Isaiah - యెషయా 41 | View All

1. ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి జనములారా, నూతనబలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.

యెహోవాదేవుడు మాట్లాడుతున్నాడు. దీనికి అర్థం ఇలా కావచ్చు – ఇతర జనాలు తమ విగ్రహాలతో, దేవుళ్ళతో ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ 40వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నదాన్ని వినాలి. తమకు చేతనైన రీతిలో బలం పుంజుకొని వచ్చి ఇష్టముంటే దేవునితో వాదించాలి.

2. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు.
ప్రకటన గ్రంథం 16:12

“తూర్పు”– అంటే ఇస్రాయేల్‌కు తూర్పు దిశ. తూర్పు నుండి వచ్చేవాడు కోరెషురాజు (వ 25; యెషయా 44:28; యెషయా 45:1, యెషయా 45:13; యెషయా 46:11). “తన...పిలిచిన”– రాజులు న్యాయవంతులైనా కాకపోయినా, ఆ విషయం వారికి తెలిసినా తెలియకపోయినా దేవుడు తన న్యాయకరమైన ఆశయాలు నెరవేర్చేందుకు వారిని వాడుకొంటాడు. ఈ వచనం ప్రకారం కోరెషును అనేక దేశాలపై పాలకుణ్ణిగా చేయడం దేవుని ఉద్దేశం. అంతేకాక బబులోను ప్రవాసంనుండి తన ప్రజలను ఇస్రాయేల్‌కు తిరిగి పంపేందుకు దేవుడు కోరెషును వాడుకున్నాడు (ఎజ్రా 1:1-4; ఎజ్రా 6:3-5).

3. అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు.

క్రీ.పూ. 546లో కోరెషు పర్షియా (ఇరాన్‌) నుండి నేటి టర్కీదేశం పశ్చిమ సరిహద్దు వరకు స్వాధీనం చేసుకున్నాడు.

4. ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.
ప్రకటన గ్రంథం 1:4-8, ప్రకటన గ్రంథం 4:8, ప్రకటన గ్రంథం 16:5

కోరెషు విజయాల వెనుక ఈ లోకంలోని సంభవాలు తన ఆధీనంలో ఉంచుకునేవాని హస్తం ఉంది.

5. ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వణకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు

కోరెషు, అతని సైన్యాలు సమీపిస్తూ ఉంటే అతడి దారిలో ఉన్న దేశాలన్నీ గడగడా వణికిపోతాయి. వారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తారు. సహాయంకోసం తమ దేవుళ్ళ వైపుకూ విగ్రహాల వైపుకూ తిరుగుతారు. అయితే వారి ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి.

6. వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు కొందురు.

7. అతుకుటనుగూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని బిగించును.

8. నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ,నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,
యాకోబు 2:23, లూకా 1:54, హెబ్రీయులకు 2:16

“సేవకుడివి”– ఇతర జాతులన్నిటికీ, ఇస్రాయేల్‌కూ ఉన్న తేడా ఇక్కడ రాసివుంది. ఇతర దేశాల్లో అక్కడక్కడ కొందరు వ్యక్తులు దేవుని సేవకులు అయి ఉండవచ్చు. అయితే ఒక్క జాతి మాత్రమే మొత్తంగా దేవుని సేవకుడుగా, ఆయన ఎన్నుకొన్నవాడుగా ఉంది (యెషయా 42:19; యెషయా 43:10; యెషయా 44:1, యెషయా 44:21; యెషయా 45:4; కీర్తనల గ్రంథము 135:4; కీర్తనల గ్రంథము 136:22; ద్వితీయోపదేశకాండము 4:20; ద్వితీయోపదేశకాండము 7:7-8; ద్వితీయోపదేశకాండము 14:1-2). “మిత్రుడు”– 2 దినవృత్తాంతములు 20:7; యాకోబు 2:23.

9. భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,
మత్తయి 12:18-21, లూకా 1:54, హెబ్రీయులకు 2:16

“నిరాకరించలేదు”– వారు బబులోను చెరకు వెళ్ళే సమయంలోనూ (యెషయా 39:5-7), కోరెషు తన జైత్రయాత్ర ఆరంభించిన సమయంలోనూ ఇది వారికి గొప్ప ఆదరణ అయి ఉంటుంది (యెషయా 40:1).

10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
అపో. కార్యములు 18:9-10

11. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

ఏ జాతీ, ఏ జనమూ ఇస్రాయేల్‌ను నాశనం చెయ్యలేరు. అలాంటి ప్రయత్నం చేసే వారంతా తామే నాశనమౌతారు (యెషయా 17:14; యెషయా 29:5-8; యెషయా 60:12; మొ।।). క్రీస్తు సంఘం సంగతి కూడా అంతే. మత్తయి 16:18 పోల్చి చూడండి.

12. నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

13. నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.

వ 10.

14. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

“పురుగు”– ఆ ప్రజ అందగాళ్ళనీ, బలిష్ఠులనీ, ధీరోదాత్తులనీ, యోగ్యులనీ దేవుడు వారిని ఎన్నుకోలేదు. అసలు పైన చెప్పిన లక్షణాలన్నిటికీ వ్యతిరేకమైనవారు ఆ ప్రజలు. మనందరం కూడా అంతే గదా. “విముక్తి దాత”– కీర్తనల గ్రంథము 78:35 నోట్.

15. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు

ఒక పురుగును తీసుకుని దేవుడు ఎలాంటి పనులు చేయగలడో చూడండి. ఇది కేవలం తన ప్రజలను కాపాడడం మాత్రమే కాదు. వారు ఆయన చేతిలో (వ 10,13) వారి శత్రువులను నలగ్గొట్టే శక్తివంతమైన ఆయుధంలాగా అవుతారు. బలహీనులు దేవునిలో తమ బలాన్ని కనుక్కోవడం అన్న విషయానికి ఇది ఉదాహరణ (యెషయా 40:31). ఇస్రాయేల్‌వారు దీన్ని గుర్తించి దేవునిలో ఉప్పొంగిపోతారు. ఇదంతా ఇంతకు ముందు జరిగిందా? ఇది నెరవేరే సమయంకోసం యెషయా 11:12-14; యెషయా 14:2; యెషయా 49:23 పోల్చి చూడండి. రాసినదాన్ని బట్టి చూస్తే ఈ రచయితకు తెలిసినంత వరకు చూచాయగానైనా ఇది ఇప్పటికి నెరవేరలేదు.

16. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.

17. దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.

18. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించు నట్లు

19. చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.

యెషయా 32:15-16; యెషయా 35:1-2; యెషయా 51:3; యెషయా 55:13. దేవుడు అక్షరాలా మంచి నేలలను ఎడారులుగాను, ఎడారులను సారవంతంగాను మార్చేస్తాడు (కీర్తనల గ్రంథము 107:33-35). మరోసారి యూదాలో ఇలా చెయ్యవచ్చు. అయితే బైబిల్లో కొన్నిసార్లు భౌతికమైన మార్పులు ఆధ్యాత్మికమైన మార్పులకు కూడా సూచనలు.

20. నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.

ఇస్రాయేల్‌లో (అంటే దేశంలోనైనా, ప్రజల్లోనైనా లేక రెంటిలోనైనా) దేవుని కార్యాలు ప్రపంచంలోని ఇతర జనాలకు బోధను కలిగిస్తాయి.

21. వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పు చున్నాడు.

ఈ వచనాలు యెషయా 41:1 తో సంబంధం గలవి. జనాలు తమ విగ్రహాలు ఉపయోగకరమైనవేనని భావిస్తే, భూత భవిష్యత్కాలాలను తెలియజెప్పే సామర్థ్యం వాటికుంటే వారు ముందుకు వచ్చి ఈ సంగతిని నిరూపించాలి (యెషయా 43:9 కూడా చూడండి). ఇది వారి చేతగాని పని అని దేవునికి తెలుసు. యెషయా 42:9; యెషయా 46:10 లో విగ్రహాలు చెయ్యలేని వాటిని తాను చేస్తానంటున్నాడు దేవుడు. వ 23,24లో దేవుడు నేరుగా ప్రజల విగ్రహాలతో మాట్లాడుతున్నట్టుంది.

22. జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.

23. ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి.

24. మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనువారు హేయులు.

25. ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.
ప్రకటన గ్రంథం 16:12

వ 2. కోరెషు ఇస్రాయేల్ తూర్పు దిక్కునున్న ప్రాంతాలకు చెందినవాడు. కాని ఉత్తరంగా ఉన్న ప్రదేశాలను కూడా అతడు జయించాడు. అతణ్ణి పురిగొలిపి రప్పించినది ఇస్రాయేల్‌వారి దేవుడే. అతని దారిలో ఉన్న దేశాల దేవుళ్ళు ఇలాంటి పనిని చేయలేవు. జరగబోతున్నదాన్ని తెలియ జేయలేవు, దాన్ని ఆపలేవు. “నా పేర ప్రార్థన”– కోరెషు యెహోవాను ప్రార్థించాడు. ఆయన నామాన్ని ఉచ్చరించాడు (ఎజ్రా 1:1-4 లో). అయితే అతనికి కనీసం మొదట్లో దేవుని విషయంలో అనుభవ పూర్వకమైన జ్ఞానం లేదు (యెషయా 45:4-5).

26. మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వాడెవడును లేడు మీ మాటలు వినువాడెవడును లేడు.

కోరెషు అధికారంలోకి వస్తాడని ముందుగా చెప్పినది ఎవరు? ఇతర దేశాల విగ్రహాలేవీ కావు. నిజమైన దేవుడు, ఇస్రాయేల్‌వారి దేవుడే.

27. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని.

“శుభవార్త”– కోరెషు మంచివార్త తెచ్చిన వార్తాహరుడు (ఎజ్రా 1:1-4).

28. నేను చూడగా ఎవడును లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను.

29. వారందరు మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి.

“వాళ్ళంతా”– అంటే 21-23 వచనాల్లోని విగ్రహారాధకులు.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |