Isaiah - యెషయా 6 | View All

1. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
ప్రకటన గ్రంథం 4:2-6-9-10, ప్రకటన గ్రంథం 5:1-7, ప్రకటన గ్రంథం 6:16, ప్రకటన గ్రంథం 7:10-15, ప్రకటన గ్రంథం 19:4, ప్రకటన గ్రంథం 20:11, ప్రకటన గ్రంథం 21:5

“చనిపోయిన”– యెషయా 1:1. యెషయాకు వచ్చిన దర్శనం ఉజ్జియా మరణానికి ముందో తరువాతో ఇక్కడ లేదు. ఆ సంవత్సరంలో వచ్చిందని మాత్రమే రాసివుంది. ఆ సంవత్సరం క్రీ.పూ. 740. ఉజ్జియాకు అజర్యా అనే పేరు కూడా ఉంది. ఇతని పాలన 2 రాజులు 15:1-7; 2 దినవృత్తాంతములు 26:1-23 లో వర్ణించారు. “చూశాను”– మనుషులు ఆత్మగా ఉన్న దేవుణ్ణి చూడలేరు (నిర్గమకాండము 34:20; 1 తిమోతికి 6:16; యోహాను 1:18; యోహాను 6:46) అయితే ఆయన మహిమ ప్రకాశాన్ని లేక మానవ రూపంలో ఆయన ప్రత్యక్షాన్ని చూడగలరు (ఆదికాండము 16:13; ఆదికాండము 18:22-23; ద్వితీయోపదేశకాండము 34:10; యెషయా 6:5). యెషయా చూచినది కుమారునిలో దేవుని స్వరూప ప్రత్యక్షతను. యోహాను 12:41; యెహెఙ్కేలు 1:26 పోల్చి చూడండి. యెషయా చూచినది దేవుని కుమారుని మహిమ – యోహాను 12:41 చూడండి. యెషయా వ 5లో ఆయన్ను “యెహోవా” అని పిలుస్తున్నాడని గమనించండి. అంటే దేవుని కుమారుడైన యేసు యెహోవా. ఆదికాండము 16:7; నిర్గమకాండము 3:14; కీర్తనల గ్రంథము 23:1; కీర్తనల గ్రంథము 24:7-10; కీర్తనల గ్రంథము 96:10-13; జెకర్యా 12:10; లూకా 2:11 (నోట్‌) చూడండి. ఆయన అంగీ అంచు జెరుసలంలోని దేవాలయం నిండా వ్యాపించింది.

2. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.
ప్రకటన గ్రంథం 4:8

“సెరాపులు”– ప్రజ్వరిల్లడం అనే అర్థాన్ని ఇచ్చే హీబ్రూ పదం నుండి ఈ మాట పుట్టింది. బహుశా ఇవి జ్వలించే ఆత్మలు అయి ఉంటాయి. హెబ్రీయులకు 1:7 పోల్చి చూడండి. యెహెజ్కేలు, యోహాను చూచిన మండే జీవులు వీరే అయివుండవచ్చు (యెహెఙ్కేలు 1:5; యెహెఙ్కేలు 10:15; ప్రకటన గ్రంథం 4:8). అయితే వీటి వర్ణన ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంది. ఈ ఆత్మ రూపుల గురించి బైబిల్లో ఉన్నది బహు కొంచెం.

3. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
ప్రకటన గ్రంథం 15:8, ప్రకటన గ్రంథం 4:8

దేవుని వ్యక్తిత్వంలోని ఒక్క లక్షణం ఈ సెరాపులను అద్భుతాశ్చర్యాలతో తనమునకలయ్యేలా చేస్తూవుంది. అది ఆయన పవిత్రత (ప్రకటన గ్రంథం 4:8 కూడా చూడండి). ఇది యెషయా గ్రంథమంతటికీ అనుగుణంగా ఉంది. ఆ మాటకొస్తే మొదటినుండి చివరివరకు దేవుని వైభవాన్ని వెల్లడించిన బైబిలంతటికీ అనుగుణంగా ఉంది.

4. వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా

తరుచుగా భూకంపం, పొగ ఇవి దేవుని సన్నిధికి సంబంధించిన సూచనలుగా కనిపిస్తాయి (నిర్గమకాండము 19:18; కీర్తనల గ్రంథము 18:7-8; కీర్తనల గ్రంథము 68:8; కీర్తనల గ్రంథము 104:32; యెషయా 64:1; ప్రకటన గ్రంథం 15:8) ఇవి ఆయన మహిమా ప్రభావాలకూ, మంటల్లాంటి ఆయన పవిత్రతకూ చిహ్నాలు (హెబ్రీయులకు 12:29).

5. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

“రాజు”– మనుషులు చనిపోతారు, అయితే పరలోకం రాజు శాశ్వతంగా పరిపాలిస్తాడు. యెషయా తన కండ్లను తన ఆశలను తన ప్రజల పరిపాలకులనుండి మరలించి రారాజైన దేవునిపై ఉంచవలసివచ్చింది. దేవుని పవిత్రత గురించీ, మనుషులందరిలోకీ శ్రేష్ఠులైన వారిలో సైతం నెలకొని ఉండే భ్రష్ట స్వభావం గురించీ మనకు తెలిసి ఉంటే ఈ దర్శనం యెషయాలో కలిగించిన అలజడి మనకు అర్థం అవుతుంది. యెషయా తాను అక్కడికక్కడే చనిపోతాననుకున్నాడు (నిర్గమకాండము 3:6; నిర్గమకాండము 33:20; న్యాయాధిపతులు 13:22; యోబు 13:11; యెహెఙ్కేలు 1:28; దానియేలు 8:17-18, దానియేలు 8:27; దానియేలు 10:7, దానియేలు 10:9; అపో. కార్యములు 9:3-4; ప్రకటన గ్రంథం 1:17 పోల్చి చూడండి). దేవుని సన్నిధిలో అతడు తన మాలిన్యాన్నీ తన ప్రజల మాలిన్యాన్నీ స్పష్టంగా గుర్తించగలిగాడు. దేవుని పవిత్ర సన్నిధే వారి పాపాలు, దోషాలు, భ్రష్టత్వం గురించిన మెళకువ వారికి పుట్టిస్తుంది. ఆయన వెలుగులో మనం ఎలాంటివారమో మనకు గోచరమౌతుంది (లూకా 5:8; యోహాను 16:8; కీర్తనల గ్రంథము 32:1-5; ఎఫెసీయులకు 5:13; 1 యోహాను 1:5-7). పెదవులు అంటే మానవ హృదయంలోని భ్రష్టత్వం బయటపడే ద్వారాల్లాంటివి (మత్తయి 12:34; మత్తయి 15:11; రోమీయులకు 3:13). దేవుణ్ణి సంతోషపెడుతూ ఆయన్ను సేవించదలుచుకున్న వారు ఎన్నో మార్లు తమ నాలుకను అదుపులో పెట్టుకోలేక తద్వారా తమ అంతరంగాల్లోని భ్రష్ట స్వభావాన్ని గురించి తెలుసుకొన్నారు. కీర్తనల గ్రంథము 39:1-13; యాకోబు 3:2, యాకోబు 3:6, యాకోబు 3:8.

6. అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి

యెషయా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఇది సంకేత రూపకమైనది. అతని పాపాలన్నిటికీ క్షమాపణ దొరికిందని అతనికి నిశ్చయత కలిగించడానికే ఈ దర్శనం. ఇత్తడి బలిపీఠం పై ఎప్పుడూ నిప్పు రగులుతూ ఉండాలని ఇస్రాయేల్‌వారి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు (లేవీయకాండము 6:12-13). అక్కడినుండి తీసిన నిప్పు కణిక ప్రాయశ్చిత్తం చేసిన బలిని సూచిస్తున్నది. నిర్గమకాండము 29:33 దగ్గర ప్రాయశ్చిత్తం గురించి నోట్. దేవుని సేవలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తీ అలా ప్రవేశించక ముందు తన పాపాలకు క్షమాపణ దొరికిందనీ తన దోషానికి ప్రాయశ్చిత్తం అయిందనీ నిశ్చయితను కలిగి ఉండాలి. విజయవంతమూ, దేవుని దృష్టికి అంగీకారమూ అయిన సేవకు పునాదిలో ఇది ఓ ముఖ్య భాగం. యెషయా విషయంలో చూస్తే ఆ నిప్పు కణిక అతని పెదవులను తాకింది. తన పాపం, భ్రష్టత్వాల గురించి తనకు ఎక్కువగా గుర్తుచేసే శరీర భాగం ఇదే.

7. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.

8. అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా

ఈ లోకంలో జరగవలసిన దేవుని పని ఎంతో ఉన్నది. హృదయ పూర్వకంగా ఆ పనిచేసే సేవకులు ఆయనకు కావాలి. దేవుడు తమ పాపాలను పరిహరించి దోషాన్ని రూపుమాపడంలో చూపిన కృపకు కృతజ్ఞతగా ఇలాంటి సంసిద్ధత పుట్టాలి. కీర్తనల గ్రంథము 51:1, కీర్తనల గ్రంథము 51:13-14; రోమీయులకు 12:1-2 చూడండి. “మాకోసం”– ఆదికాండము 1:26 నోట్. “ఇక్కడ ఉన్నాను”–ఆదికాండము 22:1; నిర్గమకాండము 3:4; 1 సమూయేలు 3:4, 1 సమూయేలు 3:6, 1 సమూయేలు 3:8; అపో. కార్యములు 22:10.

9. ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.
మత్తయి 13:14-15, మార్కు 4:12, లూకా 8:10, లూకా 19:42, యోహాను 12:40, అపో. కార్యములు 28:26-27, రోమీయులకు 11:8

యెషయా సేవలో ఒక భాగమేమిటంటే, దేవుని ప్రజపై ఆయన తీర్పును ప్రకటించడం, వారిని నాశనానికి పరిపక్వం చెందించే దేవుని పనిముట్టుగా ఉండడం. ఎలానంటే అతడు ప్రకటించే సత్యమే వారిని మరింత బండబారిపోయేలా చేసేది. ఎందుకంటే పశ్చాత్తాపపడి ఆ సత్యాన్ని హృదయంలోకి స్వీకరించడం వారికి ఇష్టం లేదు. తన ప్రజల హృదయాలు (లేక ఏ ప్రజల హృదయాలైనా) బండబారిపోయేలా దేవుడు ఎందుకు చేయగోరుతాడు? ఎందుకంటే వారి పాపాలు, తిరుగుబాటు నిమిత్తం వారిని శిక్షించవలసిన సమయం ఆసన్నమైంది. శిక్షించడం దేవునికి ఇష్టమని కాదు. కానీ న్యాయం శిక్షను నియమించకమానదు. బండబారిపోవడం గురించి నోట్ నిర్గమకాండము 4:21. మత్తయి 13:14-15 లో యేసుప్రభువు, అపో. కార్యములు 28:26-27లో పౌలు యెషయాలోని ఈ వచనాలను ఎత్తి చెప్పారు. పౌలు బహుశా రోమీయులకు 11:25 లో కూడా వీటిని ప్రస్తావించినట్టున్నాడు.

10. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
మత్తయి 13:14-15, మార్కు 4:12, లూకా 8:10, లూకా 19:42, యోహాను 12:40, అపో. కార్యములు 28:26-27

“చెవులు”– ఉద్దేశపూర్వకంగా దేవుని వాక్కును వినకుండా ఉండేవారికి వినడానికి సామర్థ్యం లేకుండా పోతుంది. “కండ్లు”– చీకటి అంటే ఎన్నుకొన్నవారు ఆధ్యాత్మిక కాంతినీ, సత్యాన్నీ చూచే సామర్థ్యతను కోల్పోతారు. ఇలాంటి పనికి పిలుపు రావడం యెషయాకు బాధకరంగా ఉండివుండవచ్చు. ఇలాంటి నిష్ఠూరమైన సేవను ఎన్నాళ్ళు చేయాలో, చివర్లో నైనా ఇష్టంగా అనిపించే సేవ ఏదన్నా ఉంటుందో ఉండదోనన్న అనుమానం అతనికి సహజంగా వచ్చేదే. తరువాత కాస్త మెరుగైన పనిని ఇస్తానని దేవుడు మాట ఇవ్వలేదు. అయితే ఈ క్రొత్త ఒడంబడిక దినాల్లో తన సేవకులకు మరింత శ్రేష్ఠమైన, మహిమాన్వితమైన సేవను అప్పగించాడు (మత్తయి 28:18-20; 2 కోరింథీయులకు 3:6-11). యెషయా విషయానికొస్తే క్రీస్తు రాకడను గురించి ముందుగా ప్రకటించే ధన్యత తదుపరి కాలంలో అతనికి కలిగింది. అయితే ఇక్కడ మాత్రం అతనికి అలాంటి అవకాశం వస్తుందని ఎలాంటి వాగ్దానమూ లేదు.

11. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయననివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును

12. యెహోవా మనుష్యులను దూరముగా తీసికొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగువరకును ఆలాగున జరుగును.

13. దానిలో పదియవ భాగము మాత్రము విడువ బడినను అదియును నాశనమగును. సిందూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.

ఆ ప్రజలు బండబారిపోయేలా నాశనమయ్యేలా చేసే పనిలో కూడా దేవుడు వారిలో కొందరిని తన స్వంతానికి మిగుల్చుకుంటానని నిశ్చయించుకున్నాడు. ఇదే ఎప్పుడూ దేవుని మార్గం. “మొద్దు”– యెషయా 11:1.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |