Proverbs - సామెతలు 5 | View All

1. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము

1. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము విను. వివేకము గల నా మాటలు గమనించు.

2. అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.

2. అప్పుడు జీవించుటకు సరైన మార్గం నీవు తెలుసుకుంటావు. నీవు జ్ఞానివి అని నీ మాటలు తెలియజేస్తాయి.

3. జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి

3. మరోకరి భార్య పెదవులు తేనెలా తియ్యగా ఉండవచ్చు. ఆమె ముద్దులు తైలం కంటే మెత్తగా ఉండవచ్చు.

4. దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది,

4. కాని అంతలో కక్ష, బాధ, మాత్రమే ఆమె తెచ్చి పెడుతుంది. ఆ బాధ విషమంత చేదుగాను, ఖడ్గమంత వాడిగాను ఉంటుంది.

5. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును

5. ఆమె పాదాలు చావుకు దారితీస్తాయి. ఆమె నిన్ను తిన్నగా సమాధికి నడిపిస్తుంది.

6. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును.

6. ఆమెను వెంబడించవద్దు! ఆమె సరైన మార్గాలో నుంచి తప్పి పోయింది. అది ఆమెకు తెలియదు, జాగ్రత్తగా ఉండు! జీవమార్గాన్ని వెంబడించు!

7. కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.

7. నా కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు మరచిపోవద్దు.

8. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.

8. వేశ్యకు దూరంగా ఉండండి. ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు కూడ వెళ్లవద్దు.

9. వెళ్లినయెడల పరులకు నీ ¸యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు

9. ఒకవేళ నీవు అలా చేస్తే నీ మీద ప్రజలకున్న గౌరవం పోగొట్టుకుంటావు. ఇతరులు నీవు సంవత్సరాలు తరబడి సంపాందించినది అంతా తీసివేసుకుంటారు.

10. నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును.

10. నీకు తెలియని ప్రజలు నీ ఐశ్వర్యమంతా తీసివేసుకుంటారు. నీ కష్టార్జితం ఇతరుల పాలవుతుంది.

11. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు

11. నీ జీవితాంతం కూడూ నీవు మూల్గుతావు. నీ శరీరం, నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది.

12. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?

12. [This verse may not be a part of this translation]

13. నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు

13. [This verse may not be a part of this translation]

14. నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు.

14. ఇప్పుడు అంతంలో, నా జీవితం వ్యర్ధం అయిపోయినట్లు నేను చూస్తున్నాను. మనుష్యులంతా నా అవమానం చూస్తున్నారు” అని నీవు అంటావు.

15. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.

15. [This verse may not be a part of this translation]

16. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?

16. [This verse may not be a part of this translation]

17. అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.

17. నీ పిల్లలు నీకు మాత్రమే చెందినవారై ఉండాలి. నీ స్వంత ఇంటికి వెలుపలి వారితో నీవు నీ పిల్లల్ని పంచుకోరాదు.

18. నీ ఊట దీవెన నొందును. నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.

18. అందుచేత నీ స్వంత భార్యతో సంతోషించు. నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీవు పెళ్లాడిన స్త్రీతో అనుభవించు.

19. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.

19. ఆమె అందమైన లేడి వంటిది, అందమైన దుప్పిలాంటిది. ఆమె ప్రేమ నిన్ను పూర్తిగా తృప్తిపరచనివ్వు. ఆమె ప్రేమ నిన్ను బంధించి వేస్తుంది.

20. నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?

20. మరొకని భార్య నిన్ను అదే విధానంల్లో బంధించనియ్యకు. మరొకని ప్రేమ నీకు అవసరం లేదు.

21. నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.

21. ప్రతి మనిషి చేసే ప్రతీది యెహోవా తేటగా చూస్తాడు. మనుష్యులు చేసే ప్రతీదాన్ని యెహోవా క్షుణ్ణంగా చూస్తాడు.

22. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

22. దుర్మార్గుని పాపాలు వానినే పట్టుకొంటాయి. అతని పాపాలు అతణ్ణి బంధించే పాశాల్లా ఉంటాయి.

23. శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.

23. ఈ మనిషి క్రమశిక్షణలో ఉంచేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తాడు. అతడు తన స్వంత బుద్దిహీనమైన కోరికల వల్లనే పట్టు బడతాడు.Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |