Song of Solomon - పరమగీతము 1 | View All

1. సొలొమోను రచించిన పరమగీతము.

“పరమ గీతం”– హీబ్రూ భాషలో ఈ పదాలు “గీతాలకు గీతం” అని అర్థమిస్తుంది. రాజులకు రాజు అంటే రాజులందరిలోకీ గొప్ప రాజని అర్థమిచ్చినట్టుగానే “గీతాలకు గీతం” గీతాలన్నిటిలోకి గొప్పదని అర్థం. ఒకవేళ క్రీస్తు ఈ గీతంలో లేకుంటే ఇది బైబిలంతటిలోకీ (వేరే సాహిత్యాలన్నిటిలోకి కూడా) గొప్పది ఎలా అవుతుంది? అన్నిటిలో అతి శ్రేష్టమైన విషయం గురించీ, ఫ్రౌఢమైన, పవిత్రమైన పదజాలంతో రాసివున్నదాన్నే పరమగీతం అనాలి. బైబిల్లో గానీ మరెక్కడైనా గానీ క్రీస్తుకు తన ప్రజలపట్ల ఉన్న ప్రేమ పరమశ్రేష్టం. ఈ పరమగీతంలో ఉన్నది కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ పరవశమేనని కొందరు భావిస్తారు. అయితే అలాంటి ప్రేమ కంటే తన ప్రజల పట్ల క్రీస్తు ప్రేమ ఎంతో రమణీయమైనది, గొప్పది.

2. నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.

ఇక్కడ మాట్లాడుతున్న ఆమె క్రీస్తు స్వంత జనమందరికీ ప్రతినిధిగా మాట్లాడుతున్నది. క్రీస్తు సమీప సహవాసాన్నీ, ఆయన ప్రత్యక్షమైన ప్రేమనూ అనుభవించాలన్న వారి లోతైన అభిలాషను చూపిస్తూ ఉంది. ఆయన ప్రేమ ద్రాక్షరసం గానీ మరి ఏ ఇతర పానీయం గానీ శరీరానికి కలిగించే చురుకుదనం, ఉత్సాహం కంటే, ఎన్నో రెట్లు ఎక్కువైన ఉల్లాసాన్నీ, ఉత్తేజాన్నీ మనసుకూ ఆత్మకూ కలిగిస్తుంది.

3. నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు.

ఇక్కడ “పేరు” ఒక వ్యక్తి స్వభావాన్నీ లక్షణాలనూ సూచిస్తున్నది. పాత ఒడంబడికలో యెహోవా అనే పేరు, క్రొత్త ఒడంబడికలో యేసు అనే పేరు పరలోకం నుంచి భూమిమీదికి ఒలికి ప్రపంచవ్యాప్తంగా పరిమళాలను విరజిమ్మిన సుగంధ తైలాలు. నిర్గమకాండము 30:22-38; కీర్తనల గ్రంథము 45:8; మత్తయి 26:6-13 పోల్చిచూడండి. ఆధ్యాత్మికంగా పవిత్రులు (ఇక్కడ “కన్యలు” ఇలాంటివారికి సూచన) దేవుణ్ణే అన్నిటికంటే పైగా, ఎక్కువగా ప్రేమిస్తారు.

4. నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె దము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించు చున్నారు.

పరలోక రాజు తానే వచ్చి మనలను తనతో ఏకాంత సహవాసానికి ఆకర్షించకపోతే మనం ఎన్నటికీ అందులోకి చేరము (యోహాను 6:44). ఆ పనంతా ఆయనదే. అయితే ఆయనతో ప్రేమ పూర్వకమైన సహవాసాన్ని ఆతురతగా, ఇష్టపూర్వకంగా కోరుకునే మనస్సు మనకు ఉండాలి. “నన్ను...మనం”– ఈ గీతంలో కొన్ని సార్లు విశ్వాసులందరూ ఒకటిగా – ఒక వధువుగానూ, మరి కొన్ని సార్లు ఒక వ్యక్తుల సమూహంగానూ కనిపిస్తారు. కీర్తనల గ్రంథము 45:14-15; ప్రకటన గ్రంథం 19:7-8 పోల్చిచూడండి. “నిన్ను ప్రేమించడం”– పరలోక రాజును ప్రేమించడం కంటే విశ్వాసులకు తగిన విషయం మరొకటి లేదు.

5. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను

జెరుసలం కుమార్తెలంటే వ 3లో కనిపించే “కన్యలు”, వ 4లో మాట్లాడిన “చెలికత్తెలు” కావచ్చు. ఇందులో మనమేమీ ఖచ్చితంగా చెప్పలేము. “నలుపు”– ఆదికాండము 25:12-13 లో కేదారు ప్రసక్తి ఉంది. వారు గుడారాలను నల్ల మేకల బొచ్చుతో నేసేవారు. విశ్వాసులు పాపాత్ములే గాని పవిత్రులు కూడా. దేవుడు మనిషిని తన పోలికలో చేశాడు (ఆదికాండము 1:26). అందువల్ల ఆరంభంలో వారిలో ఆధ్యాత్మిక సౌందర్యం ఉంది. అయితే తాము పాపంవల్ల చెడిపోయామనీ తమకిప్పుడున్న ఆధ్యాత్మిక సౌందర్యం క్రీస్తుతో తమ సంగమం వల్లే అనీ విశ్వాసులకు తెలుసు. వారి సౌందర్యమంతా దేవుడు ఉచితంగా ఇచ్చినదే (యెషయా 61:10; 1 కోరింథీయులకు 1:30; 2 కోరింథీయులకు 5:21; ఎఫెసీయులకు 4:22-24). ఇక్కడ వధువు అంటున్న మాటల్లో కొద్దిగా ఆందోళన ఉన్నట్టుగా కనిపిస్తుందా? పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది అని తరువాత ఆమెకు తెలిసివస్తుంది (1 యోహాను 4:18).

6. నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.

“నల్ల పిల్ల”– “సూర్యమండలం క్రింద” జీవితం (ప్రసంగి 1:3, ప్రసంగి 1:14; మొ।।) మన స్వభావాలను నల్లగా చేసింది (ఆదికాండము 8:21; యిర్మియా 17:9; రోమీయులకు 3:9-19). ఇందువల్ల తమ వంక ఎవరన్నా ఆమోద భావంతో ఆశ్చర్యంతో చూడవలసిన ఆకర్షణీయమైనదేదీ తమలో లేదని విశ్వాసులు గ్రహిస్తారు. విశ్వాసులకున్న అందం వారి స్వంతం కాదు. క్రీస్తు అందం వారిలో ప్రతిబింబిస్తున్నది, అంతే. “కోపగించారు”– యెషయా 66:5; యోహాను 15:17; మొ।।. “ద్రాక్షతోట”– ఇది విశ్వాసి వ్యక్తిగత జీవితానికి గుర్తుగా ఉంది. ఇతర విషయాలతో తల మునకలైపోతూ దేవునితో మన సహవాసాన్నీ మన ఆధ్యాత్మిక జీవితాన్నీ నిర్లక్ష్యం చేసి మన బ్రతుకును పాడుబడిపోయిన తోటలాగా చేసుకునే అవకాశం ఉంది.

7. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను?

విశ్వాసులు ఎప్పుడూ క్రీస్తు సాన్నిహిత్యాన్నీ ప్రేమనూ అనుభవించాలని కోరుతారు. ఆయన వారినెన్నడూ విడిచిపెట్టడు (హెబ్రీయులకు 13:5; యోహాను 14:16-18; మత్తయి 28:20). అయితే ఆయన సాన్నిహిత్యం, ప్రేమల గురించి వారి అనుభవానికి ఆటూ పోటులున్నట్టు కనిపిస్తుంది. ఒక్కోసారి అయితే వారి అనుభవంలో క్రీస్తు పూర్తిగా వారిని వదిలివెళ్ళిపోయినట్టుంటుంది. మన స్వంత తోటను కాపాడుకోకపోతే ఇలా జరగడానికి అవకాశాలు ఎక్కువౌతాయి. ఇలాంటిది సంభవించినప్పుడు ఆయన్ను హృదయపూర్వకంగా వెతకాలి (హోషేయ 10:12; యిర్మియా 29:13).

8. నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము.

మనం జాగ్రత్తగా వెతికితే క్రీస్తు తన మందగా ఉన్న విశ్వాసులను ఎక్కడికి తీసుకు వెళ్ళాడో కనిపిస్తుంది. అప్పుడు ఆ పవిత్రుల అడుగు జాడల్లో మనమూ వెళ్ళవచ్చు. క్రీస్తు నియమించిన సంఘ కాపరుల సహవాసంలోనూ, ఆయన మందను మేపడం ద్వారానూ ఆయన్ను మనం తిరిగి కలుసుకుంటాం (యోహాను 21:15-17; యోహాను 14:21). ఇక్కడ వధువును “అతిలోక సౌందర్యవతీ” అని అభివర్ణించడం గమనించండి (పరమగీతము 1:15; పరమగీతము 2:14; పరమగీతము 4:1, పరమగీతము 4:7; పరమగీతము 6:4; పరమగీతము 7:1, పరమగీతము 7:6; కీర్తనల గ్రంథము 45:11 కూడా చూడండి). లోకమంతటిలోనూ క్రీస్తు దృష్టిలో ఆయన సంఘమే అత్యంత సౌందర్యవంతమైనది. ఆయన దానిని ప్రేమ దృక్కులతో చూస్తాడు. ఇకముందు తన కృప మూలంగా ఆమె ఏమి కానున్నదో చూస్తాడు (ఎఫెసీయులకు 5:26-27). దేవుడు ఆమెకిచ్చిన అందాన్ని చూస్తాడు. విశ్వాసులు క్రీస్తులోనివారే. ఆయనతో ఐక్యమై ఉండడంవల్ల ఆయనకున్నదంతా వారిదే.

9. నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను.

గతంలో ఈజిప్ట్ గుర్రాలు చూపులకు ఇంపుగాను, మంచి శిక్షణ గలిగిన ఉత్తమాశ్వాలుగానూ ఉన్నాయి. వాటిని ఇతర దేశాలవాళ్ళు కొనుక్కొన్నారు (1 రాజులు 10:28-29). ఈజిప్ట్ రాజు ఉపయోగించేవి శ్రేష్ఠాతిశ్రేష్ఠమైన గుర్రాలు. వాటికి ఎక్కువ అలంకరణ, అందం ఉండేవి. సామెతలు 1:19; యెషయా 61:1-3; యెహెఙ్కేలు 16:9-14; 1 తిమోతికి 2:9-10; 1 పేతురు 3:3-4 పోల్చిచూడండి.

10. ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి.

11. వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము

12. రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను.

విశ్వాసులు పరలోక రాజు భోజన బల్ల దగ్గర కూర్చుంటారు (ప్రకటన గ్రంథం 3:20; 1 కోరింథీయులకు 10:16-17). క్రీస్తుతో సహవాసం చేసే విశ్వాసులు ఆయనకు ఇంపైన పరిమళంగా ఉంటారు.

13. నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు

క్రీస్తు తన విశ్వాసుల పాలిట మరింత మధురమైన సువాసన, లోకంలోని అత్యుత్తమ పరిమళం శరీరానికి ఎలాగో, క్రీస్తు సన్నిధి వారి ఆత్మకు అలాగే.

14. నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు.

15. నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు.

“సౌందర్యవతి”– వ 8. “ప్రియసఖీ”– వ 9; పరమగీతము 2:2; పరమగీతము 4:1, పరమగీతము 4:7; పరమగీతము 7:6. ప్రేమ పెల్లుబికే ఈ మాటలు, లాలించే ఈ పలుకులు తన సంఘంపైనా, ప్రతి విశ్వాసి పైనా క్రీస్తుకున్న గొప్ప ప్రేమను సూచిస్తున్నాయి (యోహాను 13:1; యోహాను 14:21; యోహాను 15:9; యోహాను 17:1-26; రోమీయులకు 5:8; గలతియులకు 2:20; ఎఫెసీయులకు 5:1-2, ఎఫెసీయులకు 5:25; 1 యోహాను 3:16; 1 యోహాను 4:16). విశ్వాసికీ క్రీస్తుకూ మధ్య ఉన్న సంబంధం అంతా పరస్పర ప్రేమ, ఒకరికి ఒకరు ఇచ్చుకొనే మనసు, ఒకరిలో ఒకరు ఆనందించడంతో కూడి ఉంది. “గువ్వ కండ్లు”– గువ్వ దేవుని పవిత్రాత్మకు గుర్తు (మత్తయి 3:16). ఇది పవిత్రాత్మ దివ్యత్వం, నిర్దోషత్వం, ఆధ్యాత్మిక సౌందర్యాలను సూచిస్తూ ఉంది. విశ్వాసుల కళ్ళల్లో పవిత్రాత్మ ప్రకాశం కనబడాలి. గువ్వ కండ్లు కలిగి ఉండే ఏకైక మార్గం ఇదే.

16. నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు మన శయనస్థానము పచ్చనిచోటు

క్రీస్తు తమలో చూచే అందం కంటే విశ్వాసులకు ఆయనలోనే ఎక్కువ సౌందర్యం కనిపిస్తుంది (కీర్తనల గ్రంథము 45:2). “పచ్చని”– కీర్తనల గ్రంథము 23:2; యెషయా 51:3.

17. మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు మన వాసములు సరళపు మ్రానులు.

విశ్వాసులకు హాని కలిగించే వాటన్నిటి నుంచీ వారు దాక్కోదగిన చోట ఉంది (కీర్తనల గ్రంథము 121:5-6). ఆ చోటు అనంతుడైన దేవుని ఆనందం వారితో కలిసి సహ జీవనం చేయడమే (నిర్గమకాండము 25:8 చూడండి.)Shortcut Links
పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |