రచయిత సామెతలు 2:16-19 లో ప్రస్తావించిన వ్యభిచారం గురించి మళ్ళీ చెప్తున్నాడు. ఇది గాక సామెతలు 6:23-35; సామెతలు 7:6-27 లో కూడా ఈ హితబోధ ఉంది. వ్యభిచారం అసలు రంగు ఇక్కడ బయటపెడతున్నాడు. అత్యంత నీచమైన, ప్రమాదకరమైన పాపాలన్నిటిలో వ్యభిచారం ఒకటి. మొదట్లో అది మధురంగా అనిపించవచ్చు (వ 3). అయితే అంతం మాత్రం చేదు విషం, మరణం (వ 4,5). ఆ పాపం చేసిన వారి సొంత ఆలోచనలు వారిని నిందిస్తాయి. ఇతరులూ దేవుడూ నేరారోపణ చేస్తారు.
సామెతలు 7:5.