ఇస్రాయేల్ పైకి ముంచుకువస్తున్న ప్రమాదాన్ని 9వ వచనం సూచిస్తున్నది. బైబిల్లో అక్కడక్కడ దుష్టజాతులను మృగాలు అని పిలవడం కనిపిస్తున్నది – యిర్మియా 4:7 లో సింహం అనీ, దానియేలు 7,8 అధ్యాయాల్లో మృగాలు అనీ ఉంది. ఇస్రాయేల్ నాయకులు, యాజులు, ప్రవక్తలు కూడా అంధులు, చెడిపోయినవారు. కుక్క కూడా ప్రమాదాన్ని పసిగడితే మొరుగుతుంది. కానీ ఈ కావలివాళ్ళు మాత్రం తమకు మరింత తిండి కావాలనే మొరుగుతుంటారు (వ 11).