Isaiah - యెషయా 62 | View All

1. సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.

“నేను”– ఇలా పలుకుతున్నదెవరు? తరతరాలుగా ఉన్న విశ్వాసులకు ప్రతినిధిగా యెషయాయే ఇలా మాట్లాడుతున్నాడని కొందరి అభిప్రాయం. యెషయా 61:1 లో లాగా ఇక్కడ మాట్లాడుతున్నదీ అభిషిక్తుడేనని మరి కొందరి అభిప్రాయం. రెండో అభిప్రాయమే సరైనదని తోస్తున్నది. అలా మాట్లాడినదెవరైనా కూడా వెల్లడైన సత్యం ఒకటే – జెరుసలం నీతిన్యాయాలతో నిండి, శాశ్వతంగా విముక్తినీ రక్షణనూ అనుభవిస్తుంది – యెషయా 4:3-4; యెషయా 26:1-2; యెషయా 46:13; యెషయా 59:20-21; యెషయా 60:18; యిర్మియా 23:5-6.

2. జనములు నీ నీతిని కనుగొనును రాజులందరు నీ మహిమను చూచెదరు యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట బడును.
ప్రకటన గ్రంథం 2:17, ప్రకటన గ్రంథం 3:12

“జనాలు”– యెషయా 2:2; యెషయా 52:10; యెషయా 60:3. “పేరు”– వ 4,12; యెషయా 1:26.

3. నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.

యెషయా 28:5; జెకర్యా 9:16 పోల్చి చూడండి. కిరీటం రాజకీయాధికారానికి చిహ్నం.

4. విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.

“పాడైందని”– లేవీయకాండము 26:43; యెషయా 5:5-6; యెషయా 6:12; యెషయా 54:6-7; యెషయా 60:15; యిర్మియా 30:17. “హెఫ్సీబా” అంటే “నాకు ఇష్టురాలు” అని అర్థం. “బ్యూలా” అంటే “వివాహిత” అని అర్థం. విడిచిపెట్టబడి, ఎడారిగా మారిన దేశానికీ, నగరానికీ ఈ ఆశ్చర్యకరమైన మార్పు కలుగుతుందని గమనించడం.

5. యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.

అంటే ఇస్రాయేల్‌వారు తిరిగి ఆ దేశాన్ని స్వాధీన పరచుకుంటారు. దేవుడు తిరిగి ఇస్రాయేల్‌ప్రజను తన “భార్య”గా పరిగణిస్తాడు.

6. యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలి వారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.
హెబ్రీయులకు 13:17

మాట్లాడుతున్నది అభిషిక్తుడు లేక తండ్రి అయిన దేవుడు. మాట్లాడినదెవరైనా వెల్లడి అయిన సత్యం మాత్రం ఒకటే. కాపలా వాణ్ణి గురించి యెషయా 52:8; యెషయా 58:10; యిర్మియా 6:17; యిర్మియా 31:16; యెహెఙ్కేలు 3:17; యెహెఙ్కేలు 33:7 చూడండి. జెరుసలంకు పూర్వ క్షేమస్థితి కలిగేవరకూ వారు వదలక ప్రార్థించాలి. “లోకమంతా ప్రసిద్ధి కలగడం” గురించి యిర్మియా 33:9; జెఫన్యా 3:19-20 చూడండి.

7. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ నియు

8. యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు.

ప్రమాణం అనే పదం గంబీరంగా ఖచ్చితంగా ఒక మాటను ఇవ్వడాన్ని సూచిస్తున్నది. ఇచ్చిన మాట ఏమిటంటే జెరుసలంకు తిరిగి పూర్వ క్షేమ స్థితి కలిగిన తరువాత శత్రువు దౌర్జన్యం శాశ్వతంగా నిలిచిపోతుంది.

9. ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో దాని త్రాగుదురు.

“పవిత్రాలయం”– లేవీయకాండము 23:39-40; ద్వితీయోపదేశకాండము 14:22-26 పోల్చి చూడండి.

10. గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.

11. ఆలకించుడి, భూదిగంతములవరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.
మత్తయి 21:5, ప్రకటన గ్రంథం 22:12

“వస్తుంది”– తరువాతి మాటలు బహుమతి ప్రదానాన్ని తెలియజేస్తూ ఉన్నాయి, కాబట్టి ఈ రాక క్రీస్తు రెండవ రాకడ అనడంలో సందేహం లేదు – యెషయా 40:10; మత్తయి 25:14-19; ప్రకటన గ్రంథం 11:18; ప్రకటన గ్రంథం 22:12.

12. పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.

“పవిత్ర”– యెషయా 4:3; యెషయా 26:2; యెషయా 45:25; యెషయా 52:1; యెషయా 60:21. “విడుదల”– యెషయా 35:9; యెషయా 44:23; యెషయా 51:11 క్రీస్తు రెండవ రాకడ తరువాతే ఈ వచనం నెరవేరుతుంది.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |