Ecclesiastes - ప్రసంగి 3 | View All

1. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.

తన పనులనూ అనుభవాలనూ అప్పటికి అలా ఉంచి బయటి ప్రపంచం వైపుకు దృష్టి సారించాడు సొలొమోను. జీవితానికి అర్థాన్ని ఇచ్చేది అక్కడ ఏదన్నా ఉందా? లేదు, అక్కడ కూడా తిరిగే చక్రంలాగా ఒకదాని వెంట ఒకటి వచ్చే అర్థం లేని ప్రయత్నాలూ అనుభవాలూ తప్ప వేరేమీ లేదు. ఒక సమయంలో ఏం చేస్తామో, మరో సమయంలో ఇతరులు దానికి విరుద్ధమైనదాన్ని చేస్తారు. ఈ జాబితాలో ఉన్నవాటన్నిటినీ ప్రతి వ్యక్తీ చెయ్యాలని గానీ చేస్తారని గానీ అతడు చెప్పడం లేదు. భూమిపై సహజమైన జీవన గమనం ఇదని అతని ఉద్దేశం. వీటన్నిటినీ కలిపి చూస్తే ఎక్కడా ఏవీ శాశ్వతమైన విలువ ఉన్నవి కనిపించడం లేదు (వ 9).

2. పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,

3. చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;

4. ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;

5. రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

6. వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు;

7. చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;

8. ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.

9. కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి?

10. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని.

జీవితంలో అనుభవించగల తృప్తి ఏదన్నా ఉంటే అది దేవుని గురించిన ఆలోచనల వల్లే కలుగుతుంది. దేవుని పనులు సుందరమైనవి, మానవుల గ్రహింపుకు మించినవి (వ 11). అవి లోపం లేనివి, శాశ్వతమైనవి (వ 14). అయితే దేవుడు చేసినదేమిటో చేస్తున్నదేమిటో మనిషి అర్థం చేసుకోలేడు. కాబట్టి దాన్ని గురించి ఆందోళన చెందడం మానుకొని తన స్వంత కార్యాల్లో ఏదో సంతోషాన్ని వెతికేందుకు ప్రయత్నించడం మంచిదంటాడు (వ 12,13,22 చూడండి). 11వ వచనంలో అర్థవంతమైన మాటలున్నాయి – “ఆయన అనంత యుగాలను గురించిన ఆలోచన మనుషుల హృదయంలో ఉంచాడు”. ఈ కాలానికి సంబంధించినవి, నిలిచివుండనివి, గతించిపోయేవి అయిన విషయాలు మన హృదయాన్ని సంతృప్తి పరచలేవు.

11. దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.

12. కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసి కొంటిని.

13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చు కొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.

14. దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.

దేవుని పట్ల భయభక్తులు అన్న అంశంపై సొలొమోను అనేక మార్లు రాశాడు (ప్రసంగి 5:7; ప్రసంగి 7:18; ప్రసంగి 8:12-13; ప్రసంగి 12:13; సామెతలు 1:7; సామెతలు 9:10; సామెతలు 15:33). మనుషులకు భయభక్తులు కలగాలనేది ఈ ప్రపంచంలో దేవుడు జరిగించే చర్యలకున్న మూల కారణాలలో ఒకటి. దేవునికి అనుకూలంగా ఉన్న జీవితానికి ఇదెంతో ముఖ్యం (ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; కీర్తనల గ్రంథము 130:3-4 నోట్స్‌). సొలొమోను దృష్టిలో అర్థరహితం కాని ఏకైక విషయం ఇదే. ఎందుకంటే ఇది సూర్యునికి పైగా ఉన్నవానికి చెందినది కాబట్టి.

15. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును; జరుగబోవునది పూర్వమందు జరిగినదే; జరిగిపోయినదానిని దేవుడు మరల రప్పించును.

16. మరియు లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను.

బైబిల్లో ఆలోచనాపరులైన వ్యక్తులెందరి మనస్సులనో కలవరపెట్టిన విషయం అన్యాయం (యోబు 24:1-12; కీర్తనల గ్రంథము 10:1-12; కీర్తనల గ్రంథము 73:2-12; హబక్కూకు 1:2-4). మనిషి చేసే అన్యాయానికి జవాబు దేవుని న్యాయమైన తీర్పులూ, మనుషుల అక్రమమైన తీర్పులను తలక్రిందులు చేయడమూ అని సొలొమోనుకు తెలుసు. అయితే ఇది ఎప్పుడు, ఎలా జరుగుతుందో గ్రహించలేదు. ఇప్పుడు క్రైస్తవులకైతే ఈ విషయం తెలుసు.

17. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయ మున్నదనియు, నీతిమంతుల కును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.

18. కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అను కొంటిని.

వచనం 18లో (ప్రసంగి 2:1, ప్రసంగి 2:15 లో కూడా) సొలొమోను మాటలను జాగ్రత్తగా గమనించండి – “నేను అనుకున్నాను”. ఈ వచనాలు, ఈ పుస్తకంలో మరి కొన్ని వచనాలు, దేవుని నుంచి అతనికి వెల్లడైన సంగతులు కావు. తన మానవ జ్ఞానంతో తాను గమనించిన వాటిని అతను రాస్తున్నాడు. సొలొమోను ఏమనుకున్నాడో దానిలో మనం మన సిద్ధాంతాలను సేకరించుకోరాదు గాని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేసినదానిలోనుంచి మాత్రమే. చివరికి సొలొమోనుకు 21వ వచనంలోని ప్రశ్నకు జవాబు దొరికింది. దీన్ని ప్రసంగి 12:7 లో వెల్లడి చేశాడు. మనిషి మాత్రం దేవుని సహాయం లేకుండా తన స్వంత తెలివి తేటలతో చావు తరువాత ఏమౌతుంది అనే ప్రశ్నకు జవాబు తెలుసుకోలేడు. దేవుడు తానే ఇది వెల్లడి చేయాలి. దీని గురించి ఆయన వెల్లడించిన సత్యాలు పాత ఒడంబడికలో కొంతవరకు, క్రొత్త ఒడంబడికలో సంపూర్ణంగాను మనకు లభ్యమయ్యాయి (యోబు 10:21-22; కీర్తనల గ్రంథము 16:9-11; కీర్తనల గ్రంథము 49:15; యెషయా 26:19; దానియేలు 12:2-3; 2 తిమోతికి 1:10).

19. నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.

20. సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.

21. నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును?

22. కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము.Shortcut Links
ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |