Proverbs - సామెతలు 23 | View All

1. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచించుము.

ఇక్కడి అర్థాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు: ఎవరైనా రాజు మనల్ని భోజనానికి పిలిచాడూ అంటే మనల్ని తన స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని ఉద్దేశం కావచ్చు, అవి మోసం, కీడుతో కూడినవై ఉండవచ్చు.

2. నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.

3. అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు.

4. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.
1 తిమోతికి 6:9

5. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.

“ఎగిరిపోవడం”– యిర్మియా 17:11; లూకా 12:20-21.

6. ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.

పై మెప్పుల కోసం పలికే మాటలు, కపటం యథార్థవంతుడికి వాంతి తెప్పిస్తాయి.

7. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.

8. నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును.

9. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.

10. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు

సామెతలు 22:23, సామెతలు 22:28 ఇక్కడ విమోచకుడు అనే పదం “గోయేల్” అనే హీబ్రూ పదానికి అనువాదం. రూతు 2:20; కీర్తనల గ్రంథము 78:35 నోట్స్ చూడండి.

11. వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.

12. ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.

13. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును

14. బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.

15. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.

వ 24; సామెతలు 27:11; సామెతలు 29:3. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన పిల్లలు జ్ఞానవంతులు, యథార్థవంతులు అయితే వారిని చూచి ఆనందిస్తాడు.

16. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.

17. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.

18. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.

19. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము.

మనం తినేది, తాగేది ఏమిటో, ఎంతో మొదలైన విషయాలన్నిట్లో జ్ఞానం మార్గదర్శిగా ఉంటుంది. త్రాగుబోతుతనం, తిండిబోతుతనం ఈ రెంటినీ బైబిలు ఖండిస్తుంది. దేవుని కోపం, శిక్ష ఇలాంటివారి మీదికి వస్తుంది.

20. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగాతినువారితోనైనను సహవాసము చేయకుము.

21. త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.

22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.

23. సత్యమును అమ్మివేయక దాని కొనియుంచు కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచు కొనుము.

24. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును.

25. నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.

26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,

“నీ హృదయాన్ని నాకు ఇచ్చివెయ్యి”– ఏ తండ్రి అయినా తన కుమారుని నుంచి ఇదే కోరుకుంటాడు. అయితే ఇలాంటి బహుమతిని పొందే అర్హత అతనికి ఉండాలి. తన పిల్లలనుంచి తండ్రి అయిన దేవుడు కూడా దీన్ని కోరుకుంటున్నాడు. ఇంతకంటే తక్కువదేదీ ఆయన కోరడు. దీనికి ఆయన అన్ని విధాలుగా అర్హుడు కూడా. అర్పించవలిసిన చోట హృదయాన్ని అర్పించకపోతే అది ఈ లోక ఆకర్షణల వెంటబడుతుంది, లైంగిక సంబంధమైన అవినీతికి కూడా లొంగిపోవచ్చు.

27. వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.

28. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.

29. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?

తాగుబోతుతనం జోలికి వెళ్ళవద్దని. ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. మద్యపానం మొదట్లో సరదాగానే అనిపించవచ్చు (వ 31) అయితే అది విషం (వ 32). దాని ఫలాలు అతి చేదుగా ఉంటాయి. వీటిలో ఒక ఫలితం ఏదంటే బాగా త్రాగి మత్తెక్కినవాడు కొంచెం మత్తు దిగగానే తన జీవితాన్ని పాడు చేసే దీన్నే మళ్ళీ మళ్ళీ పుచ్చుకోదలుస్తాడు.

30. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.

31. ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
ఎఫెసీయులకు 5:18

32. పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.

33. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు

34. నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.

35. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.



Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |