Jeremiah - యిర్మియా 27 | View All

1. యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏల నారంభించినప్పుడు యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1. yoodhaaraajaina yōsheeyaa kumaaruḍagu yehōyaakeemu ēla naarambhin̄chinappuḍu yehōvaa yoddhanuṇḍi vaakku yirmeeyaaku pratyakshamai yeelaagu selavicchenu.

2. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.

2. yehōvaa naaku ee aagna ichuchunnaaḍu neevu kaaḍini palupulanu cheyin̄chukoni nee meḍaku kaṭṭukonumu.

3. వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.

3. vaaṭini yerooshalēmunaku yoodhaaraajaina sidkiyaayoddhaku vachina doothalachetha edōmu raajunoddhakunu mōyaabu raajunoddhakunu ammōneeyula raajunoddhakunu thooru raajunoddhakunu seedōnu raajunoddhakunu pampumu.

4. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియ జేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా

4. mariyu aa doothalu thama yajamaanulaku teliyajēyavalenani yee aagna vaarithoo cheppumu meeru mee yajamaanulaku teliya jēyavalenani sainyamulakadhipathiyaina ishraayēlu dhevuḍu selavichunadhemanagaa

5. అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.

5. adhika balamuchethanu chaachina baahuvuchethanu bhoomini bhoomimeedanunna narulanu janthuvulanu nēnē srujin̄chi, evarikichuṭa nyaayamani naaku thoochunō vaarikē yichuchunnaanu.

6. ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.

6. ippuḍaithē dheshamulanniṭini naa daasuḍagu babulōnu raajaina nebukadrejaru vashamu cheyuchunnaanu; athani sēvin̄chuṭakai bhoojanthuvulanukooḍa athani vashamu cheyuchunnaanu.

7. అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.

7. athani svadheshamunaku kaalamu vachuvaraku samasthajanulu athanikini athani kumaarunikini athani kumaaruni kumaarunikini daasulaiyunduru, aa kaalamu raagaa bahujanamula mahaaraajulu athanichetha daasyamu cheyin̄chukonduru.

8. ఏ జనము ఏ రాజ్యము బబులోనురాజైన నెబుకద్రెజరు నకు దాస్యము చేయనొల్లక బబులోనురాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనముచేయించు వరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.

8. ē janamu ē raajyamu babulōnuraajaina nebukadrejaru naku daasyamu cheyanollaka babulōnuraajuyokka kaaḍini thana meḍameeda peṭṭukonadō daanini nēnu athani chetha botthigaa naashanamucheyin̄chu varaku aa janamunu khaḍgamuchethanu kshaamamu chethanu teguluchethanu shikshin̄chedanu; idhe yehōvaa vaakku.

9. కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి.

9. kaabaṭṭi mee pravakthalēmi sōdegaaṇḍrēmi kalalu kanuvaarēmi kaalagnaanulēmi mantragnulēmi meeru babulōnu raajunaku daasulu kaakundurani meethoo palukunapuḍu meeru vaarini lakshya peṭṭakuḍi.

10. మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు.

10. meeru mee bhoomini anubhavimpakuṇḍa mimmunu dooramugaa thoolivēyunaṭlunu, mimmunu nēnu veḷlagoṭṭunaṭlunu, meeru nashin̄chunaṭlunu vaaru abaddha pravachanamulu meeku prakaṭinthuru.

11. అయితే ఏ జనులు బబులోనురాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండ నిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.

11. ayithē ē janulu babulōnuraaju kaaḍi krindiki thama meḍanu van̄chi athaniki daasyamu cheyudurō aa janulanu thama dheshamulō kaapuramuṇḍa nicchedanu. Vaaru thama bhoomini sēdya parachukonduru, nēnu vaariki nemmadhi kalugajēthunu; idhe yehōvaa vaakku.

12. నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని బబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైన యెడల మీరు బ్రదుకుదురు

12. nēnu aa maaṭalanubaṭṭi yoodhaaraajaina sidkiyaathoo iṭlaṇṭini babulōnuraajuyokka kaaḍini mee meḍa meeda peṭṭukoni, athanikini athani janulakunu daasulaina yeḍala meeru bradukuduru

13. బబులోనురాజునకు దాసులుకానొల్లని జనులవిషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలును చావనేల?

13. babulōnuraajunaku daasulukaanollani janulavishayamai yehōvaa aagna ichinaṭlu khaḍgamuchethanainanu kshaamamuchethanainanu tegulu chethanainanu neevunu nee prajalunu chaavanēla?

14. కావునమీరు బబులోను రాజునకు దాసులుకాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్దమే ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారి మాటల నంగీకరింపవద్దు, ఇదే యెహోవా వాక్కు.

14. kaavunameeru babulōnu raajunaku daasulukaakundurani meethoo cheppu pravakthalu abaddamē prakaṭin̄chuchunnaaru, nēnu vaarini pampalēdu, vaari maaṭala naṅgeekarimpavaddu, idhe yehōvaa vaakku.

15. నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించు నట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవ చించుచున్నారు. మరియు యాజకులతోను ఈ ప్రజలందరితోను నేను ఈ మాటలు చెప్పితిని
మత్తయి 7:22

15. nēnu mimmunu thoolivēyunaṭlunu, meerunu meethoo pravachin̄chu mee pravakthalunu nashin̄chu naṭlunu, vaaru naa naamamunubaṭṭi abaddhamugaa prava chin̄chuchunnaaru. Mariyu yaajakulathoonu ee prajalandarithoonu nēnu ee maaṭalu cheppithini

16. యెహోవా సెలవిచ్చునదేమనగాయెహోవా మందిరపు ఉపకరణ ములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనునుండి మరల తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి.

16. yehōvaa selavichunadhemanagaayehōvaa mandirapu upakaraṇa mulu ippuḍē sheeghramugaa babulōnunuṇḍi marala thēbaḍunani pravachimpu mee pravakthalu meethoo abaddhamulu cheppuchunnaaru, vaari maaṭalaku cheviyoggakuḍi.

17. వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల?

17. vaari maaṭa vinakuḍi; babulōnu raajunaku daasulainayeḍala meeru bradukuduru; ee paṭṭaṇamu paaḍaipōnēla?

18. వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు.

18. vaaru pravakthalainayeḍala, yehōvaa vaakku vaariki thooḍaiyuṇḍinayeḍala, yehōvaa mandiramulōnu yoodhaaraaju mandiramulōnu yerooshalēmulōnu shēshin̄chiyuṇḍu upakaraṇamulu babulōnunaku konipōbaḍakuṇḍunaṭlu vaaru sainyamulakadhipathiyagu yehōvaanu bathimaalukonuṭa mēlu.

19. బబులోను రాజైన నెబుకద్రెజరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారుడైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానుల నందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు

19. babulōnu raajaina nebukadrejaru yerooshalēmulōnuṇḍi yehōyaakeemu kumaaruḍaina yekōnyaanu yoodhaa yerooshalēmula pradhaanula nandarini babulōnunaku cheragaa theesikonipōyinappuḍu

20. అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చియు సముద్రమును గూర్చియు గడమంచెలను గూర్చియు ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను గూర్చియు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
మత్తయి 1:11

20. athaḍu viḍichipeṭṭina sthambhamulanu goorchiyu samudramunu goorchiyu gaḍaman̄chelanu goorchiyu ee paṭṭaṇamulō migilina upakaraṇamulanu goorchiyu sainyamulakadhipathiyagu yehōvaa eelaagu selavichuchunnaaḍu.

21. యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు

21. yehōvaa mandiramulōnu yoodhaaraaju nagarulōnu yerooshalēmulōnu shēshin̄china upakaraṇamulanugoorchi ishraayēlu dhevuḍunu sainyamulakadhipathiyunaina yehōvaa eelaagunanē selavichuchunnaaḍu

22. అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు.

22. avi babulōnunaku thēbaḍunu, nēnu aa upakaraṇamulanu darshin̄chi teppin̄chi yee sthalamulō vaaṭini marala nun̄chu kaalamu varaku avi akkaḍa nuṇḍavalenu; idhe yehōvaa vaakku.Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |