Proverbs - సామెతలు 13 | View All

1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.

2. నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.

3. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.

4. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.

5. నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.

6. యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.

7. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.

ఈ రెండు రకాల వంచనలూ, ఆ మాటకొస్తే అన్ని రకాలైన మోసాలూ తప్పే, మూర్ఖత్వమే.

8. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.

ధనికులు చిక్కుల్లో పడితే డబ్బిచ్చి బయట పడతారు.

9. నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.

10. గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.

“కలహం”– కేవలం గర్వం మూలంగానే సోదరుల మధ్య ఎన్ని చీలికలు, సంఘాల్లో ఎన్ని కొట్లాటలు ఉన్నాయో గదా!

11. మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును.

12. కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.

“జీవవృక్షం”– వ 19. అంటే న్యాయానుసారమైన, సరియైన కోరిక. అది నెరవేరడం వల్ల ఆశ చిగురిస్తుంది, బలం చేకూరుతుంది.

13. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.

14. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.

సామెతలు 10:11; సామెతలు 14:27. ఇలాంటి ఉపదేశాలు ఇతరులను శాశ్వత జీవాన్నిచ్చే దేవుని వైపుకు నడుపుతాయి. ఆయనపట్ల భయభక్తులను కలిగిస్తాయి.

15. సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.

16. వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.

17. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.

18. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.

19. ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.

మూర్ఖులు తెలుసుకొనేది, కోరుకునేది కేవలం చెడుతనమే. అది వారి జీవనం. దాన్ని వదిలిపెట్టడం కంటే కష్టమైనది మరొకటి లేదు (యిర్మియా 13:23). మూర్ఖుల గురించి నోట్స్ సామెతలు 1:7; కీర్తనల గ్రంథము 14:1.

20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును.మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

కాబట్టి స్నేహితులను ఎన్నుకోవడంలో మనం ఎంత జాగ్రత్త వహించాలి! సామెతలు 1:10; సామెతలు 2:12, సామెతలు 2:20; సామెతలు 12:26; సామెతలు 16:29; సామెతలు 22:24-25; 1 కోరింథీయులకు 15:33.

21. కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.

22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.

“సజ్జనుడు”– ఎస్తేరు 8:2; ప్రసంగి 2:26.

23. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.

24. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.

క్రమశిక్షణ, దిద్దుబాటు, సవరణ లేకపోతే పిల్లలు ఎదిగేకొద్దీ మూర్ఖులుగా, స్వార్థపరులుగా సానుభూతి లేనివారుగా తయారౌతారు, దేవుడు మనుషులపట్ల వ్యవహరించే తీరులు గ్రహించలేనివారౌతారు. క్రమశిక్షణలో పెట్టకపోవడం తమ స్వంత పిల్లలను ద్వేషించి వారిని చేజేతులా పాడు చెయ్యడంతో సమానం. ఈ విషయంలో అలక్ష్యం చేసేవారు తమ పిల్లలను కాదు, తమ్మును తామే ప్రేమించుకొంటున్నారు. నిజమైన ప్రేమ ఎప్పుడూ క్రమశిక్షణలో పెడుతుంది (సామెతలు 3:11-12; సామెతలు 19:18; సామెతలు 22:15; సామెతలు 23:13-14; సామెతలు 29:15, సామెతలు 29:17; హెబ్రీయులకు 12:6).

25. నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |