Song of Solomon - పరమగీతము 2 | View All

1. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను.

హీబ్రూ పదాలను బట్టి చూస్తే ఈ మాటలు అంటున్నది వధువో, వరుడో స్పష్టంగా లేదు. అయితే తరువాతి వచనంలో వరుడు వధువును కలువతో పోల్చాడు కాబట్టి ఇక్కడ మాట్లాడేది వధువే కావచ్చు. విశ్వాసులు తమకు తాము బలహీనులే, పువ్వుల్లాగా వాడిపోయి ఎండిపోయేవారు (యెషయా 40:6-8; 1 పేతురు 1:24). మైదానాల్లో, లోయల్లో పూసే పువ్వుల్లాగా దీనస్థితిలో ఉన్నారు. అయితే దేవుడు వారికిచ్చిన అందం, పరిమళం మూలంగా దేవునికి సువాసనగా ఆనంద కారణంగా ఉన్నారు.

2. బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది.

“నా ప్రియసఖి”– క్రీస్తు దృష్టిలో మనుషుల్లో అందంగా పరిమళంగా ఉన్నది ఆయన సంఘం మాత్రమే ఇతరులంతా ముండ్లలాగా, అంటే బాధకరంగా, వికారంగా, హానికరంగా ఉన్నారు (సంఖ్యాకాండము 33:55; న్యాయాధిపతులు 2:3; 2 సమూయేలు 23:6; యెషయా 24:4-5; యెషయా 33:12; మత్తయి 7:16; లూకా 8:14; హెబ్రీయులకు 6:8; రోమీయులకు 8:7-8).

3. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.

“చెట్ల”– కేవలం వాడిపోయి ఎండిపోయే పువ్వులాంటి వాడు కాదు క్రీస్తు. యెష్షయి వేరునుంచి పెరిగిన పండ్ల చెట్టులాంటి వాడాయన (యెషయా 11:1, యెషయా 11:10; యెషయా 53:2; రోమీయులకు 15:12). ఆయన ప్రజలకు ఆయనే నీడ (కీర్తనల గ్రంథము 91:1; కీర్తనల గ్రంథము 121:5; యెషయా 25:4; యెషయా 32:2). ఆయన జీవవృక్షం. ఆ వృక్షఫలం శాశ్వతమైన పాపవిముక్తి, ఆనందం, ఎన్నటికీ తరగని సంతృప్తి. ఆయన ఫలం మన నోటికి రుచించకుండా పోయేంతగా మన కోరికలు ఈ లోకంలోని చెడు ఫలాల మూలంగా భ్రష్టమైపోయాయా?

4. అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.

“విందుశాల”– కీర్తనల గ్రంథము 23:5; ప్రకటన గ్రంథం 3:20. దేవుని కుమారుడు ఇచ్చే విందు ఎలా ఉంటుందో చేతనైతే ఊహించుకోండి. “ప్రేమను పతాకంగా”– పతాకం అంటే గర్వంతో లేక ఉత్సాహంతో అందరికీ కనిపించేలా ఎత్తేది, స్పష్టంగా వెల్లడి అయ్యేది (రోమీయులకు 5:8; గలతియులకు 2:20 పోల్చిచూడండి). క్రీస్తు తన పట్ల చేసేవాటన్నిటిలోనూ ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

5. ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి

సంపూర్ణమైన క్రీస్తు ప్రేమానుభవానికి మానవ స్వభావం తట్టుకోలేక పోవచ్చు. ఇతరులు (జెరుసలం కుమార్తెలు) చేసే ప్రయత్నాల వల్ల ఇలాంటి అనుభవాలు రావు. క్రీస్తు నియమించే సమయంలోనే ఆయన పద్ధతి ప్రకారమే అవి కలగగలవు.

6. అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు.

7. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

8. ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు.

వధువు అనుభవం ఇదే. దివ్య వరుడు దగ్గరగా ఉన్నాడు. తరువాత ఆయన కొండల్లోకి వెళ్ళిపోయాడు అయితే త్వర త్వరగా తిరిగి వస్తున్నాడు. ఇందుకు కారణమేది ఇక్కడ కనిపించదు. అయితే క్రీస్తుతో మన సహవాస సంబంధం గనుక తెగిపోతే ఒకవేళ అందుకు కారణం అంటూ వెదికితే మనలోనే వెదకాలి, ఆయనలో కాదు (యెషయా 59:1-2; హోషేయ 5:6). విశ్వాసులు తమ కోరిక చొప్పున ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని, సాన్నిహిత్యాన్ని అనుభవించరు. ఒక్క సారి ఆయన్ను చూస్తే చాలు వారిలో ఆతురత ఎదురు తెన్నులు పెరుగుతాయి.

9. నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీకంతగుండ తొంగి చూచుచున్నాడు

10. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు

యిర్మియా 31:3; ద్వితీయోపదేశకాండము 4:37. వరుడు ప్రేమ భాషలో కావ్యరూపంలో వధువుతో వలపు మాటలు పలుకుతూ ఆమెను ఆకర్షించే వాటన్నిటినుంచి ఆమె దృష్టిని మరలించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమెను ఏవేవో అందాల్లోకీ, ఆనంద గానాల్లోకీ తనతో గాఢమైన సహజీవనంలోకీ రమ్మని పిలుస్తున్నాడు. తుదకు తన సన్నిధిలో శాశ్వత నివాసానికి ఆమెను ఆహ్వానిస్తాడు (యోహాను 14:2-3; యోహాను 17:24; 1 థెస్సలొనీకయులకు 4:16-18).

11. నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.

12. దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.

13. అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము

14. బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.

క్రీస్తు సంఘం పావురంలాంటిది. పవిత్రాత్మ మూలంగా అది పుట్టింది. యుగయుగాల శిల అయిన క్రీస్తులో అది దాగి ఉంది (నిర్గమకాండము 33:21-22; ద్వితీయోపదేశకాండము 32:4). ఆయనకు తన విశ్వాసులు ఎంత ప్రియమైన వారంటే వారి ముఖాలు చూడాలనీ వారి మాటలు వినాలనీ ఆయన తహతహలాడుతాడు మనల్ని ప్రార్థనకూ స్తుతికీ పురిగొలిపే దైవ ప్రేరితమైన బైబిలు లేఖనాల వెనుక ఉన్న ఒక పరమార్థం ఇదే గదా.

15. మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి.

పరమగీతము 1:6. చేయవలసినది చేయకపోవడం, చేయకూడనిది చెయ్యడం, ఇలాంటి అన్ని పాపాలూ క్రీస్తులో విశ్వాసుల జీవితాన్నీ ఆయనతో సహవాసాన్నీ పాడు చేస్తాయి. ఇలాంటివాటి విషయం విశ్వాసులు జాగ్రత్త వహించాలి. అవి “చిన్న” పాపాలుగానే కనిపించవచ్చు. అయితే అంత పెద్ద నష్టం కలిగించే వాటిని చిన్న పాపాలని ఎలా అనగలం? “ద్రాక్ష తోట”– కీర్తనల గ్రంథము 80:15; యెషయా 5:1-5; యిర్మియా 12:10; లూకా 20:9-16 (ద్రాక్షతోట ఇంత భయంకరంగా శిధిలమై పోవచ్చు.)

16. నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు

పరమగీతము 6:3; పరమగీతము 7:10. తాము క్రీస్తుకూ, క్రీస్తు తమకూ శాశ్వతంగా చెంది ఉంటారన్న మధురమైన నిశ్చయత విశ్వాసులకు ఉండాలి (యోహాను 17:6; రోమీయులకు 7:4; రోమీయులకు 8:38-39; 1 కోరింథీయులకు 3:21-23). ఇది నిజమో కాదో అనే సందేహంలో వారు ఉండిపోకూడదు.

17. చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద త్వరపడి రమ్ము.

మళ్ళీ మళ్ళీ క్రీస్తు తన్ను విడిచి దూర పర్వతాలకు వెళ్ళిపోతూ ఉన్నట్టు ఉంటే విశ్వాసి ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రేమను ఒక సారి రుచి చూశాక ఇది గాక మరింకేది అతణ్ణి తృప్తి పరచగలదు?Shortcut Links
పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |