Ecclesiastes - ప్రసంగి 7 | View All

1. సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.

తన జీవితమే అర్థం లేనిదని సొలొమోను నమ్మకం (వ 15). అయినప్పటికీ అవివేకం కంటే జ్ఞానమే మేలనీ, వ్యవహారాలను చూచేందుకూ క్షణికమైన ఈ బ్రతుకును వెల్లడి చేసేందుకూ జ్ఞానయుక్తమైన పద్ధతి ఉందనీ నిశ్చయించు కొన్నాడు. కాబట్టి తన దృష్టిలో జ్ఞానమార్గమేదో దాన్ని వివరించడం ఆరంభిస్తున్నాడు. ఈ పుస్తకం చివరివరకు ఇదే అంశం కొనసాగుతూ ఉంది. ప్రసంగి 4:2-3; ప్రసంగి 6:3.

2. విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.

చావు గురించిన ఆలోచనను జ్ఞానవంతులు త్రోసిపుచ్చరు. దాన్ని ఎదుర్కొని తద్వారా నేర్చుకోగలిగే పాఠాలను నేర్చుకొంటారు.

3. నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును.

మనుషులు ఏ మాత్రం ప్రయోజనం లేని సుఖభోగాల వెంట పరుగులు పెట్టడంకంటే వారి హృదయంలో జ్ఞానం అంకురించడం ముఖ్యం. సుఖం తాత్కాలిక ఆనందాన్ని కలగజేయవచ్చు గాని దుఃఖం మరి ఏదీ నేర్పించలేనంత చక్కగా మనిషికి ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది.

4. జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును.

5. బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు.

6. ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము.

7. అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు; లంచము పుచ్చుకొనుటచేత మనస్సు చెడును.

8. కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు

9. ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.
యాకోబు 1:19

10. ఈ దినములకంటె మునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు; ఈ ప్రశ్నవేయుట జ్ఞానయుక్తము కాదు

11. జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము.

ప్రసంగి 1:15. దేవుడు చేసిన దానిని మనిషి మార్చి వేయలేడు. దేవుడు ఏమేమి చేయబోతాడో ఎవరూ చెప్పలేరు (ప్రసంగి 3:11; ప్రసంగి 8:17; రోమీయులకు 11:33). ఒక ప్రజకు, ఒక స్థలానికి ఏది న్యాయమో, ఏది యుక్తమో, ఏది తగినదో, దాన్ని బట్టి తన సంపూర్ణ జ్ఞానం చొప్పున దేవుడు మంచి కాలాలను లేక మంచివి కాని కాలాలను కలుగజేస్తూ ఉంటాడు. మనుషులు తమ మార్గాలను జాగ్రత్తగా చూచుకొని తనవైపు తిరిగి అన్ని మేళ్ళూ దయచేసేది తానే అని గుర్తించి తనపట్ల భయభక్తులు కలిగి తనను మాత్రమే నమ్మి సేవించాలని దేవుని కోరిక.

12. జ్ఞానము ఆశ్ర యాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.

13. దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును?

14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు.

15. నా వ్యర్థసంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని; నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై యుండియు చిరాయువులైన దుష్టులును కలరు.

యోబుకు తెలిసినదీ, యోబు స్నేహితులు గ్రహించలేకపోయినదీ అయిన సత్యం 15వ వచనంలో ఉంది (యోబు 21:4-34). కొన్ని సార్లు మంచివాళ్ళు యువదశలో చనిపోవడమూ, దుర్మార్గులు పండు ముసలితనం వరకు బ్రతకడమూ జ్ఞానవంతుడైన సొలొమోనుకు బాగా తెలుసు. బహుశా కొందరు న్యాయవంతులు దుర్మార్గుల చేతిలో మరణిస్తారని కూడా సొలొమోను భావం కావచ్చు.

16. అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధిక ముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసి కొందువు?

16వ వచనంలో కవి భావమేమిటో స్పష్టంగా లేదు. ఒకవేళ స్వనీతిని గురించీ, జ్ఞానినని మిడిసిపడ్డ సంగతి గురించీ హెచ్చరిస్తున్నాడేమో, లేక తన మానవ జ్ఞానం సహాయంతో తప్పుడు అభిప్రాయానికి వచ్చాడేమో. ఈ పుస్తకంలో మనుషులకు ఏది మంచిది అన్న విషయం గురించి సొలొమోను అభిప్రాయాలే ఉన్నాయి. దేవుని ఉద్దేశాలు కావు, సొలొమోను రాసిన దానంతటినీ దేవుడు క్రీస్తు ద్వారానూ, ఇతర రాయబారుల ద్వారానూ వెల్లడి చేసినదానితో సరిపోల్చుకోవాలి. సొలొమోను మాటలకు అర్థం ఇది కావచ్చు – ఇలాంటి అర్థం లేని దుష్ట ప్రపంచంలో అందరూ న్యాయ నియమాలను అనుసరించి ప్రవర్తించాలని ఎవరైనా పట్టు విడవకుండా నొక్కి చెపుతూ ఉంటే అతను మనుషుల ద్వేషానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. అతని ప్రాణమే పోయే ప్రమాదం ఉంది (యెషయా 59:15). మనుషులకు నీతిన్యాయాలు కావాలని ఇష్టం లేకపోతే వాటిని బలవంతంగా వాళ్ళ నెత్తిన రుద్దడం నిష్ ప్రయోజనం, అపాయకరం (మత్తయి 7:6 చూడండి) మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఎంత నీతిన్యాయాలతో బ్రతకగలిగితే అంత మంచిది గాని మన న్యాయ నియమాల గురించి ఏమీ లెక్క చెయ్యని వారిని తప్పులెన్నుతూ, విమర్శిస్తూ ఉండకూడదు. ఎక్కువ దుర్మార్గత, మూర్ఖత్వం ఇంకా ప్రమాదకరం (వ 17). అవి మనుషుల కోపాన్ని, దేవుని కోపాన్ని కూడా మనమీదికి తెచ్చి పెడతాయి. నిజంగా దేవునిపట్ల భయభక్తులున్న మనిషి తాను అవలంబించవలసిన సరైన మార్గమేదో తెలుసుకోగలుగుతాడు (వ 18).

17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు;నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు?

18. నీవు దీని పట్టుకొనియుండుటయు దానిని చేయివిడువకుండుటయు మేలు; దేవునియందు భయభక్తులు గలవాడు వాటినన్నిటిని కొనసాగించును.

19. పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము.

20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.
రోమీయులకు 3:10

21. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము.

22. నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి యున్నది గదా.

23. ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను.

ప్రసంగి 1:17. సొలొమోను జ్ఞానాన్ని ఆర్జించలేకపోయాడు కాబట్టి ఇతని ఆలోచనలు కొన్ని జ్ఞానయుక్తమైనవి కావు. ప్రసంగి 6:12; ప్రసంగి 8:17 కూడా చూడండి.

24. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు

25. వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుట కును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితన మనియు గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని.

26. మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.

27. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది.

తన జీవితాన్నంతా ధారపోసి ఇతడు వెతికినది దీనికోసమే.

28. అదేదనగా వెయ్యిమంది పురుషు లలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు.

ఇది సొలొమోను అనుభవసారంలోనుంచి వెలువడిన మాట (1 రాజులు 11:1-4). అయితే సొలొమోను వెంటబడిన స్త్రీలు సరైన రకం కాదు. వారిలో మంచి లక్షణాలను అతడు కనుక్కోలేకపోయాడంటే ఆశ్చర్యం లేదు. ఇది స్త్రీలందరినీ ఉద్దేశిస్తూ దేవునిమూలంగా వెల్లడి అయిన సత్యం కాదని మనం గ్రహించాలి.

29. ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.

ఆదికాండము 1:26-27, ఆదికాండము 1:31; ఆదికాండము 3:1-7. మానవుడు పాపంలో పడిపోయిన రోజునుంచి అందరూ దేవునితో నిమిత్తం లేకుండా తమ స్వంత పద్ధతుల్లో సంతృప్తిని వెతుకుతున్నారు.Shortcut Links
ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |