Isaiah - యెషయా 48 | View All

1. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి.

– వారు విగ్రహాలను వెంబడిస్తూ కూడా, వారి ఆధ్యాత్మిక స్థితి యెషయా 1:2-17 లో వర్ణించిన రీతిలో ఉండి కూడా తమ మత సంబంధమైన కర్మకాండలను కొనసాగించడం వారికిష్టం. “నిజాయితీ”– యెషయా 29:13; యోహాను 4:24.

2. వారుమేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

“పవిత్ర నగరం”– జెరుసలం (యెషయా 52:1).

3. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను.

మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, విగ్రహారాధకులు చేయలేనిదేదో దాన్ని దేవుడు చెయ్యగలడు. 41–48 అధ్యాయాల్లోని ముఖ్యాంశాల్లో ఇదొకటి (యెషయా 41:21-29; యెషయా 42:8-9; యెషయా 43:9-13; యెషయా 44:6-9; యెషయా 44:28; యెషయా 45:19-21; యెషయా 46:8-10; యెషయా 47:13). నిర్గమకాండము 32:9; యిర్మియా 6:28; యెహెఙ్కేలు 3:7; అపో. కార్యములు 7:51.

4. నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి

5. నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని

6. నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలోచించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా? తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను
ప్రకటన గ్రంథం 1:19

7. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు, ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండ లేదు.

8. అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును.

“తెలుసుకోలేదు”– యెషయా 1:3; యెషయా 6:9-10.

9. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ మునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను.

1 సమూయేలు 12:22; కీర్తనల గ్రంథము 78:38; యెషయా 37:35. దేవుడే గనుక తన కోపాన్ని అణుచుకోకపోతే ఎవరు నిలిచి ఉండగలరు? దేవుని కోపం గురించి నోట్స్ సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11; యోహాను 3:36; రోమీయులకు 1:18.

10. నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని
1 పేతురు 1:7

యిర్మియా 9:7; యెహెఙ్కేలు 22:17-22; కీర్తనల గ్రంథము 66:10-12. ఎన్నో శతాబ్దాలుగా దేవుని ప్రజలు ఎంతో మంది ఈ అగ్నికొలిమిలో పరీక్షకు గురి అయ్యారు (1 పేతురు 1:6-7; 1 పేతురు 4:1, 1 పేతురు 4:12).

11. నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.

వ 9. దేవుడు ఇస్రాయేల్ జాతిని పూర్తిగా నాశనం చేసేస్తే, వారు తిరిగి తనవద్దకు వచ్చేలా చేసి వారు ఎలా ఉండాలో ఆ స్థితికి తెచ్చేందుకు వారిలో చర్య జరిగించకపోతే, వారి విషయంలో తాను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే ఆయన నామం ఆపకీర్తి పాలౌతుంది. నిర్గమకాండము 32:9-14; మొ।। పోల్చి చూడండి.

12. యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను
ప్రకటన గ్రంథం 1:17, ప్రకటన గ్రంథం 2:8, ప్రకటన గ్రంథం 21:6, ప్రకటన గ్రంథం 22:13

“మొదటివాణ్ణి, చివరివాణ్ణి”– యెషయా 44:6.

13. నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.
రోమీయులకు 4:17

“ఆకాశాలు”– యెషయా 40:21-22; యెషయా 42:5; యెషయా 51:13. “ఏకంగా”– సృష్టి అంతా దేవుని మాటకు లోబడుతుంది. మనుషులు, సైతాను, వాడి దురాత్మలు మాత్రమే ఆయన మాటకు ఎదురు తిరుగుతారు.

14. మీరందరు కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.

“ఈ సంగతులను”– బహుశా కోరెషు బబులోనును ఆక్రమించుకోవడం అయి ఉండవచ్చు (యెషయా 41:2; యెషయా 45:1-3, యెషయా 45:13). “తెలియజేసినది”– వ 3-6 నోట్.

15. నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును. నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి

16. ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను

యెషయా 45:19. ఈ వచనం చివరి మాటను పలికినది యెషయా అయి ఉండవచ్చు. తనను ప్రవక్తగా నియమించి బలప్రభావాలను ఇచ్చిన విషయాన్ని చెప్తున్నాడు (యెషయా 6:9; 2 పేతురు 1:21).

17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.

“విముక్తిదాత”– కీర్తనల గ్రంథము 78:35. “పవిత్రుడు”– యెషయా 1:4. “ఉపదేశం చేసేవాణ్ణి”– కీర్తనల గ్రంథము 25:4-5 నోట్స్ చూడండి. దేవుడెంత గొప్ప ఉపదేశకుడు! ఇంత గొప్ప ఉపదేశకుని దగ్గర ఏమీ నేర్చుకోలేని మనుషుల భ్రష్ట స్వభావం, మొండితనం, ఆత్మ సంబంధమైన అజ్ఞానం ఎంత ఘోరమైనవి!

18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.

“శాంతి, న్యాయం”– తన ప్రజలు దేన్నైతే అనుభవించాలని దేవుడు వాంఛిస్తున్నాడో క్లుప్తంగా వర్ణించే రెండు పదాలు (రోమీయులకు 14:17). దేవుని పట్ల విధేయతకు ఇవి ఫలితాలు (కీర్తనల గ్రంథము 119:9, కీర్తనల గ్రంథము 119:165; మొ।।). అవిధేయతవల్ల నెమ్మది లేకపోవడం, కీడు సంప్రాప్తిస్తాయి. “అలలు”– నదులు, అలలు నిరంతరం సాగిపోతూనే ఉంటాయి.

19. నీ సంతానము ఇసుకవలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును వారి నామము నా సన్నిధినుండి కొట్టివేయబడదు మరువబడదు

“ఇసుకంత”– ఆదికాండము 15:5; ద్వితీయోపదేశకాండము 1:10. దేవునికి ఇస్రాయేల్ విధేయత చూపివుంటే సంఖ్యలో మరింత అధికంగా ఉండేవారు. దేవుని తీర్పు వారిలో చాలామందిని సంహరించింది. మరింతమందికి అదే గతి పట్టబోతున్నది. “వారి పేరును”– యెషయా 10:22.

20. బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి.
ప్రకటన గ్రంథం 18:4

మిగిలిన ప్రజతో దేవుడు వారు అప్పటికే బబులోనులో ఉన్నట్టూ, బబులోను నాశనమైపోయినట్టూ మాట్లాడుతున్నాడు. ఒక విషయాన్ని మొదటినుంచి చివరి స్థితి వరకు తెలిసినవాడే ఇలా మాట్లాడగలడు (యెషయా 46:10). ఇస్రాయేల్‌వారు చెరనుండి విడుదల కావడం, తద్వారా వారిలో వెల్లివిరిసే ఆనందం ఇక్కడ కన్పిస్తున్నాయి.

21. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను.

ఇది ఎడారి ప్రాంతాల్లో ఇంతకుముందు కాలంలో దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేయడం (నిర్గమకాండము 17:6; సంఖ్యాకాండము 20:11; ద్వితీయోపదేశకాండము 8:15; కీర్తనల గ్రంథము 78:15-16). బబులోను నుండి తిరిగి వచ్చేవేళ దేవుడు వారి అవసరాలను తీరుస్తాడని ఇస్రాయేల్‌వారికి దైర్యం చెప్పేందుకే ఈ విధంగా గుర్తు చేయడం. యెషయా 32:2; యెషయా 35:6; యెషయా 43:19; యెషయా 49:10 కూడా చూడండి. ఇక్కడ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవలసిన సత్యం కూడా ఉంది. ఇప్పటి విశ్వాసులు ఈ లోకమనే ఎడారి దారిన పరలోకం సీయోను కొండకు వెళ్తుండగా వీరికి కావలసిన ప్రోత్సాహం కూడా ఇక్కడ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.

22. దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 3:11; యెషయా 57:20-21. వ 20లోని విముక్తి, ఆనందాల్లో ఇస్రాయేల్ లోని దుర్మార్గులు భాగం పంచుకోరు. దేవుడు సకలమైన దుష్టత్వంనుండి తన ముఖం తిప్పేసుకుంటే, ప్రతీకారం తీర్చుకొనేందుకు సంసిద్ధుడైతే వారికి ఇక శాంతి ఎక్కడిది? అయితే తాము శాంతి అని భ్రమపడేది కొంతకాలానికి ఉండవచ్చు (కీర్తనల గ్రంథము 73:3-12, కీర్తనల గ్రంథము 73:16-20; రోమీయులకు 2:4-6).Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |