిపోతారు (సామెతలు 5:22; కీర్తనల గ్రంథము 9:16).

4. ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును.

5. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.

6. యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.

పేరాశలు మనుషుల్ని పాపం అనే బానిసత్వంలోకి తెస్తాయి (యోహాను 8:34; రోమీయులకు 6:16; యాకోబు 1:14-15).

7. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైనవారి ఆశ భంగమైపోవును.

సామెతలు 10:28; సామెతలు 11:23. దుర్మార్గం నిండిన జీవితంలో ధనం, కీర్తి, సుఖభోగాలు ఉన్నప్పటికీ అది వ్యర్థమైన శూన్య జీవితం. దాని వల్ల ఏ ప్రయోజనమూ లేదు.

8. నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును

ఎస్తేరు 5:14; ఎస్తేరు 7:10 లో దీనికి చక్కని ఉదాహరణ ఉంది.

9. భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.

కొండేలు చెప్పుకోవడం చాలా చెడ్డ పని. ఇది మరో వ్యక్తి పేరునూ, ప్రతిష్ఠనూ, అతని ప్రయోజకత్వాన్నీ నాశనం చేయబూనుకోవడమే.

10. నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.

11. యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.

12. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.

13. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.

14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.

15. ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.

16. నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.

“గౌరవం సంపదలకన్న మిన్న”– సామెతలు 22:1.

17. దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును

18. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.

19. యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును

20. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.

“అసహ్యం”– సామెతలు 3:32; సామెతలు 6:16-19. “ప్రీతిపాత్రులు”– సామెతలు 12:22; సామెతలు 15:8; కీర్తనల గ్రంథము 16:3; యిర్మియా 9:24. జ్ఞానమున్న వ్యక్తి దేవునికి సంతోషం కలిగించేవే గాని అసహ్యం పుట్టించే పనులు చేయడు.

21. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును.

22. వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.

23. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.

“మంచి”– రోమీయులకు 8:28. “ఆశ (ఉగ్రత)”– రోమీయులకు 2:8-9.

24. వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.
2 కోరింథీయులకు 9:6

సామెతలు 22:9; మలాకీ 3:10; మత్తయి 7:2; లూకా 6:38; 2 కోరింథీయులకు 9:6-11. మనం ఎన్నడూ మర్చిపోకూడదని నియమం ఇక్కడ ఉంది. దేవునికి గానీ ఇతరులకు గానీ మనం ఏమీ ఇవ్వనప్పుడు దేవుడు మాత్రం మనల్నెందుకు దీవిస్తాడు? ఇవ్వడం గురించి నోట్, రిఫరెన్సులు 2 కోరింథీయులకు 9:15.

25. ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును

26. ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును.

27. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.

28. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు

29. తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును.

30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు

“జీవవృక్షం”– సామెతలు 3:18; ఆదికాండము 2:9; ఆదికాండము 3:24; ప్రకటన గ్రంథం 2:7. నీతిన్యాయాలు గల దేవుని ప్రజల ప్రయత్నాల మూలంగా ఇతరులు కొందరు దేవుని చెంతకు చేరి క్రీస్తు ద్వారా శాశ్వత జీవం పొందుతారు. “జ్ఞానమున్నవాడు”– దానియేలు 12:3; యాకోబు 5:20. జ్ఞానం గురించిన ఈ అంశం చాలామందికి తెలియదు.

31. నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా?
1 పేతురు 4:18Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |