Proverbs - సామెతలు 3 | View All

1. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.

బైబిల్లో తరచుగా మనుషులు దేవుని సత్యాన్ని మరిచిపోయే ప్రమాదం గురించిన హెచ్చరిక కనిపిస్తుంది (ద్వితీయోపదేశకాండము 4:23-24; కీర్తనల గ్రంథము 78:11; కీర్తనల గ్రంథము 106:13; హెబ్రీయులకు 12:5; 2 పేతురు 1:9).

2. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును.

న్యాయవంతులకు నిజమైన ప్రతిఫలం దొరికేది రాబోయే లోకంలో అయినప్పటికీ మంచి నడవడివల్ల ఈ లోకంలో కూడా వారికి లాభం కలుగుతుంది.

3. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్య కుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
2 కోరింథీయులకు 3:3

సామెతలు 6:21; సామెతలు 7:3; ద్వితీయోపదేశకాండము 6:6; 2 కోరింథీయులకు 3:3; కొలొస్సయులకు 3:16; హెబ్రీయులకు 8:10. దేవుని వాక్కు మన హృదయ ఫలకలపై రాసి ఉండకపోతే, మన ప్రవర్తనకు అది ఆధారం ఉండకపోతే, దాన్ని పెదవులతో వల్లె వేయడం నిష్ ప్రయోజనం, భక్తిపరులమని చాటించుకోవడం దండగ.

4. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.
లూకా 2:52, రోమీయులకు 12:17, 2 కోరింథీయులకు 8:21

5. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము

దేవునితో యథార్థవంతమైన నడతకు అవసరమైన మూడు అంశాలు – ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకం, స్వంత తెలివితేటలపై వైరాగ్యం, ప్రతి విషయంలోను దేవునివైపు చూస్తూ ఉండడం. సామెతల్లో తిన్నని మార్గానికి మరికొన్నిటితో ఉన్న తేడాలు కనిపిస్తాయి, అవేవంటే చీకటి బాటలు (సామెతలు 2:13), తడబడే అడుగులు (సామెతలు 4:11-12), దుర్మార్గం (సామెతలు 11:15), మూర్ఖత్వం (సామెతలు 15:21). అందువల్లే దేవుడు తనను తిన్నని మార్గాలగుండా తీసుకువెళ్ళాలని దావీదు ప్రార్థించాడు (కీర్తనల గ్రంథము 27:1). మన ప్రార్థన కూడా ఇదే కావాలి. సూటి మార్గం అంటే నిజాయితీ, రుజువర్తన ఉన్న నడవడిక. అది దేవుని దీవెనలతో నిండి ఉన్న దారి. అది సరైన గమ్యానికి అంటే సాక్షాత్తూ దేవుని చెంతకు చేరుస్తుంది.

6. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

7. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము
రోమీయులకు 12:16

“నీకు నీవే”– సామెతలు 26:12; యెషయా 5:21; యెషయా 47:10; రోమీయులకు 12:3; 1 కోరింథీయులకు 3:18-20. చాలామందిలో ఉన్న లోపం ఇదే. తమ దృష్టిలో తామే జ్ఞానవంతులం అనుకొంటూ దేవుని మాటలు చెవిని బెట్టరు. వారి అహంకారమే వారిని సత్యానికి దూరంగా వారి అజ్ఞానంలో బంధించి ఉంచుతుంది. “భయభక్తులు”– సామెతలు 1:7; ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14 నోట్ చూడండి.

8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.

కీర్తనల గ్రంథము 38:3 పోల్చి చూడండి. సామెతలు 4:20-22 చూడండి.

9. నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.

నిర్గమకాండము 22:29; ద్వితీయోపదేశకాండము 26:1-15; మలాకీ 3.10-12; లూకా 6:38. దేవునికీ ఆయన సేవకూ మనం ఏమీ అర్పించుకోకపోతే ఆయన్ను అగౌరవపరచినట్టే. మన జీవితాల్లో సంపూర్ణమైన ఆశీర్వాదం ఉండదు.

10. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును.

11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు.
ఎఫెసీయులకు 6:4, హెబ్రీయులకు 12:5-7

యోబు 5:17; కీర్తనల గ్రంథము 73:14; హెబ్రీయులకు 12:5-6 (ఈ మాటలు అక్కడ రాసి ఉన్నాయి).

12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
ప్రకటన గ్రంథం 3:19, ఎఫెసీయులకు 6:4, హెబ్రీయులకు 12:5-7

13. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు.

సామెతలు 1:7, సామెతలు 1:33; సామెతలు 2:1-6. మరో సారి ఇక్కడ నిజమైన జ్ఞానం విలువ, ఫలాలు రాసివున్నాయి. దీనికి తత్వశాస్త్రం అనబడే దానితో లేక అద్వైత వేదాంతంతో ఏ సంబంధమూ లేదని గుర్తుంచుకోవాలి. ఈ భూమిపై ఎవరైనా సంపాదించుకోగల వాటన్నిటికంటే కూడా అమూల్యమైన నిజ జ్ఞానాన్ని బైబిలు ఇస్తుంది. ఈ జ్ఞానంవల్ల కలిగే ముఖ్య ఫలం 18వ వచనంలో కనిపిస్తున్నది. నిజ దేవుణ్ణి ఎరిగి ఉండడమూ ఆయనపట్ల భయభక్తులూ అనే జ్ఞానంవల్ల అనంత జీవం, ధన్యత లభిస్తాయి (యోహాను 17:3). “ధన్యజీవులు”– ఆదికాండము 12:3; సంఖ్యాకాండము 6:22-27; కీర్తనల గ్రంథము 1:1-2; కీర్తనల గ్రంథము 119:1; మత్తయి 5:3-10 మొ।। నోట్స్.

14. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.

15. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.

16. దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.

17. దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.

18. దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.

19. జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.

20. ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.

21. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము

నిజమైన జ్ఞానం వల్ల కలిగే మరి కొన్ని ఫలితాలు – దయతో, భద్రతతో, యథార్థతతో, నిర్భయంగా విశ్రాంతిగా సాగిపోయే జీవితం. మనమీద మనం ఆధారపడక దేవుని మీదే ఆధారపడేలా చేస్తుంది ఆ జ్ఞానం (వ 26).

22. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును

23. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.

24. పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.

25. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
1 పేతురు 3:6

26. యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.

27. మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
2 కోరింథీయులకు 8:12

నిజమైన జ్ఞానం మనం నీతిన్యాయాలతోనూ జాలి గుండెతోను ఈ లోకంలో బ్రతికేలా తోడ్పడుతుంది. యాకోబు 4:17.

28. ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.
2 కోరింథీయులకు 8:12

29. నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు.

30. నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడ మాడవద్దు.

31. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు

32. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.

“అసహ్యం”– కీర్తనల గ్రంథము 5:5 నోట్.

33. భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.

న్యాయవంతులకూ దుర్మార్గులకూ కలిగే వేరువేరు ప్రతిఫలాల మధ్య తేడాను చూపించే అనేక ఉదాహరణలలో ఒకటి. దేవుని నుండి మనకు వచ్చేది శాపమా, దీవెనా, తిరస్కారమా, కృపా, గౌరవమా, అవమానమా? ఇది దేవుని దృష్టిలో మన స్థితిని బట్టి ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 11:26-28; ద్వితీయోపదేశకాండము 28:1-68 లో ఒక జాతి అంతటి విషయంలో ఈ సూత్రం వర్తిస్తూ ఉండడం కనిపిస్తున్నది.

34. అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును.
యాకోబు 4:6, 1 పేతురు 5:5

మనుషులు దేవుని పట్ల, తమ సాటి మనుషుల పట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో అదే విధంగా దేవుడు కొంతవరకైనా వారిపట్ల వ్యవహరిస్తాడు (ద్వితీయోపదేశకాండము 18:25-26 నోట్‌).

35. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |