Jeremiah - యిర్మియా 16 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. mariyu yehōvaa vaakku naaku pratyakshamai yeelaagu selavicchenu

2. ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొన కూడదు.

2. eesthalamandu neeku kumaarulainanu kumaarthelainanu puṭṭakuṇḍunaṭlu neevu vivaahamu chesikona kooḍadu.

3. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

3. ee sthalamandu puṭṭu kumaarulanu goorchiyu, kumaarthelanugoorchiyu, vaarini kanina thallulanugoorchiyu, ee dheshamulō vaarini kanina thaṇḍrulanu goorchiyu yehōvaa eelaagu selavichuchunnaaḍu

4. వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.

4. vaaru ghōramaina maraṇamu nondedaru; vaarinigoorchi rōdhanamu cheyabaḍadu, vaaru paathipeṭṭabaḍaka bhoomimeeda peṇṭa vale paḍiyuṇḍedaru, vaaru khaḍgamuchethanu kshaamamuchethanu nashin̄chedaru; vaari shavamulu aakaashapakshulakunu bhoojanthuvulakunu aahaaramugaa uṇḍunu.

5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరినిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు

5. yehōvaa eelaagu selavichuchunnaaḍunēnu ee prajalaku naa samaadhaanamu kaluganiyyakayu vaariyeḍala naa krupaavaatsalyamulanu choopakayu unnaanu ganuka rōdhanamucheyu iṇṭilōniki neevu pōkumu, vaarinigoorchi aṅgalaarchuṭaku pōkumu, evarinini ōdaarchuṭaku veḷlakumu; idhe yehōvaa vaakku

6. ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొన కుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు.

6. ghanulēmi alpulēmi yee dheshamandunnavaaru chanipōyi paathipeṭṭabaḍaru, vaari nimitthamu evarunu aṅgalaarchakunduru, evarunu thammunu thaamu kōsikona kunduru, vaari nimitthamu evarunu thammunu thaamu bōḍi chesikonakunduru.

7. చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు; ఒకని తండ్రి యైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు.

7. chachinavaarinigoorchi janulanu ōdaarchuṭaku aṅgalaarpu aahaaramu evarunu pan̄chipeṭṭaru; okani thaṇḍri yainanu thalliyainanu chanipōyenani yevarunu vaariki ōdaarpu paatranu traaganiyyakunduru.

8. వారియొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందు శాలలో ప్రవేశింపకూడదు.

8. vaariyoddha koorchuṇḍi annapaanamulu puchukonuṭaku neevu vindu shaalalō pravēshimpakooḍadu.

9. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండ మాన్పించెదను.
ప్రకటన గ్రంథం 18:23

9. sainyamulakadhipathiyu ishraayēlu dhevuḍunaina yehōvaa eelaagu selavichu chunnaaḍu mee kannula eduṭanē mee dinamulalōnē santhooshadhvanini aanandadhvanini peṇḍlikumaaruni svaramunu peṇḍlikumaarthe svaramunu ee chooṭa vinabaḍakuṇḍa maanpin̄chedanu.

10. నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారుదేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాప మేమి? అని నిన్నడుగగా

10. neevu ee maaṭalanniyu ee prajalaku teliya jeppina tharuvaatha vaarudhenibaṭṭi yehōvaa maaku ee ghōrabaadha anthayu niyamin̄chenu? Maa dhevuḍaina yehōvaaku virōdhamugaa maa dōshamēmi? Maapaapa mēmi? Ani ninnaḍugagaa

11. నీవు వారితో ఇట్లనుము యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి.

11. neevu vaarithoo iṭlanumu yehōvaa ee maaṭa selavichuchunnaaḍu mee pitharulu nannu viḍichi anya dhevathalanu anusarin̄chi poojin̄chi vaaṭiki namaskaaramu cheyuṭanu baṭṭiyē gadaa vaaru naa dharmashaastramunu gaikonaka nannu visarjin̄chiri.

12. ఆలకించుడి; మీరందరు నా మాట వినకుండ కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు; మీరు మీ పితరులకంటె విస్తారముగా చెడుతనము చేసి యున్నారు.

12. aalakin̄chuḍi; meerandaru naa maaṭa vinakuṇḍa kaṭhinamaina mee dushṭa hrudaya kaaṭhinyamu choppuna naḍuchukonuchunnaaru; meeru mee pitharulakaṇṭe visthaaramugaa cheḍuthanamu chesi yunnaaru.

13. కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీ పితరు లైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు.

13. kaabaṭṭi nēnu meeyandu ēmaatramunu dayayun̄chaka, yee dheshamunuṇḍi meerainanu mee pitharu lainanu erugani dheshamunaku mimmunu veḷlagoṭṭuchunnaanu; akkaḍa meeru divaaraatramu anyadhevathalanu koluchuduru.

14. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట

14. yehōvaa selavichu maaṭa ēdhanagaa nēnu vaari pitharulakichina dheshamunaku vaarini marala rappin̄chedanu ganuka raabōvu dinamulalō aigupthu dheshamulō nuṇḍi ishraayēleeyulanu rappin̄china yehōvaa jeevamuthooḍani ikameedaṭa

15. అనక ఉత్తరదేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.

15. anaka uttharadheshamulō nuṇḍiyu aayana vaarini tharimina dheshamulanniṭilō nuṇḍiyu ishraayēleeyulanu rappin̄china yehōvaa jeevamuthooḍani janulu pramaaṇamu cheyuduru.

16. ఇదే యెహోవా వాక్కు వారిని పట్టుకొనుటకు నేను చాల మంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతముమీదనుండియు ప్రతి కొండమీద నుండియు మెట్టల సందులలోనుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను.

16. idhe yehōvaa vaakku vaarini paṭṭukonuṭaku nēnu chaala mandi jaalarulanu pilipin̄chedanu. tharuvaatha prathi parvathamumeedanuṇḍiyu prathi koṇḍameeda nuṇḍiyu meṭṭala sandulalōnuṇḍiyu vaarini vēṭaaḍi thoolivēyuṭakai anēkulaina vēṭagaaṇḍranu pilipin̄chedanu.

17. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.

17. yēlayanagaa vaaru pōyina trōvalanniṭi meeda drushṭi yun̄chithini, ēdiyu naa kannulaku marugu kaalēdu, vaari dōshamunu naaku marugaiyuṇḍadu.

18. వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్ర పరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంతలుగా వారికి ప్రతికారము చేసెదను.

18. vaaru thama hēyadhevathala kaḷēbaramulachetha naa dheshamunu apavitra parachiyunnaaru, thama hēyakriyalathoo naa svaasthyamunu nimpiyunnaaru ganuka nēnu modaṭa vaari dōshamunu baṭṭiyu vaari paapamunu baṭṭiyu reṇḍanthalugaa vaariki prathikaaramu chesedanu.

19. యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు.
రోమీయులకు 1:25

19. yehōvaa, naa balamaa, naa durgamaa, aapatkaalamandu naa aashrayamaa, bhoodiganthamulanuṇḍi janamulu nee yoddhaku vachimaa pitharulu vyarthamunu maayaa roopamunu nish‌prayō janamunagu vaaṭini maatramu svathantrin̄chukonirani cheppuduru.

20. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.

20. narulu thamaku dhevathalanu kalpin̄chukonduraa? Ayinanu avi daivamulu kaavu.

21. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును.

21. kaabaṭṭi naa naamamu yehōvaa ani vaaru telisikonunaṭlu nēnu ee saari vaariki anubhavamu kalugajēthunu, naa balamunu naa shauryamunu enthaṭivō vaariki teliyajēthunu.Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |