Song of Solomon - పరమగీతము 6 | View All

1. స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడేదిక్కునకు తిరిగెను?

క్రీస్తు సహవాసం కోసం మనలోని అభిలాషలూ, ఆయన గుణాలను గురించి మనం చేసే స్తుతులూ ఇతరులు ఆయన్ను వెదికేందుకు పురికొలుపుతాయి.

2. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను.

3. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.

4. నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు దానవు

ఈ పరమ గీతమంతటిలోను ఆయన ఈమెను గురించి ఆలోచిస్తూ ఉన్నంతగా ఆమె ఆయన్ను తలచుకోవడం కనిపించదు. ఇతర విషయాలు ఆమెను ఆకర్షిస్తాయి గాని ఆయన ధ్యాస మాత్రం అంతా ఆమెమీదే. ఈ లోకంలో ఉన్న తన సంఘం పై క్రీస్తుకు ఉన్న ప్రేమ, సంఘానికి క్రీస్తు పై ఉన్న ప్రేమ కంటే చాలా ఎక్కువ. మనం ఆయన్ను ప్రేమించాలన్న దానికి ఆయన ప్రేమ ఆదర్శం. “తిర్సా”– ఈ పదానికి అర్థం “సౌక్యం”, “అందం”. తరువాతి కాలంలో ఉత్తర ఇస్రాయేల్ రాజ్యానికి మొదటి రాజధానిగా ఈ పట్టణాన్ని ఎన్నుకొన్నారు (1 రాజులు 14:17; 1 రాజులు 15:21, 1 రాజులు 15:33; 1 రాజులు 16:6, 1 రాజులు 16:23). ఇది చాలా సుందర స్థలమని దీనివల్ల తెలుస్తున్నది. “జెరుసలం”– కీర్తనల గ్రంథము 48:2; కీర్తనల గ్రంథము 50:2. “సైన్యం”– క్రీస్తు సంఘం కూడా బలమైన ఆధ్యాత్మిక సైన్యం.

5. నీ కనుదృష్టి నామీద ఉంచకుము అది నన్ను వశపరచుకొనును నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకలమందను పోలియున్నవి.

ఈ వచనాలు పరమగీతము 4:1-3 లాగా ఉన్నాయి. ఆమె ప్రేమతో చూచిన చూపు ఆయన భరించలేనంత ప్రేమను ఆయనలో రేకెత్తిస్తుంది (వ 5; పరమగీతము 4:9).

6. నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టు కొనక సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నవి.

7. నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె అగపడుచున్నవి.

8. అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్ను లును లెక్కకు మించిన కన్యకలును కలరు.

మానవ చరిత్ర అంతటిలోనూ పాత ఒడంబడికలోని ఇస్రాయేల్ ప్రజకూ, క్రొత్త ఒడంబడికలోని క్రీస్తు సంఘానికీ గొప్ప ప్రత్యేకత, విశిష్ఠత ఉన్నాయి (నిర్గమకాండము 19:5-6; ద్వితీయోపదేశకాండము 7:6; కీర్తనల గ్రంథము 135:4; యోహాను 17:6, యోహాను 17:9; తీతుకు 2:14; 1 పేతురు 2:9-10). వేలకొలది జాతులు, ప్రజలు, సమాజాలు, సంస్థలు ఈ లోకంలో ఉన్నాయి గానీ క్రీస్తు వధువుగా ఉండదగ్గది క్రీస్తు సంఘం ఒకటే. దానికి ఎంత ధన్యత!

9. నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.

10. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?

క్రీస్తు దృష్టిలో సృష్టిలోని అత్యంత రమణీయమైన, వైభవమైన వాటితో సమానమైన అందం గలది ఆయన సంఘం. దేవుని కృప, మహిమ దానిలోనే ఉన్నాయి.

11. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో దాడిమవృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్లితిని.

ఈ మాటలు అంటున్నది ఎవరు? 13వ వచనాన్ని బట్టి చూస్తే వధువే. హీబ్రూలో 12వ వచనానికి అర్థం స్పష్టంగా లేదు. కాబట్టి అసలు అర్థం, భావార్థం కూడా అంతే. 11వ వచనంలో తన తోట ఎదిగి ఫలించాలని ఆమె కుతూహల పడుతున్నట్టు ఉంది (పరమగీతము 1:6 పోల్చిచూడండి). క్రీస్తుకు చెందిన మన తోటను గురించి శ్రద్ధ వహించకపోతే, అంటే మన ఆధ్యాత్మిక విషయాల గురించి పట్టించుకోకపోతే క్రీస్తు మీద మనకు ఎక్కువ ప్రేమ లేదన్న మాటే.

12. తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని.

13. షూలమ్మీతీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా?

ఇక్కడ వధువును “షూలం ఊరిదానా” అని ఎందుకు పిలుస్తున్నారో ఖచ్చితంగా చెప్పలేము. హీబ్రూలో సాలొమోను పేరైన “ష్లోమో” నుండి పుట్టిన పేరై ఉండవచ్చు. ఈమె సొలొమోనుకు చెందినది అని అర్థమిచ్చేలా సాలొమోను పేరుకే స్త్రీ సమానార్థకం కావచ్చు లేదా, షూలం లేక షూనేం ఊరు సంబంధమైనది కావచ్చు. ఈ వచనంలో మొదటి భాగం వధువు వయ్యారాన్ని, అందాన్ని తేరిచూడాలని ఆశిస్తూ ఉన్న చెలికత్తెలు లేక కన్యలు పలికినది. రెండో భాగాన్ని పలికినది వరుడు. ఇది ప్రశ్నారూపకంగా ఉంది. అయితే ఆమె ఎంత అందగత్తో అందరూ తదేకంగా ఆమెనెందుకు చూస్తారో అతనికి బాగా తెలుసు. ఇక్కడి భాషను బట్టి చూస్తే ఇది ఆనందాన్ని వెల్లడి చేసే ఒక పవిత్ర రూపకం అని అనుకోవచ్చు. నిర్గమకాండము 15:20; 2 సమూయేలు 6:14-15; కీర్తనల గ్రంథము 30:11; కీర్తనల గ్రంథము 149:3; కీర్తనల గ్రంథము 150:4; యిర్మియా 31:13. రెండు శిబిరాలు లేక రెండు సేనలు అని అర్థం ఇచ్చే హీబ్రూ పదం “మహనయీం”. ఆదికాండము 32:1-2 చూడండి. పరలోక సైన్యాలు చేరువలో ఉన్నాయని తెలియజేసేందుకు కవి ఈ పదం వాడివుండవచ్చు.Shortcut Links
పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |