Jeremiah - యిర్మియా 2 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

2. నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా - నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగనిదేశములోను, నన్ను వెంబడించుచు నీ ¸యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

3. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు.

4. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి.

5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?

6. ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు.

7. దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్యాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.

8. యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్‌ప్రయోజనమైనవాటిని అనుసరింతురు

9. కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు.

10. కీత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?

11. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.
గలతియులకు 4:8

12. ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.

13. నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
ప్రకటన గ్రంథం 7:17, ప్రకటన గ్రంథం 21:6

14. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను?

15. కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశము పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడా యెను.

16. నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి.

17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గ ములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.

18. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.

19. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయ భక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సెల విచ్చుచున్నాడు.

20. పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితినినేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.

21. శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటి తిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతాన మైతివి?

22. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.

23. నేను అపవిత్రత నొందినదానను కాను, బయలు దేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు,

24. అరణ్యమునకు అల వాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి యుండదు, దాని మాసములో అది కనబడును.

25. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొన కుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవుఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు.

26. దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలుకుటుంబము వారు సిగ్గుపడుదురునీవు మా తండ్రివని మ్రానుతోనునీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు, వారును వారి రాజులును వారి అధిపతులును వారి యాజకులును వారి ప్రవక్తలును అవమానము నొందుదురు.

27. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములోలేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.

28. నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించు నేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.

29. మీరందరు నామీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు.

30. నేను మీ పిల్లలను హతముచేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించు చున్నది.

31. ఈ తరమువార లారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడినేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?

32. కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.

33. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.

34. మరియు నిర్ధోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడు చున్నది.

35. అయినను నీవునేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పు కొనుచున్నావు. ఇదిగోపాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది.

36. నీ మార్గము మార్చు కొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.

37. చేతులు నెత్తిని బెట్టుకొని ఆ జనమునొద్దనుండి బయలు వెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవుడు తన ప్రజలతో విశదపరుస్తాడు. (1-8) 
బలమైన ప్రారంభంతో ప్రారంభించి, తమ ప్రయత్నాలను కొనసాగించడంలో విఫలమైన వారు వారి ప్రారంభంలో ఆశాజనకంగా మరియు ఆశాజనకంగా ప్రారంభించినందుకు విమర్శలను ఎదుర్కొంటారు. తమ విశ్వాసాన్ని విడిచిపెట్టే వారు తరచుగా దానిని ఎన్నడూ ఎదుర్కోని వారి కంటే తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వారి విషయంలో, చెల్లుబాటు అయ్యే సాకు లేదు. దేవుని ఆధ్యాత్మిక అనుచరులు ఆత్మకు తీవ్రమైన ముప్పును కలిగించే ఈ ప్రపంచంలోని ద్రోహపూరిత ప్రయాణం ద్వారా వారిని సురక్షితంగా నడిపించినందుకు ఆయనకు ఋణపడి ఉన్నారని గుర్తించాలి. ఒకప్పుడు పూర్తిగా ప్రభువుకు అంకితం చేయబడినట్లు కనిపించిన ఎందరో వ్యక్తులు, వారి విశ్వాసం వారి అతిక్రమణలను మరింత తీవ్రతరం చేసే జీవితాలను ముగించడం ఎంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. మన జ్ఞానం పెరిగేకొద్దీ మన ఉత్సాహం మరియు ఆవేశం తగ్గకుండా చూసుకోవడానికి మనం జాగ్రత్తగా ఉందాం.

ఉదాహరణకి మించిన వారి తిరుగుబాటు. (9-13) 
దేవుడు పాపులపై శిక్ష విధించే ముందు, వారిని పశ్చాత్తాపపడమని, వారిని హృదయ మార్పునకు నడిపించాలని కోరతాడు. దేవుని నుండి వచ్చిన ఈ విన్నపం మనల్ని మనం ఏమి చేయమని కోరుతున్నామో ప్రతిబింబిస్తుంది. దేవుని దయ మరియు అనుగ్రహం నుండి ఇష్టపూర్వకంగా తమను తాము దూరం చేసుకునే వారికి రాబోయే కోపం మరియు శాపం గురించి భయపడటం చాలా ముఖ్యం.
క్రీస్తులో కనిపించే కృప ఒక ఫౌంటెన్ నుండి వచ్చే నీటితో పోల్చవచ్చు: అది రిఫ్రెష్, శుద్ధి మరియు మనల్ని ఫలవంతం చేస్తుంది. ఇది తరచుగా జీవజలంగా వర్ణించబడింది ఎందుకంటే ఇది ఆత్మీయంగా చనిపోయిన వారిని పునరుజ్జీవింపజేస్తుంది, క్షీణిస్తున్న సాధువుల జీవితాలను నిలబెట్టుతుంది, శాశ్వతమైన జీవితానికి దారి తీస్తుంది మరియు ఎడతెగకుండా ప్రవహిస్తుంది. ఈ జీవనాధారమైన ఫౌంటెన్‌ను విడిచిపెట్టడం అనేది ప్రారంభ తప్పు, ఇది దేవుని ప్రజలు అతని బోధనలు మరియు శాసనాలను నిర్లక్ష్యం చేసినప్పుడు సంభవిస్తుంది. బదులుగా, వారు నీటిని పట్టుకోలేని విరిగిన తొట్టెలను తమ కోసం రూపొందించుకుంటారు. ఈ సారూప్యత ప్రాపంచిక కార్యకలాపాలు మరియు మానవ ఆవిష్కరణల యొక్క శూన్యతను ప్రతిబింబిస్తుంది మరియు వాటిపై ఆధారపడినప్పుడు.
ప్రభువును మాత్రమే అంటిపెట్టుకుని ఉండేందుకు దృఢమైన మరియు అచంచలమైన నిబద్ధతను చేద్దాం, మనం మరెక్కడికి తిరగగలం? బూటకపు ఔత్సాహికుల మరియు కపటుల యొక్క బోలు ఆనందాలకు బదులుగా మనం పరిశుద్ధాత్మ యొక్క సౌలభ్యాన్ని విడిచిపెట్టడానికి ఎంత అవకాశం ఉంది!

బాధలకు కారణం అపరాధం. (14-19) 
ఇజ్రాయెల్‌ను కేవలం సేవకుడిగా పరిగణించాలా? కాదు, వారు అబ్రాహాము వంశస్థులు. మనం దీనిని ఆధ్యాత్మికంగా కూడా అర్థం చేసుకోవచ్చు: మానవ ఆత్మ బంధంలో ఉందా? లేదు, అది ఉండకూడదు, కానీ అది తరచుగా తన స్వంత స్వేచ్ఛను లొంగిపోతుంది, వివిధ కోరికలు మరియు కోరికలకు బానిసలుగా మారుతుంది. క్రూరమైన సింహాలవలె అష్షూరు పాలకులు ఇశ్రాయేలును జయించారు, ఈజిప్టు నుండి వచ్చిన ప్రజలు వారి పతనానికి కారణమయ్యారు, వారి కీర్తి మరియు బలాన్ని తొలగించారు. ప్రభువును విడిచిపెట్టిన పర్యవసానంగా వారికి ఈ విపత్తులు సంభవించాయి. దిద్దుబాటు నాశనానికి దారితీయకుండా ఉండటానికి, ఒకరి పాపాలకు పశ్చాత్తాపం చెందడం దీని నుండి నేర్చుకోవలసిన పాఠం. నిషేధించబడిన భోగము, పనికిమాలిన మరియు పాపభరితమైన ఉల్లాసం లేదా దురాశ మరియు ఆశయ సాధనల మార్గాలలో క్రైస్తవునికి ఏ వ్యాపారం ఉంది?

యూదా పాపాలు. (20-28) 
వారికి అన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ విషపూరిత పండ్లను ఉత్పత్తి చేసే అడవి తీగను పోలిన స్థితికి దిగజారింది. తరచుగా, జంతువులు తమ ప్రవృత్తితో ఉన్నట్లుగా ప్రజలు తమ అదుపులేని కోరికలు మరియు పాపభరితమైన కోరికల ద్వారా తమను తాము చిక్కుకున్నట్లు కనుగొంటారు. అయినప్పటికీ, దేవుడు ఇక్కడ ఒక హెచ్చరికను జారీ చేస్తాడు, చివరికి వేదన మరియు బాధలకు దారితీసే ప్రయత్నాలలో తమను తాము అలసిపోవద్దని వారికి సలహా ఇస్తున్నాడు.
మన పాపాల క్షమాపణకు అది సరిపోతుందని దృఢంగా విశ్వసిస్తూ, దేవుని కరుణపై మనం ఎన్నటికీ నిరీక్షణ కోల్పోకూడదన్నట్లుగా, మనం కూడా దేవుని కృపపై విశ్వాసాన్ని నిలుపుకోవాలి, మన అంతర్గత అవినీతిని ఎంత భయంకరంగా అనిపించినా వాటిని జయించగల సామర్థ్యాన్ని గుర్తించాలి.

వారి తప్పుడు విశ్వాసం. (29-37)
దేశం దేవుని తీర్పులచే ప్రభావితం కాలేదు మరియు బదులుగా తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. ప్రపంచాన్ని తమ నివాసంగా మరియు తమ ఏకైక అన్వేషణగా చేసుకున్న వారికి, అది నిర్జనమైన అరణ్యంగా మరియు చీకటి రాజ్యంగా మారుతుంది. దీనికి విరుద్ధంగా, దేవునిలో నిలిచివుండే వారు తమను తాము సంతోషకరమైన మరియు సమృద్ధిగా ఉన్న పరిస్థితులలో కనుగొంటారు.
ఇక్కడ, ఆత్మసంతృప్తి పొందిన పాపుల యొక్క స్వీయ-భరోసా భాష మనకు ఎదురవుతుంది. యూదులు చాలా కాలంగా దేవుని గూర్చిన గంభీరమైన ఆలోచనను విడిచిపెట్టారు. ఆయనను సముచితంగా స్మరించుకోకుండానే మన జీవితంలో ఎన్ని రోజులు గడిచిపోతాయో! వారి స్వావలంబన పట్ల ప్రభువు అసంతృప్తి చెందాడు మరియు వారికి విజయం ఇవ్వడానికి నిరాకరించాడు. వారి తెలివైన పథకాలు ఉన్నప్పటికీ, ప్రజలు పాపం యొక్క మార్గంలో ఆనందాన్ని కనుగొనలేరు లేదా దానికి సమర్థనను కనుగొనలేరు. వారు ఒక పాపం నుండి మరొక పాపానికి మారవచ్చు, కానీ ఎవ్వరూ దేవుణ్ణి ధిక్కరించలేదు లేదా ఆయన నుండి దూరంగా ఉండి అభివృద్ధి చెందలేదు.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |