Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bible in Basic English (1964)
Bishop's Bible
Brenton's English Septuagint
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Commentary
1. నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు.
1. neethimanthulu nashin̄chuṭa chuchi yevarunu daanini manassuna peṭṭaru bhakthulainavaaru theesikonipōbaḍuchunnaaru keeḍu chooḍakuṇḍa neethimanthulu konipōbaḍuchunnaarani yevanikini thoochadu.
2. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.
2. vaaru vishraanthilō pravēshin̄chuchunnaaru thamaku sooṭigaanunna maargamuna naḍachuvaaru thama paḍakalameeda paruṇḍi vishramin̄chuchunnaaru.
3. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి.
3. mantraprayōgapu koḍukulaaraa, vyabhichaara santhaanamaa, vēshyaasanthaanamaa, meerakkaḍiki raṇḍi.
4. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?
4. meerevani egathaaḷi cheyuchunnaaru? Evani chuchi nōru terachi naaluka chaachuchunnaaru? meeru thirugubaaṭu cheyuvaarunu abaddhikulunu kaaraa?
5. మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువార లారా,
5. masthachaavrukshamulanu chuchi pacchani prathicheṭṭu krindanu kaamamu rēpukonuvaaralaaraa, lōyalalō raathisandulakrinda pillalanu champuvaara laaraa,
6. నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు.ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?
6. nee bhaagyamu lōyalōni raaḷlalōnē yunnadhi aviyē neeku bhaagyamu, vaaṭikē paaneeyaarpaṇamu cheyuchunnaavu vaaṭikē naivēdyamu narpin̄chuchunnaavu.Ivanniyu jarugagaa nēnu oorakuṇḍadagunaa?
7. ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి కొంటివి బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి తలుపువెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి
7. unnathamaina mahaaparvathamumeeda nee parupu vēsi koṇṭivi bali arpin̄chuṭaku akkaḍikē yekkithivi thalupuvenukanu dvaarabandhamu venukanu nee gnaapakachihnamu un̄chithivi
8. నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పుచేసికొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమిం చితివి.
8. naaku marugai baṭṭalu theesi man̄chamekkithivi nee parupu veḍalpuchesikoni nee pakshamugaa vaarithoo nibandhana chesithivi neevu vaari man̄chamu kanabaḍina chooṭa daani prēmiṁ chithivi.
9. నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి
9. neevu thailamu theesikoni raajunoddhaku pōthivi parimaḷa dravyamulanu visthaaramugaa theesikoni nee raayabaarulanu dooramunaku pampithivi paathaaḷamantha lōthugaa neevu loṅgithivi
10. నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.
10. nee dooraprayaaṇamuchetha neevu prayaasapaḍinanu adhi asaadhyamani neevanukonalēdu neevu balamu techukoṇṭini ganuka neevu sommasillalēdu.
11. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి బహుకాలమునుండి నేను మౌనముగానుండినందు ననే గదా నీవు నాకు భయపడుట లేదు?
11. evaniki jaḍisi bhayapaḍinanduna aa saṅgathi manaskarimpakapōthivi? neevu kallalaaḍi nannu gnaapakamu chesikonakapōthivi bahukaalamunuṇḍi nēnu maunamugaanuṇḍinandu nanē gadaa neevu naaku bhayapaḍuṭa lēdu?
12. నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్‌ప్రయోజనములగును.
12. nee neethi yenthoo nēnē teliyajēsedanu, nee kriyalu neeku nishprayōjanamulagunu.
13. నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు.
13. neevu morrapeṭṭunappuḍu nee vigrahamula gumpu ninnu thappin̄chunēmō gaali vaaṭinanniṭini egaragoṭṭunu gadaa? Okaḍu oopiri viḍichinamaatramuna aviyanniyu koṭṭukonipōvunu nannu nammukonuvaaru dheshamunu svathantrin̄chu konduru naa parishuddha parvathamunu svaadheenaparachukonduru.
14. ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
14. etthucheyuḍi etthucheyuḍi trōvanu siddhaparachuḍi, aḍḍu cheyudaanini naa janula maargamulōnuṇḍi theesivēyuḍi ani aayana aagna ichuchunnaaḍu.
15. మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
15. mahaa ghanuḍunu mahōnnathuḍunu parishuddhuḍunu nityanivaasiyunainavaaḍu eelaagu sela vichuchunnaaḍu nēnu mahōnnathamaina parishuddhasthalamulō nivasin̄chu vaaḍanu ayinanu vinayamugalavaari praaṇamunu ujjeevimpa jēyuṭakunu naliginavaari praaṇamunu ujjeevimpajēyuṭakunu vinayamugalavaariyoddhanu deenamanassugalavaariyoddhanu nivasin̄chuchunnaanu.
16. నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.
16. nēnu nityamu pōraaḍuvaaḍanu kaanu ellappuḍunu kōpin̄chuvaaḍanu kaanu aalaaguṇḍinayeḍala naa moolamugaa jeevaatma ksheeṇin̄chunu nēnu puṭṭin̄china narulu ksheeṇin̄chipōvuduru.
17. వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.
17. vaari lōbhamuvalana kaligina dōshamunubaṭṭi nēnu aagrahapaḍi vaarini koṭṭithini nēnu naa mukhamu maruguchesikoni kōpin̄chithini vaaru thirugabaḍi thamakishṭamaina maargamuna naḍachuchu vachiri.
18. నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.
18. nēnu vaari pravarthananu chuchithini vaarini svasthaparachudunu vaarini naḍipinthunu vaarilō duḥkhin̄chuvaarini ōdaarchudunu.
19. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎఫెసీయులకు 2:13-17, రోమీయులకు 2:39, హెబ్రీయులకు 13:15
19. vaarilō kruthagnathaabuddhi puṭṭin̄chuchu doorasthulakunu sameepasthulakunu samaadhaanamu samaadhaanamani cheppi nēnē vaarini svasthaparachedhanani yehōvaa selavichu chunnaaḍu.
20. భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును. యూదా 1:13
20. bhakthiheenulu kadaluchunna samudramuvaṇṭivaaru adhi nimmaḷimpanēradu daani jalamulu buradanu mailanu paikivēyunu.
21. దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.
21. dushṭulaku nemmadhiyuṇḍadani naa dhevuḍu selavichu chunnaaḍu.