యిర్మీయా ఇతర జనాలకు కూడా ప్రవక్త (యిర్మియా 1:5, యిర్మియా 1:10). ఇక్కడ ఇతడు దైవ సందేశాన్ని కొన్ని జాతులకు పంపుతున్నాడు. మెడ పై కాడి పెట్టుకోవడం ఈ సందేశాన్ని మరింత మనస్సుకు హత్తుకుపోయేలా చెప్పడం అన్నమాట. సందేశం యూదావారికి ఇచ్చిన సందేశమే. వారితో మాట్లాడుతూ యెహోవాదేవుడు తాను మహామహుడైన సృష్టికర్తననీ, విశ్వానికి పరిపాలకుడననీ చెప్తున్నాడు (వ 5). ఇతరులనుండి వచ్చే హానికరమైన తప్పుడు సందేశాల విషయం హెచ్చరిస్తున్నాడు (వ 9,10. ద్వితీయోపదేశకాండము 18:9-12 పోల్చి చూడండి). ఈ విధంగా దేవుడు ఇస్రాయేల్ ఇరుగుపొరుగున ఉన్న జనాల గురించి తన శ్రద్ధను వెల్లడి చేస్తున్నాడు. ఆ జనాలలో కొన్ని తన ప్రజల పాలిట అకాల శత్రువులే.