Isaiah - యెషయా 66 | View All

1. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?
మత్తయి 5:34-35, మత్తయి 23:22, అపో. కార్యములు 7:49-50

యెషయా ద్వారా దేవుడు తన మాటలను కొనసాగిస్తున్నాడు. తన ప్రజలు ఎలాంటివారుగా ఉండాలని తాను కోరుతున్నాడో నొక్కి చెప్తున్నాడు. వారలా అయితే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. తనను, తన వాక్కును నిరాకరించినవారి అంతం ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తున్నాడు. యెషయా 40:21-22; 1 రాజులు 8:27; కీర్తనల గ్రంథము 2:4; మత్తయి 5:34-35; అపో. కార్యములు 7:48-50; అపో. కార్యములు 17:24-25. ఇస్రాయేల్ వారి దేవుడు మహా బలాఢ్యుడైన సృష్టికర్త – యెషయా 40:26; ఆదికాండము 1:1. ఈ విశ్వమంతా కలిసినా ఆయన దృష్టిలో అల్పమే. చేతులతో కట్టిన ఆలయం ఆయనకు అక్కరలేదు. ఆత్మ సంబంధమైన ఆలయం ఆయనకు ఎక్కువ ఇష్టం. అంటే ఆయనలో నమ్మకం ఉంచిన మనుషుల వినయపూరితమైన హృదయాలు, దేహాలే ఆయనకు ఆలయాలు (యెషయా 57:15; 1 కోరింథీయులకు 6:19; ఎఫెసీయులకు 2:21-22). అలాంటివారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఇక్కడున్న హీబ్రూ పదానికి అక్షరార్థం

2. అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట వినివణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.
అపో. కార్యములు 7:49-50

“వారి మీదే నా దృష్టి”– ఇదే మాట ఆదికాండము 4:4-5; నిర్గమకాండము 2:25; సంఖ్యాకాండము 16:15; న్యాయాధిపతులు 6:14; కీర్తనల గ్రంథము 25:16 లో కూడా ఉంది. దీన్లోనే ఆమోదం, అప్యాయత ఇమిడి ఉన్నాయి. వినయం, నలిగిన హృదయం గురించి యెషయా 57:15; కీర్తనల గ్రంథము 51:17; మత్తయి 5:3-4; లూకా 18:13-14; యాకోబు 4:6 చూడండి. దేవుని మాటకు వణకడమంటే మన అయోగ్యతను గుర్తించి, ఆయనకేదన్నా కోపం తెప్పిస్తామేమోనన్న భయంతో, ఆయన పట్ల గౌరవభావంతో ఆయన మాటను పాటించేందుకు వేగిరపాటుతో ఉండడమన్న మాట – ఎజ్రా 9:4; హోషేయ 3:5. కీర్తనల గ్రంథము 2:11; కీర్తనల గ్రంథము 99:1; కీర్తనల గ్రంథము 114:7; యిర్మియా 5:22 పోల్చి చూడండి.

3. ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.

యెషయా 1:11-14 పోల్చి చూడండి. దుర్మార్గుల అర్పణలేవీ దేవునికి అంగీకారం కాదు – సామెతలు 15:8; సామెతలు 21:27. “సొంత మార్గాలు”– యెషయా 53:6; యెషయా 57:17. తమ అసహ్య కార్యాలనుబట్టి ఆనందిస్తున్నారంటే మనుషులు తమ పాపంలో చాలా ముదిరిపోయారన్నమాట. ఫిలిప్పీయులకు 3:18-19 పోల్చి చూడండి.

4. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక పోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక పోయెను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.

5. యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునొందుదురు.
2 థెస్సలొనీకయులకు 1:12

దేవుని వాక్కుకు వినయంతో అణుకువ చూపేవారిని ప్రేమించవలసినవాళ్ళే కొన్నిసార్లు ద్వేషిస్తారు (యెషయా 59:15; కీర్తనల గ్రంథము 38:20; మీకా 7:6; మత్తయి 10:36). “సంతోషం”– యెషయా 5:19; కీర్తనల గ్రంథము 22:8 మొదలైన చోట్లలాగా ఇది ఎత్తి పొడుపు మాట.

6. ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.
ప్రకటన గ్రంథం 16:1-17

“నగరం, దేవాలయం”– యెషయా 64:10-11; యిర్మియా 52:12-14. తన శత్రువులకు ప్రతిక్రియ చేసేందుకు తరచుగా దేవుడు మనుషులను వాడుకొంటాడు (యెషయా 10:5-6).

7. ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది.
ప్రకటన గ్రంథం 12:2-5

ఇది ఇస్రాయేల్ జాతికి ప్రతినిధిగా ఉన్న సీయోను ఫలవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నది. యెషయా 49:14-20; యెషయా 54:1-8 పోల్చి చూడండి. 7వ వచనంలోని “పిల్లవాడు” ఇస్రాయేల్ దేశమే, ఆ జాతే (వ 8). దేశంలోని మార్పు ఎంత మహత్తరంగా ఉంటుందంటే ఆ దేశం, ఆ జనం పూర్తిగా నవనూతనమయ్యాయా అనిపిస్తుంది. యెషయా 4:2-6; యెషయా 11:6-16; యెషయా 27:6; యెషయా 35:1-10 పోల్చి చూడండి. ఇస్రాయేల్‌లోని ఈ మార్పు పురిటి నొప్పులు లేకుండానే హఠాత్తుగా కలుగుతుంది. జెకర్యా 12:10; రోమీయులకు 11:26-27; ప్రకటన గ్రంథం 1:7.

8. అట్టివార్త యెవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను.

9. నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా? అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని నీ దేవుడడుగుచున్నాడు.

10. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి

11. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె దరు.

వ 12; యెషయా 49:23; యెషయా 60:16. వెయ్యేళ్ళ పాలన సమయంలో జెరుసలం ఒక తల్లిలాగా ఉంటుంది. చివరికి అది నమ్మేవారందరికీ తల్లిగా ఉన్న పరమ జెరుసలంకు (గలతియులకు 4:26) నిజమైన ప్రతిబింబంగా ఉంటుంది.

12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.

13. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.

దేవుని వాత్సల్యం తల్లి వాత్సల్యం లాంటిది. జెరుసలం భవిష్యత్తు గురించి దిగులుపడుతూ ఉన్న వారందరినీ ఆయన ఓదారుస్తాడు (యెషయా 40:1-2; యెషయా 49:13-16; యెషయా 54:7-8).

14. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.
యోహాను 16:22

“గడ్డి”– యెషయా 40:6-8 లో లాగా కాదు; యెషయా 44:4 లోని విధంగా. “చెయ్యి”– యెషయా 53:1; ఎజ్రా 7:9; ఎజ్రా 8:31. ఇక్కడి అర్థం తన ప్రజలకు దీవెనలు కలిగించేందుకు పని చేస్తున్న దేవుని శక్తి.

15. ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట కును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.
2 థెస్సలొనీకయులకు 1:8

16. అగ్ని చేతను తన ఖడ్గముచేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును యెహోవాచేత అనేకులు హతులవుదురు.

17. తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు ఇదే యెహోవా వాక్కు.

యెషయా వంటి మహోత్కృష్టమైన పుస్తకంలోని ఇలాంటి శ్రేష్ఠమైన ఆఖరు అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రం నిషేధించిన ఆహారాన్ని తినడం గురించి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది గదా. యెషయా 65:4 కూడా చూడండి. ఇక్కడ చెప్తున్నది అక్షరాలా ఇస్రాయేల్ జాతి గురించే అని దీన్ని బట్టి తెలియదా? వారిలోని దుర్మార్గులు దేవుని ఆజ్ఞల పట్ల తిరస్కార భావం చూపడం ద్వారా బయట పడతారు. ధర్మశాస్త్రంలోని ఆదేశాలన్నిటిలోకీ ఆచరణలో పెట్టడానికి అతి తేలికైనది అశుద్ధ జంతువుల గురించిన ఆజ్ఞ. ఈ ఆదేశాలను పాటించడానికి ఇష్టం లేనివారు ఇక ఇతర ఆజ్ఞలను ఎలా పాటిస్తారు? కొన్ని ఆహార పదార్థాలు తినడం నిషేధం గురించి నోట్స్ లేవీ 11 అధ్యాయంలో చూడండి.

18. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట లాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు.

“తలంపులు”– యెషయా 65:2. “జనాలన్నిటిని”– యోవేలు 3:2; జెఫన్యా 3:8; జెకర్యా 14:2-5. దేవుడు తన ప్రజలను కాపాడడంలోను, వారి శత్రువులను సంహరించడంలోను చూపే పరాక్రమాన్ని, మహిమను ఇస్రాయేల్‌వారి శత్రువులంతా ఎర్ర సముద్రం దగ్గర ఈజిప్ట్ వాళ్ళు చూచినట్టు చూస్తారు (నిర్గమ 14 అధ్యాయం).

19. నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్ద కును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపె దను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహి మను చూడనట్టియుదూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదనువారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.

ఈ సందర్భాన్ని బట్టీ, యెషయా తదితర ప్రవక్తల గ్రంథాల్లోని వాక్కులను బట్టీ చూస్తే ఈ మాటలు రాబోయే వెయ్యేళ్ళ పాలనలోని సంభవాలు కొన్నిటిని వర్ణిస్తున్నాయి. ఇందులో కొన్ని మాటలు క్రొత్త ఒడంబడిక సంఘం కార్యకలాపాలకు సరిపోతున్నాయి, గాని కొన్ని అలా సరిపోవడం లేదు.

20. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్య మును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు చున్నాడు.

21. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియయెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యెషయా 61:6 దగ్గర నోట్. ఈ క్రొత్త ఒడంబడిక యుగంలో విశ్వాసులంతా యాజులే, ప్రత్యేకంగా కొందరని లేదు (1 పేతురు 2:5, 1 పేతురు 2:9). మనకు తెలిసినంతవరకు ఎవరూ లేవీవారుగా పని చేయడం లేదు.

22. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.
2 పేతురు 3:13, ప్రకటన గ్రంథం 21:1

23. ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చె దరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

“శరీరం ఉన్న వారందరూ”అంటూ మానవాళినంతటినీ ఉద్దేశించి రాయడం గమనించండి.

24. వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.
మార్కు 9:48

యెషయాలో తరచుగా కనిపించే అంశం “తిరుగుబాటు” (యెషయా 1:2, యెషయా 1:23; యెషయా 3:1, యెషయా 3:9; యెషయా 60:10; యెషయా 65:2). జెరుసలం నగర వాసులు వెళ్ళి హిన్నోం, తోఫెతు లోయలోకి చూస్తున్న దృశ్యం ఇక్కడ ఉంది (యెషయా 30:33; యిర్మియా 7:31-33; యిర్మియా 19:6). దేవుని పై తిరగబడిన వారందరి అంతం ఇక్కడ తెలుస్తున్నది. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో హిన్నోం నరకానికి సూచనగా ఉంది. ఈ వచనంలో కొంత భాగం మార్కు 9:48 లో రాసి ఉంది. యూదుడైనా ఇతర జాతివాడైనా ఈ వచనంలో రాసివున్న శిక్షను తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇది ఈ పుస్తకం 53వ అధ్యాయం వర్ణించిన వేదన పాలైన అభిషిక్తుణ్ణి ఆశ్రయించడమే.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |