Isaiah - యెషయా 44 | View All

1. అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము

1. But now hear, O Jacob my servant, Israel whom I have chosen!

2. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

2. Thus says the LORD who made you, who formed you in the womb and will help you: Do not fear, O Jacob my servant, Jeshurun whom I have chosen.

3. నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.
యోహాను 7:39

3. For I will pour water on the thirsty land, and streams on the dry ground; I will pour my spirit upon your descendants, and my blessing on your offspring.

4. నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.

4. They shall spring up like a green tamarisk, like willows by flowing streams.

5. ఒకడునేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.

5. This one will say, I am the LORD's, another will be called by the name of Jacob, yet another will write on the hand, The LORD's, and adopt the name of Israel.

6. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.
ప్రకటన గ్రంథం 1:17, ప్రకటన గ్రంథం 2:8, ప్రకటన గ్రంథం 21:6, ప్రకటన గ్రంథం 22:13

6. Thus says the LORD, the King of Israel, and his Redeemer, the LORD of hosts: I am the first and I am the last; besides me there is no god.

7. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను.

7. Who is like me? Let them proclaim it, let them declare and set it forth before me. Who has announced from of old the things to come? Let them tell us what is yet to be.

8. మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను.

8. Do not fear, or be afraid; have I not told you from of old and declared it? You are my witnesses! Is there any god besides me? There is no other rock; I know not one.

9. విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు.

9. All who make idols are nothing, and the things they delight in do not profit; their witnesses neither see nor know. And so they will be put to shame.

10. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు?
అపో. కార్యములు 17:29

10. Who would fashion a god or cast an image that can do no good?

11. ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.

11. Look, all its devotees shall be put to shame; the artisans too are merely human. Let them all assemble, let them stand up; they shall be terrified, they shall all be put to shame.

12. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును

12. The ironsmith fashions it and works it over the coals, shaping it with hammers, and forging it with his strong arm; he becomes hungry and his strength fails, he drinks no water and is faint.

13. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రిక లతో దాని చక్కచేయును కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును.

13. The carpenter stretches a line, marks it out with a stylus, fashions it with planes, and marks it with a compass; he makes it in human form, with human beauty, to be set up in a shrine.

14. ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును శ్మశానావృక్షమును గాని సరళవృక్షమును గాని సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును

14. He cuts down cedars or chooses a holm tree or an oak and lets it grow strong among the trees of the forest. He plants a cedar and the rain nourishes it.

15. ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును.

15. Then it can be used as fuel. Part of it he takes and warms himself; he kindles a fire and bakes bread. Then he makes a god and worships it, makes it a carved image and bows down before it.

16. అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ ముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను కొనుచున్నాడు

16. Half of it he burns in the fire; over this half he roasts meat, eats it and is satisfied. He also warms himself and says, Ah, I am warm, I can feel the fire!

17. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.

17. The rest of it he makes into a god, his idol, bows down to it and worships it; he prays to it and says, Save me, for you are my god!

18. వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను.

18. They do not know, nor do they comprehend; for their eyes are shut, so that they cannot see, and their minds as well, so that they cannot understand.

19. ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు.

19. No one considers, nor is there knowledge or discernment to say, Half of it I burned in the fire; I also baked bread on its coals, I roasted meat and have eaten. Now shall I make the rest of it an abomination? Shall I fall down before a block of wood?

20. వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవు చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను కొనుటకు వానికి బుద్ధి చాలదు.

20. He feeds on ashes; a deluded mind has led him astray, and he cannot save himself or say, Is not this thing in my right hand a fraud?

21. యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.

21. Remember these things, O Jacob, and Israel, for you are my servant; I formed you, you are my servant; O Israel, you will not be forgotten by me.

22. మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.

22. I have swept away your transgressions like a cloud, and your sins like mist; return to me, for I have redeemed you.

23. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును
ప్రకటన గ్రంథం 12:12, ప్రకటన గ్రంథం 18:20

23. Sing, O heavens, for the LORD has done it; shout, O depths of the earth; break forth into singing, O mountains, O forest, and every tree in it! For the LORD has redeemed Jacob, and will be glorified in Israel.

24. గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను

24. Thus says the LORD, your Redeemer, who formed you in the womb: I am the LORD, who made all things, who alone stretched out the heavens, who by myself spread out the earth;

25. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.
1 కోరింథీయులకు 1:20

25. who frustrates the omens of liars, and makes fools of diviners; who turns back the wise, and makes their knowledge foolish;

26. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.

26. who confirms the word of his servant, and fulfills the prediction of his messengers; who says of Jerusalem, It shall be inhabited, and of the cities of Judah, They shall be rebuilt, and I will raise up their ruins;

27. నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను
ప్రకటన గ్రంథం 16:12

27. who says to the deep, Be dry-- I will dry up your rivers;

28. కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.
అపో. కార్యములు 13:22

28. who says of Cyrus, He is my shepherd, and he shall carry out all my purpose; and who says of Jerusalem, It shall be rebuilt, and of the temple, Your foundation shall be laid.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Isaiah - యెషయా 44 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పరిశుద్ధాత్మ ప్రభావానికి సంబంధించిన వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. (1-8) 
ఈ ప్రకరణంలో, ఇజ్రాయెల్‌ను జెషురూన్ అని పిలుస్తారు, దీని అర్థం "నిటారుగా ఉన్నవాడు". నిజమైన ఇశ్రాయేలీయులు తమ హృదయాలలో మోసం లేనివారే. దేవునికి నమ్మకంగా సేవ చేసే వారు తమ ప్రయత్నాల సమయంలో సవాళ్లను అధిగమించడంలో ఆయన అంగీకారం మరియు సహాయాన్ని పొందుతారు. నీరు పరిశుద్ధాత్మను సూచిస్తుంది, నీరు భూమిని ఎలా రిఫ్రెష్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది మరియు పోషించిస్తుందో, ఆత్మ ఆత్మను పునరుజ్జీవింపజేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క ఈ దైవిక బహుమానం ఒక గొప్ప ఆశీర్వాదం, ఇది చివరి రోజుల కోసం దేవునిచే రిజర్వ్ చేయబడింది. దేవుడు తన ఆత్మను ప్రసాదించినప్పుడు, అతను అన్ని ఇతర ఆశీర్వాదాలను కూడా ఇస్తాడు. ఇది చర్చి యొక్క గణనీయమైన విస్తరణకు దారి తీస్తుంది, సుదూర ప్రాంతాలకు చేరుకుంటుంది.
వాటిని రక్షించగల ఇతర శిల లేదా రక్షకుడు ఎవరైనా ఉన్నారా? దేవుడు తన ప్రవక్తల ద్వారా బయలుపరచిన ఈ భవిష్యత్ సంఘటనలను మరెవరూ ఊహించలేరు. దేవుని దివ్య ప్రణాళికలలో ఉన్నట్లే, దైవిక ప్రవచనాలలో ప్రతిదీ ఖచ్చితంగా అమర్చబడింది. మరెవరైనా దీనిని సాధించగలరా? ఇజ్రాయెల్ యొక్క విమోచకుడు మరియు రాజుతో ఎవరిని పోల్చవచ్చు?

విగ్రహారాధన యొక్క మూర్ఖత్వం యొక్క బహిర్గతం. (9-20) 
విగ్రహారాధకుల మూర్ఖత్వాన్ని హైలైట్ చేయడానికి చిత్రాలను రూపొందించే చర్య ఇక్కడ వివరించబడింది. ఒక వ్యక్తి కట్టెలో కొంత భాగాన్ని కట్టెల కోసం ఉపయోగించుకుని, మిగిలిన చెక్కతో రూపొందించిన చిత్రం ముందు సాష్టాంగపడి, వాటిని రక్షించమని వేడుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు ఆయనను మానవుని పోలికలో చిత్రించినప్పుడు ఈ ప్రవర్తన దేవునికి చాలా అవమానకరం. సాతాను అవిశ్వాసుల మనస్సులను అంధుడిని చేస్తాడు, విశ్వాసానికి సంబంధించిన విషయాల గురించి అహేతుక తర్కంలోకి వారిని నడిపిస్తాడు. వ్యక్తులు ప్రాపంచిక విషయాలలో ఆనందాన్ని వెతుక్కున్నా లేదా అవిశ్వాసం, మూఢనమ్మకాలు లేదా ఏదైనా తప్పుడు విశ్వాస వ్యవస్థలో పడినా, వారు తప్పనిసరిగా శూన్యతను వినియోగిస్తున్నారు.
అహంకారం, పాపం పట్ల ప్రేమ మరియు దేవుని నుండి నిష్క్రమించడం ద్వారా దారితప్పిన హృదయం అతని పవిత్రమైన సత్యం మరియు ఆరాధన నుండి ప్రజలను మళ్లిస్తుంది. మన ఆప్యాయతలు చెడిపోయినప్పుడు, మన అత్యంత విలువైన ఆస్తులుగా అబద్ధాలను పట్టుకుంటాము. మన హృదయాలు ప్రపంచంలోని సంపద మరియు దాని ఆనందాలపై స్థిరంగా ఉన్నాయా? వారు నిరంతరం మోసపూరితంగా నిరూపించబడతారు. బయటి వృత్తుల మీద, పనుల మీద ఆధారపడితే, అవి మనల్ని రక్షించగలవని అనుకుంటే, మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. స్వీయ-విమోచన ప్రక్రియను ప్రారంభించడానికి, ముందుగా మన గురించి మనం సందేహాలను కలిగి ఉండాలి. తమ ఆత్మను రక్షించుకోవాలనుకునే ఎవరైనా ఆత్మపరిశీలన చేసుకుని, "నా కుడిచేతిలో అసత్యం ఉందా?" అని అడగాలి.

అలాగే దేవుని ప్రజల విమోచన. (21-28)
"నా దగ్గరకు తిరిగి వెళ్ళు" అనేది మనస్ఫూర్తిగా మనవి. ప్రాచీన యూదుల మాదిరిగానే దేవుని నుండి దూరమైన వారికి, ఆయన వద్దకు త్వరగా తిరిగి రావాలనేది వారి అత్యంత ముఖ్యమైన ఆందోళన. క్రీస్తు ద్వారా మన కోసం సాధించిన విమోచనం ఆయన నుండి వచ్చే అన్ని ఆశీర్వాదాల కోసం నిరీక్షణకు మూలంగా పనిచేస్తుంది. మన అతిక్రమణలు మరియు పాపాలు స్వర్గం మరియు భూమి మధ్య దట్టమైన నీడను వేస్తాయి, దేవుని నుండి మనలను వేరుచేసే అవరోధంగా పనిచేస్తాయి, అతని కోపం యొక్క తుఫానును బెదిరిస్తుంది. దేవుడు పాపాన్ని క్షమించినప్పుడు, అతను ఈ మేఘాన్ని, ఈ దట్టమైన మేఘాన్ని చెరిపివేస్తాడు మరియు చెదరగొట్టాడు, తద్వారా స్వర్గానికి మార్గాన్ని మళ్లీ తెరుస్తాడు. ధర్మసూర్యుడు మేఘాన్ని పూర్తిగా చెదరగొట్టాడు. పాపం క్షమించబడినప్పుడు ఆత్మను నింపే ఓదార్పులు మేఘాలు మరియు వర్షం తర్వాత వచ్చే స్పష్టమైన ప్రకాశాన్ని పోలి ఉంటాయి.
ఇజ్రాయెల్ హృదయాన్ని కోల్పోవద్దు, ఎందుకంటే ఏదీ దేవుని సామర్థ్యాలకు మించినది కాదు. అన్ని వస్తువులను సృష్టించిన తరువాత, అతను వాటిని తనకు నచ్చిన పద్ధతిలో ఉపయోగించగలడు. క్రీస్తును తెలుసుకున్నవారు, ఆయన గురించిన జ్ఞానంతో పోల్చితే మిగతా జ్ఞానమంతా క్షీణించిందని అర్థం చేసుకుంటారు. ఆయన విరోధులు కూడా తమ కుయుక్తిలో చిక్కుకున్న తమ పథకాలు వ్యర్థమైనవని కనుగొంటారు. గ్రంథం యొక్క ప్రవచనాల ఖచ్చితమైన నెరవేర్పు మొత్తం టెక్స్ట్ యొక్క సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దాని దైవిక మూలాన్ని రుజువు చేస్తుంది. వారి బందిఖానాలో ఉన్న సమయంలో దేవుడు తన ప్రజల కోసం ఉద్దేశించిన నిర్దిష్ట ఆశీర్వాదాలు వారి బందిఖానా ప్రారంభానికి చాలా కాలం ముందు ఇక్కడ ప్రవచించబడ్డాయి. వారి విమోచన మార్గంలో గణనీయమైన అడ్డంకులు ఉన్నప్పటికీ, దైవిక శక్తి వాటన్నింటినీ తొలగిస్తుందని వాగ్దానం చేయబడింది. తన ప్రజల విమోచకుడిగా ఎవరు ఉంటారో దేవునికి తెలుసు మరియు దానిని తన చర్చికి బయలుపరచాడు, తద్వారా వారు అలాంటి పేరు ప్రస్తావించబడినప్పుడు, వారి విమోచన సమీపిస్తున్నట్లు వారు గుర్తిస్తారు. గొప్ప వ్యక్తులు తన ప్రజలకు దేవుని అనుగ్రహానికి సాధనాలుగా నియమించబడటం అత్యున్నత గౌరవం. ప్రజలు తమను తాము సేవించుకునే విషయాలలో మరియు తదుపరి చూడకుండా, దేవుడు తన ప్రతి కోరికను నెరవేర్చడానికి వారిని నియమించుకుంటాడు. మరియు సైరస్ కంటే గొప్ప గొర్రెల కాపరి తన పనిని పూర్తిగా పూర్తి చేసే వరకు తన తండ్రి చిత్తాన్ని నిర్వహిస్తాడు.



Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |