Jeremiah - యిర్మియా 11 | View All

1. యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

2. మీరు ఈ నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను

ఈ ఒడంబడిక నిర్గమ 19–24 అధ్యాయాల్లో దేవుడు మొదటి సారిగా సీనాయి పర్వతం దగ్గర ఇస్రాయేల్‌ప్రజలతో చేసుకున్నది. ఒక జాతిగా వారి ఉనికికి ఆధారం అదే. వారికి ఇలాంటి పరిస్థితుల్లో గుర్తుచేయదగ్గ అతి ప్రాముఖ్యమైన విషయం ఇదే.

3. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లనివాడు శాపగ్రస్తుడగును.

4. ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తినినేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.

5. అందుకు యెహోవా, ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని.

6. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా-నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుముమీరు ఈ నిబంధన వాక్యములను విని వాటి ననుసరించి నడుచుకొనుడి.

దేవుడు చెప్పిన ప్రకారం వారు చెయ్యలేదు. చెయ్యకపోతే ప్రతిగా తానేం చేస్తానని దేవుడు చెప్పాడో ఆ ప్రకారమే వారి పైకి శిక్షను పంపించాడు.

7. ఐగుప్తులోనుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటివరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చితిని; నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చితిని

8. అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖతచొప్పున నడుచుచు వినకపోయిరి; చెవి యొగ్గినవారు కాకపోయిరి, వారు అనుసరింపవలెనని నేను వారి కాజ్ఞాపించిన యీ నిబంధన మాటలన్నిటిననుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటి నన్నిటిని వారిమీదికి రప్పించుచున్నాను.

9. మరియయెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను యూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది.

యోగ్యుడైన యోషీయారాజు ప్రవేశపెట్టిన సంస్కరణలను (2 రాజులు 23 అధ్యాయం) అనుసరించి నడుచుకోకూడదని వారంతా కలిసి సమ్మతించుకొన్నారు. తమ దేవుళ్ళనే పూజిస్తూ ఉంటామని నిశ్చయించుకొన్నారు. తద్వారా దేవుడు తమతో చేసిన ఒడంబడికను మీరుతూ వచ్చారు.

10. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు.

11. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవు చున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును.

వారు కోరి దుష్టత్వాన్నే ఎన్నుకున్నందువల్ల దేవుని న్యాయమైన తీర్పు వారిపైకి రాక మానదు. ఇప్పుడిక దానినుండి తప్పించుకునే మార్గం లేదు. జాలి చూపవలసిందని వారు ఎంత అర్థించినా దేవుడు పట్టించుకోడు (యిర్మియా 14:12; యెహెఙ్కేలు 8:18).

12. యూదాపట్టణస్థులును యెరూష లేము నివాసులును పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు.

యిర్మియా 2:28; ద్వితీయోపదేశకాండము 32:38; న్యాయాధిపతులు 10:14; 1 రాజులు 18:25-29; యెషయా 44:17-18; యెషయా 57:13. కష్ట కాలంలో సహాయం కోసమని మనం ఆశ్రయించకూడని దాన్ని ఆశ్రయిస్తే, ఏ సహాయమూ రాకపోవడం చూచి ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

13. యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి.

“దేవతలు”– యిర్మియా 2:28. ఒక్కడే నిజ దేవుడు ప్రజలకు చాలకపోతే ఇక వారికున్న దేవుళ్ళు ఎంతమందైతే ఏమిటి? బయల్ నీచమైన దేవుడు అని ఇక్కడ రాసి ఉంది. ఈ దేవుడి ఆరాధనలో లైంగిక ఆచారకర్మలు, పాపాలు ఉన్నాయి. న్యాయాధిపతులు 2:11 నోట్ చూడండి.

14. కావున నీవు ఈ ప్రజలనిమిత్తము ప్రార్థనచేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థనచేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను.

దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. యిర్మియా 7:16; యిర్మియా 15:1; 1 యోహాను 5:16 పోల్చి చూడండి.

15. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టు కొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.
ప్రకటన గ్రంథం 20:9

“ప్రియ ప్రజ”– యూదాప్రజలు, దేవుడెన్నుకొన్న జనాంగం. వారు పాపంతో అవిధేయతతో ఎంత నీచానికి దిగజారినప్పటికీ దేవుడు వారినింకా “నా ప్రియ ప్రజ” అంటున్నాడు (యిర్మియా 3:1, యిర్మియా 3:14; యిర్మియా 12:7; పరమగీతము 8:6-7 చూడండి). అయితే ఈ ప్రియ ప్రజలు ప్రవర్తించిన తీరు చూడండి. ఇలాంటివారు దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించినంత మాత్రాన దేవుని తీర్పు మరలి పోదు.

16. అది చక్కని ఫలముగల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను; గొప్ప తుపాను ధ్వనితో దానిమీద మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి.

బైబిల్లో వ్యక్తులను చెట్లతో పోల్చారు (కీర్తనల గ్రంథము 1:3; కీర్తనల గ్రంథము 52:8; కీర్తనల గ్రంథము 128:3). ఇక్కడ ఇస్రాయేల్ జాతి అంతటినీ ఆలీవ్ చెట్టు అంటున్నాడు. దాని కొమ్మలు విరిగిపోతాయని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బబులోను దాడి సమయంలో ఇది ఎంతమట్టుకు నెరవేరినా, యూదులు క్రొత్త ఒడంబడిక కాలంలో క్రీస్తును తృణీకరించిన తరువాత సంపూర్ణంగా నెరవేరింది. రోమీయులకు 11:7-21 చూడండి.

17. ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బయలునకు ధూపార్పణముచేసి నాకు కోపము పుట్టించుటచేత తమంతట తామే చేసిన చెడుతనమునుబట్టి మిమ్మును నాటిన సైన్యములకధిపతియగు యెహోవా మీకు కీడుచేయ నిర్ణయించుకొని యున్నాడు.

18. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను.

యిర్మీయా స్వగ్రామం అనాతోతులోని మనుషులు అతని హత్యకు కుట్ర పన్నారు. సత్యం ప్రకటించడం ఆపాలని వారి ఉద్దేశం. అందుకు వారికి ప్రతిఫలం చావు.

19. అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱెపిల్లవలె ఉంటిని;మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.

“గొర్రెపిల్ల”– కీర్తనల గ్రంథము 44:22; రోమీయులకు 8:36. “గుర్తుకు రాకుండా”– గుర్తుకు రాకుండా సమసిపోయింది వారే. కీర్తనల గ్రంథము 18:25-26 పోల్చి చూడండి.

20. నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము.
1 థెస్సలొనీకయులకు 2:4, ప్రకటన గ్రంథం 2:23

కీర్తనల గ్రంథము 7:9, కీర్తనల గ్రంథము 7:11. “ప్రతీకారం”– యిర్మీయా తానే ప్రతీకారం సాధించలేదు గాని దేవునికే అది వదిలివేశాడు. ఇలాంటి ప్రార్థనల గురించి నోట్స్ చూడండి – కీర్తనల గ్రంథము 35:8; కీర్తనల గ్రంథము 58:6-8; కీర్తనల గ్రంథము 69:22-28.

21. కావున నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు

22. సైన్యముల కధిపతియగు యెహోవా వారినిగూర్చి సెలవిచ్చునదేమనగానేను వారిని శిక్షింపబోవుచున్నాను, వారి ¸యౌవనులు ఖడ్గముచేత చంపబడెదరు, వారి కుమారులును కూమార్తెలును క్షామమువలన చచ్చెదరు;

23. వారికి శేషమేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సర మున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును.

తాను చేసే ప్రతి పనికీ దేవునికి ఒక సమయం అంటూ ఉంది.Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |