Jeremiah - యిర్మియా 13 | View All

1. యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను నీవు వెళ్లి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టు కొనుము, నీళ్లలో దాని వేయకుము.

ఒక సత్యాన్ని వివరించేందుకు మరో ఉదాహరణ సహితమైన పాఠం (యిర్మియా 1:11-14; యిర్మియా 18:1-6; యిర్మియా 24:1-10). పాడై, పనికి రాకుండా పోయిన నడికట్టులాగానే ఇస్రాయేల్ ప్రజలు దేవునికి పనికి రానివారౌతారు (వ 10).

2. కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.

3. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై

4. నీవు కొని నడుమున కట్టుకొనిన నడి కట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా

ఇక్కడ వాడిన హీబ్రూ పదానికి (పెరెత్‌) రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి యూఫ్రటీసు నది, రెండోది అనాతోతు గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్న ‘పరా’ అనే గ్రామం. యూఫ్రటీసునది జెరుసలంకు 400 కిలోమీటర్ల దూరాన ఉంది.

5. యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసునొద్ద దాని దాచిపెట్టితిని.

6. అనేక దినములైన తరువాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసునొద్దకు పోయి, నేను అక్కడ దాచి పెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడనుండి తీసి కొనుమని నాతో చెప్పగా

7. నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసికొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి యుండెను; అది దేనికిని పనికిరానిదాయెను.

8. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

9. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహా గర్వమును నేను భంగపరచుదును.

10. అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విన నొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగు దురు.

11. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

దేవుడు ఇస్రాయేల్‌ను ఎందుకు ఎన్నుకున్నాడో గమనించండి (ఏ ప్రజనైనా, ఏ వ్యక్తినైనా ఆయన ఇందుకే ఎన్నుకొంటాడు). యెషయా 43:21; ఎఫెసీయులకు 1:4-6, ఎఫెసీయులకు 1:12, ఎఫెసీయులకు 1:14; 1 పేతురు 2:9.

12. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడునుప్రతి సిద్దెయు ద్రాక్షా రసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన యెడల

13. నీవు వారితో ఈ మాట చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ దేశనివాసులనందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజుల నేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.

14. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపక పోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింప జేసెదను.

దేవుడు తన హృదయంలోనుంచి, జాలి, కరుణ అంతటినీ తొలగించుకోడు. ఆయన తన స్వభావాన్ని మార్చుకోలేడు, మార్చుకోడు. అలాగని తన దయా దాక్షిణ్యాలు తన న్యాయమైన తీర్పుకు అడ్డు కానివ్వడు.

15. చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.

దేవుని సందేశాన్ని ఎవరన్నా వినిపిస్తూ ఉంటే మనుషులు గర్వంతో విర్రవీగుతూ దాన్ని నిరాకరించే అవకాశం ఎప్పుడూ ఉంది.

16. ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీదేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.

రాబోయే అంధకారాన్ని తొలగించగల ఏకైక మార్గం పశ్చాత్తాపం (1 సమూయేలు 2:9; యెషయా 8:22; యెషయా 59:9; మత్తయి 8:12; యూదా 1:13).

17. అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును.

యిర్మియా 9:1; యిర్మియా 14:17. ఎప్పుడూ కన్నీళ్ళకు ఒక కారణం గర్వం.

18. రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుము మీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.

బహుశా యెహోయాకీన్‌రాజు, అతని తల్లి నెహూష్తా (2 రాజులు 24:8-12. ఇది క్రీ.పూ. 597లో నెరవేరింది).

19. దక్షిణదేశ పట్టణములు మూయబడియున్నవి; వాటిని తెరువగలవాడెవడును లేడు; యూదావారందరు చెరపట్ట బడిరి; ఏమియు లేకుండ సమస్తము కొనిపోబడెను.

20. కన్నులెత్తి ఉత్తరమునుండి వచ్చుచున్నవారిని చూడుడి; నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ నున్నది?

“ఉత్తర దిక్కు”– యిర్మియా 1:14; యిర్మియా 4:6; యిర్మియా 6:22. “మంద”– యూదాప్రజలు.

21. నీవు నీకు స్నేహితులుగా చేసికొనినవారిని ఆయన నీ మీద అధిపతులుగా నియ మించునప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నిన్ను పట్టును గదా?

“మిత్రులు”– సాయంకోసం యూదావారు ఒప్పందం కుదుర్చుకొని చేతులు కలిపిన దేశాలు (యిర్మియా 4:30). “స్త్రీ”– యిర్మియా 4:13; యిర్మియా 6:24.

22. నీవు ఇవి నా కేల సంభవించెనని నీ మనస్సులో అనుకొనినయెడల నీవు చేసిన విస్తారమైన దోషములనుబట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గు నొందెను.

23. కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.

మనిషి తనకు సంబంధించిన చర్మం రంగులాంటి బయటి లక్షణాన్నే మార్చుకోలేడు. అలాంటప్పుడు తన అంతరంగాన్నీ తన బతుకు తీరునంతటినీ ఎలా మార్చుకో గలడు? (కీర్తన 51; యిర్మియా 17:9; రోమీయులకు 7:14, రోమీయులకు 7:18, రోమీయులకు 7:21). అయితే మనిషి తనకు తాను చేసుకోలేనిదాన్ని దేవుడు అతని విషయంలో చెయ్యగలడు (రోమీయులకు 8:1-4). భూమి పైనున్న ఏ మనిషికైనా వేరే ఆశాభావం ఉండకూడదు.

24. కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను.

25. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
రోమీయులకు 1:25

26. కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను.

జెరుసలం ప్రజలు వేశ్యలాగా ప్రవర్తించారు (యిర్మియా 2:2, యిర్మియా 2:5, యిర్మియా 2:20). ఇప్పుడు వారికి బహిరంగంగా అవమానం, శిక్ష కలుగుతాయి.

27. నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచు కొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?

“నీచమైన”– ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోలేరు గాని దేవునివైపుకు తిరిగి శుద్ధి చేయమని మొరపెట్టవచ్చు (కీర్తనల గ్రంథము 51:2, కీర్తనల గ్రంథము 51:7).



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |