Isaiah - యెషయా 25 | View All

1. యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె దను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి

24 వ అధ్యాయంలో వివరించబడ్డ ఘోర విపత్తు తరువాత దేవ సంస్తుతి నిండి ఉన్న రెండు అధ్యాయాలు ఉన్నాయి. దేవుడు తన కోపంలో ఒక నగరాన్ని లేక దేశాన్ని, ప్రపంచాన్ని దండించినప్పుడు ఇది స్తుతించే కారణమేనా? దేవునితో సహవాసం ఉన్నవారు మానవులపైకి వచ్చిపడిన దురవస్థను బట్టి నొచ్చుకుంటారు (యెషయా 24:16-18). అయితే దేవుడు తన ఉద్దేశాలను నమ్మకంగా న్యాయంగా నెరవేర్చుకొంటూ, దుష్టులను దండిస్తూ విపత్కర పరిస్థితుల్లో తన ప్రజలను భద్రంగా కాపాడుకొంటూ ఉన్నందువల్ల వారు ఆయన్ను స్తుతించగలరు (యెషయా 4:5; ప్రకటన గ్రంథం 18:20; ప్రకటన గ్రంథం 19:1-5 చూడండి). ఇక్కడున్నది ఇదే. “అద్భుతాలు”– గత అధ్యాయంలో వివరించబడిన విషయాలు. “చాలాకాలం క్రితం”– యెషయా 14:24, యెషయా 14:26-27; యెషయా 23:8-9.

2. నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.

3. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి.

4. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.

విపత్కర పరిస్థితుల్లో దేవుడు తనవారిని కాపాడతాడు. కొన్నిసార్లు శారీరకంగా, కొన్నిసార్లు ఆత్మ సంబంధంగా, మరికొన్ని సార్లు రెండు విధాలుగానూ కాపాడతాడు – యెషయా 4:5-6. కీర్తనల గ్రంథము 7:1-2 నోట్స్, రిఫరెన్సులు, ‘బీదలు’ అనే పదం కీర్తనల గ్రంథంలో దేవుడంటే భయభక్తులుగల న్యాయవంతులైన పేదల విషయం.

5. ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.

6. ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును nమూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.

దుర్మార్గతను నాశనం చేయడం కంటే భూమి విషయంలో దేవునికి మరింత ఉన్నతమైన ఉద్దేశమే ఉంది. ఆయన ప్రేమమూర్తి, కృపామయుడు. ఈ వచనాల్లో విముక్తులైన మానవులకోసం ఆయన సిద్ధపరచిన భాగ్యం ఎలాంటిదో వెల్లడౌతున్నది. “ఈ కొండమీద”– జెరుసలంలోని కొండ, లేక జెరుసలం నగరం. జెరుసలంలో కల్వరి అనే కొండపై భావికాలంలో ప్రపంచంపైనా, దాని ప్రజలపైనా వర్షించబోయే ఆశీర్వాదాలన్నిటికీ తన కుమారుని మరణం మూలంగా దేవుడు పునాది వేశాడు (53 అధ్యాయం). “విందు”– ఆనందోత్సాహాలకూ, దేవునితో సహవాసానికీ, ఆధ్యాత్మిక దీవెనలకూ గుర్తు (యెషయా 55:1-2; మత్తయి 22:1-2; లూకా 14:15-16). ఈ వచనాల సందర్భం “గొర్రెపిల్ల వివాహోత్సవాన్ని” సూచిస్తున్నది (ప్రకటన గ్రంథం 19:6-7).

7. సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును
లూకా 2:32, 2 కోరింథీయులకు 3:16

“ముసుకు”– జాతులమీద పరచివున్న తెర అంటే బహుశా ఆధ్యాత్మిక అంధత్వాన్నీ మరణాన్నీ సూచిస్తాయి. 2 కోరింథీయులకు 3:14-16; ఎఫెసీయులకు 4:18. దేవుడు ఈ ముసుకును తీసేసి ఈ పర్వతం పై లోక ప్రజలందరికీ జ్ఞానోదయం కలుగజేస్తాడు (వ 6; యెషయా 2:14; యెషయా 11:9).

8. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
1 కోరింథీయులకు 15:54, ప్రకటన గ్రంథం 7:17, ప్రకటన గ్రంథం 21:4

“మృత్యువు”– 1 కోరింథీయులకు 15:54; హెబ్రీయులకు 2:14; ప్రకటన గ్రంథం 20:14; ప్రకటన గ్రంథం 21:4. భూమి పై ఉండబోయే చివరి పరిస్థితుల్లో మరణాన్ని తెచ్చిపెట్టే పాపం (రోమీయులకు 6:23) ఉండదు కాబట్టి ఆ కాలంలో మరణానికి తావు అనేది ఉండదు. “కన్నీటి బిందువులు”– ప్రకటన గ్రంథం 7:7; ప్రకటన గ్రంథం 21:4. దేవుడు ప్రేమామయుడైన తండ్రి. తన ప్రజల కన్నీటిని తన స్వహస్తాలతో తుడిచివేసి, దుఃఖకారణాలను వారి నుండి శాశ్వతంగా తొలగించి వేస్తాడు. “నింద”– యెషయా 51:7; కీర్తనల గ్రంథము 119:22, కీర్తనల గ్రంథము 119:39; మత్తయి 5:11; 1 పేతురు 4:14.

9. ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.

“మన దేవుడు”– వ 1. ఏకైక నిజ దేవుడు తమకు దేవుడుగా కలిగి ఉండనివారు ఈ దీవెనల్లో భాగం పంచుకోరు. “నమ్మకంతో”– బైబిలు అంతటిలోనూ నమ్మకానికీ పాపవిముక్తికీ మధ్యనున్న సంబంధం వెల్లడి అయింది (యెషయా 12:2; యెషయా 26:4; కీర్తనల గ్రంథము 2:12; యోహాను 5:24; అపో. కార్యములు 16:31). “ఆనందిద్దాం”– యెషయా 9:3; యెషయా 35:10; యెషయా 41:16; యెషయా 51:3; యెషయా 66:14; కీర్తనల గ్రంథము 9:2; ప్రకటన గ్రంథం 19:7.

10. యెహోవా హస్తము ఈ పర్వతముమీద నిలుచును పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు.

“మోయాబు”– 24,25 అధ్యాయాల సందర్భంలో మోయాబు బహుశా దేవుని ప్రజలకు శత్రుత్వం వహించే జాతులన్నిటికీ ప్రతినిధిగా ఉంది. యెషయా 30:31; యెషయా 34:5 పోల్చి చూడండి.

11. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును.

“గర్వం”– యెషయా 2:11-18; యెషయా 16:6.

12. మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |